ఎండ వేడికి ఫుల్లుగా డీహైడ్రేట్ అయిపోయి, నీరసంగా అనిపిస్తుందా? ఎన్ని కూల్ డ్రింక్స్ తాగినా క్షణికమైన చల్లదనం తప్ప, నిజమైన రిఫ్రెష్‌మెంట్ దొరకడం లేదా? అయితే మీ కోసం ఒక అల్టిమేట్ కూలింగ్ డ్రింక్ రెసిపీ రెడీగా ఉంది! ఇది తాగితే అబ్బా అనకుండా ఉండలేరు. ఒక్క గుటకతో మీ నాలుక, గొంతు మాత్రమే కాదు మొత్తం బాడీ కూల్ అయిపోతుంది. రుచి గురించి ఆలోచిస్తున్నారా.. సందేహమే అక్కర్లేదు మార్కెట్లో దొరికే ఏ కూల్ డ్రింక్ దీని రుచి ముందు సరిపోదు. అంతేకాదు.. ఇది మీ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులో ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, కలర్స్ లేవు... అంతా నాచురల్ గుడ్‌నెస్!
మండుటెండలో తిరిగి ఇంటికి రాగానే, ఫ్రిజ్‌లో చల్లగా ఉన్న ఈ డ్రింక్‌ను చేతిలోకి తీసుకుని తాగారంటే చల్లగా కమ్మగా ఆహా అనిపిస్తుంది. ఇది జస్ట్ మీ దాహాన్ని తీర్చే డ్రింక్ మాత్రమే కాదు. మీ బాడీని వెంటనే కూల్ చేస్తుంది. మీకు తక్షణ శక్తినిస్తుంది, మీ మూడ్‌ను కూడా లిఫ్ట్ చేస్తుంది! ప్రముఖ ఫిట్‌నెస్ నిపుణులు నితేష్ సోని పరివార్ పరిచయం చేసిన ఈ డ్రింక్ ఈ సమ్మర్‌లో మీ ఫేవరెట్ డ్రింక్ కాబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు! ఇంకెందుకు ఆలస్యం ఈ అమేజింగ్, సీక్రెట్ డ్రింక్ రెసిపీ ఏంటో వెంటనే తెలుసుకుందాం రండి.
దీన్ని మీరు ఒకేసారి బాటిల్ లో తయారు చేసి పెట్టుకుని రోజంతా కావాల్సినప్పుడు కూడా తాగచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ దీన్ని ఆస్వాదించవచ్చు. దీని రుచి అందరికీ కచ్చితంగా నచ్చతుంది. కావాలంటే ట్రై చేసి చూడండి.
సోంపు గింజలు సహజమైన శీతలీకరణ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇది వేసవిలో శరీరాన్ని చల్లగా, రిఫ్రెషింగ్ గా ఉంచడానికి సహాయపడతాయి.
సోంపు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, ఇది ఆహారం బాగా జీర్ణం కావడానికి, ఉబ్బరం, గ్యాస్ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. మిరియాలు, నల్ల ఉప్పు కూడా జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. కడుపులో ఆమ్లతను తగ్గిస్తాయి.
ఈ డ్రింక్‌లో నీరు ఉంటుంది, ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. నిమ్మరసం కూడా ఎలక్ట్రోలైట్‌లను అందిస్తుంది.
నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడానికి సహాయపడుతుంది. మిరియాలు కూడా రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి.
నిమ్మరసం శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది. నల్ల ఉప్పు కూడా శరీరాన్ని శుభ్రపరచడానికి సహాయపడుతుంది.
సోంపు ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది, తద్వారా కేలరీల తీసుకోవడం తగ్గుతుంది. మిరియాలు జీవక్రియను పెంచడానికి సహాయపడతాయి.
నిమ్మరసంలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి,ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
సోంపులో ఫైటోఈస్ట్రోజెన్‌లు ఉంటాయి, ఇవి హార్మోన్ల సమతుల్యతను కాపాడటానికి సహాయపడతాయి.
నల్ల ఉప్పులో పొటాషియం ఉంటుంది, ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
నల్ల ఉప్పులో ఉండే ఖనిజాలు కీళ్ల నొప్పులను తగ్గించడానికి సహాయపడతాయి.
సంబంధిత కథనం