Kiss On Beard : ఈ విషయం తెలిస్తే స్త్రీలు గడ్డంపై ముద్దుపెట్టుకోరు.. ఖతమ్.. టాటా.. బైబై-be careful women who kiss men with beard heres why ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kiss On Beard : ఈ విషయం తెలిస్తే స్త్రీలు గడ్డంపై ముద్దుపెట్టుకోరు.. ఖతమ్.. టాటా.. బైబై

Kiss On Beard : ఈ విషయం తెలిస్తే స్త్రీలు గడ్డంపై ముద్దుపెట్టుకోరు.. ఖతమ్.. టాటా.. బైబై

Anand Sai HT Telugu
Nov 17, 2023 02:00 PM IST

Kiss On Beard Problems : అబ్బా మా వాడి గడ్డం బాగుంటుంది.. ముద్దు ముద్దుగా అనిపిస్తుంది. ముద్దుపెట్టుకుంటా.. ఇలాంటి కలలే కంటారు అమ్మాయిలు. కానీ గడ్డంపై ముద్దుపెట్టుకోవద్దు అంటున్నారు నిపుణులు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

వందలో 70 మంది అమ్మాయిలకు అబ్బాయిలు గడ్డంతో ఉంటేనే ఇష్టం. అదో స్టైలీ లుక్. చూసేందుకు బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్‍ను గడ్డం పెంచమని మరం చేసే అమ్మాయిలు చాలా మందే ఉన్నారు. భర్తలను గడ్డంతో చూసి హ్యాపీగా ఫీల్ అయ్యే భార్యలూ ఉన్నారు. చూసేవరకూ ఒకే.. కొందరు మాత్రం మా వాడి గడ్డం సూపరో.. సూపర్ అని తెగ ముద్దులు పెట్టేస్తారు. కానీ ఇవే తగ్గించుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

పొడవాటి గడ్డం పెంచడం ప్రస్తుతం ట్రెండ్. ఫ్యాషన్ పేరుతో చాలా మంది గడ్డాలు పెంచుతున్నారు. కొంతమంది చలికాలంలో అయితే అస్సలు షేవింగ్ చేసుకోరు.. తపస్సులా గడ్డం పెంచేస్తారు. పురుషులకు ఈ లుక్ నిజానికి బాగుంటుంది. వారి అందాన్ని మరింత పెంచుతుందని చెప్పవచ్చు. కానీ, ఇది వారి భాగస్వామికి మంచిది కాదు. మీరు షేవ్ చేయకుండా మీ భాగస్వామి వద్దకు వెళితే ఆమె సమస్యలను ఎదుర్కొంటుంది. దీంతో ఆమెకు కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు.

ముఖ్యంగా పురుషుల గడ్డం వల్ల మహిళలకు అనేక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. గడ్డంలో చాలా ప్రమాదకరమైన బ్యాక్టీరియా(Bacteria) ఉంటుంది. మీరు ఒక అమ్మాయితో ప్రైవేట్‍గా ఇంటరాక్ట్ అయినప్పుడు, మీ ముఖంతో ఆమె ముఖాన్ని తాకడం వల్ల సమస్యలు వస్తాయి. ఆమె ముఖం దెబ్బతినే అవకాశం ఉంది. చర్మంపై ప్రమాదాన్ని పెంచుతుంది.

మందపాటి గడ్డంతో ఉన్న వ్యక్తిని ముద్దుపెట్టుకునే స్త్రీకి ఇంపెటిగో వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక రకమైన స్కిన్ ఇన్ఫెక్షన్, అంటువ్యాధి. ఇది సంభవించినట్లయితే, చర్మంపై ఎర్రటి దద్దుర్లు కనిపిస్తాయి. ఇది తీవ్రమైన సమస్య కాదు. అయితే ఇది మహిళలను చికాకుపెడుతుంది. యాంటీబయాటిక్ క్రీమ్ లేదా మాత్రలు తీసుకోవడం ద్వారా ఇంపెటిగోను నయం చేయవచ్చు. కొన్నిసార్లు ఇది మిమ్మల్ని తీవ్రంగా, అసహ్యంగా మార్చగలదు.

గడ్డం మీద కొంతమంది అమ్మాయిలు కోరుకుతారు. ఇలాంటి సమయంలో హానికరమైన బ్యాక్టీరియా లోపలికి వెళ్లే అవకాశం ఉంది. చాలామంది మగవారు తల వెంట్రుకలపై పెట్టిన శ్రద్ధ, గడ్డంపై పెట్టరు. ఈ కారణంగా సూక్ష్మక్రిములు అక్కడ పేరుకుపోయి ఉంటాయి. మీ ప్రియమైన వారు మీ గడ్డం మీద ముద్దు పెడితే.. హానికరమైన బ్యాక్టీరియాతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.

అంతేకాకుండా కొంతమంది మహిళలకు గడ్డాలు, మీసాలు శృంగారం సమయంలో చికాకుపెడతాయి. అలాగే దీని వల్ల చాలా ఇబ్బందులు పడేవారూ ఉన్నారు. వేసవిలో గడ్డం ట్రిమ్ చేసినట్లే చలికాలంలో గడ్డం కూడా కత్తిరించుకోండి అంటున్నారు నిపుణులు. గడ్డాలపై చాలా పరిశోధనలు జరిగాయి. గడ్డం లేని వారి కంటే గడ్డం ఉన్నవారు శుభ్రంగా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి

ఎందుకంటే గడ్డం ఉన్నప్పుడు ముఖ చర్మాన్ని నేరుగా తాకలేరు. గడ్డం అందంగా ఉండాలంటే పురుషులు దానికి కొన్ని క్రీమ్స్ రాసుకోవడమే కాకుండా శుభ్రంగా ఉంచుకోవడంపై కూడా ఎక్కువ శ్రద్ధ చూపుతారు. అయితే గడ్డం ఉన్న పురుషుల నుంచి మహిళలు పారిపోతారని మరో అధ్యయనం వెల్లడించింది. గడ్డం ఉన్న వ్యక్తి కోపంగా, అహంకారంతో కనిపిస్తాడని అధ్యయనంలో పాల్గొన్న చాలా మంది మహిళలు చెప్పారు.

వాస్తవానికి, ఈ గడ్డం కొన్ని సందర్భాల్లో అడ్డంకిగా ఉందని కొందరు మహిళలు పేర్కొన్నారు. దీంతో భాగస్వామిని సరిగా ముద్దుపెట్టుకోలేకపోయామని అంటున్నారు. కొంతమంది మహిళలు క్లీన్ షేవ్ చేసిన వ్యక్తి మిస్టర్ క్లీన్ అని నమ్ముతారు.

గడ్డం ఉన్న పురుషులు క్లీన్ షేవ్ చేయడానికి ఇష్టపడరు. చలికాలం అయినా, వర్షాకాలం అయినా గడ్డం పెంచుకుంటూనే ఉంటారు. మీ గడ్డాన్ని అందమైన ఆకృతిలో ఉంచుకోవచ్చు. రెగ్యూలర్‍గా షాంపూతో కడగాలి, కండీషనర్ అప్లై చేయాలి. ముఖ్యంగా గడ్డానికి సంబంధించిన అనేక ఉత్పత్తులు మార్కెట్లో లభిస్తాయి. వాటిని వాడుతూ, గడ్డాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటే మీ భాగస్వామికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

Whats_app_banner