Bathukamma songs: ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయొప్పునే గౌరమ్మ.. పూర్తి పాట మీకోసం..-bathukamma top songs with complete lyrics top songs ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bathukamma Songs: ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయొప్పునే గౌరమ్మ.. పూర్తి పాట మీకోసం..

Bathukamma songs: ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయొప్పునే గౌరమ్మ.. పూర్తి పాట మీకోసం..

Koutik Pranaya Sree HT Telugu
Oct 18, 2023 05:32 PM IST

Bathukamm songs: బతుకమ్మ పాటల్లో కొన్ని మనం చాలా రోజుల నుంచి వింటూ వస్తున్నవి ఉంటాయి. అలాంటి పాటల పూర్తి లిరిక్స్ HT Telugu సేకరించింది.

బతుకమ్మ పాటలు
బతుకమ్మ పాటలు

మన ప్రాంతంలో మనం ఎక్కువసార్లు విన్న పాటలు కొన్ని ఉంటాయి. చాలా మంది నోళ్లలో నానే పాటలవి. అలాంటి వాటిలో ఒకటి ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ పాట. ఆపాట పూర్తి లిరిక్స్ మీకోసం.

ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ పాట లిరిక్స్..

ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ..

ఏమేమి కాయొప్పునే గౌరమ్మ..

తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ..

తంగేడు కాయొప్పునే గౌరమ్మ..

తంగేడు చెట్టు కింద ఆట..

సిల్కాలార పాట సిల్కాలారా..

కల్కి సిల్కాలారా కందుమ్మ..

గుడ్డలు రానువోను అడుగులు..

తీరుద్ద ఆశలు తారు గోరంటలు..

గణమైన పొన్న పువ్వే గౌరమ్మ..

గజ్జాల ఒడ్డానమే గౌరమ్మ..

ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ..

ఏమేమి కాయొప్పునే గౌరమ్మ..

గుమ్మడి పువ్వొప్పునే గౌరమ్మ..

గుమ్మడి కాయొప్పునే గౌరమ్మ

గుమ్మడి చెట్టు కింద ఆట

సిల్కాలార పాట సిల్కాలారా

కల్కి సిల్కాలారా కందుమ్మ గుడ్డలు

రానువోను అడుగులు

తీరుద్ద ఆశలు తారు గోరంటలు

గణమైన పొన్న పువ్వే గౌరమ్మ

గజ్జాల ఒడ్డానమే గౌరమ్మ..

ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ..

ఏమేమి కాయొప్పునే గౌరమ్మ..

రుద్రాక్ష పువ్వొప్పునే గౌరమ్మ..

రుద్రాక్ష కాయొప్పునే గౌరమ్మ..

రుద్రాక్ష చెట్టు కింద..

ఆట సిల్కాలార పాట సిల్కాలారా..

కల్కి సిల్కాలారా కందుమ్మ గుడ్డలు..

రానువోను అడుగులు..

తీరుద్ద ఆశలు తారు గోరంటలు..

గణమైన పొన్న పువ్వే గౌరమ్మ..

గజ్జాల ఒడ్డానమే గౌరమ్మ

ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ

ఏమేమి కాయొప్పునే గౌరమ్మ

కాకర పువ్వొప్పునే గౌరమ్మ

కాకర కాయొప్పునే గౌరమ్మ

కాకర చెట్టు కింద ఆట

సిల్కాలార పాట సిల్కాలారా

కల్కి సిల్కాలారా కందుమ్మ గుడ్డలు

రానువోను అడుగులు

తీరుద్ద ఆశలు తారు గోరంటలు

గణమైన పొన్న పువ్వే గౌరమ్మ

గజ్జాల ఒడ్డానమే గౌరమ్మ

ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ

ఏమేమి కాయొప్పునే గౌరమ్మ

చామంతి పువ్వొప్పునే గౌరమ్మ

చామంతి కాయొప్పునే గౌరమ్మ..

చామంతి చెట్టు కింద ఆట

సిల్కాలార పాట సిల్కాలారా

కల్కి సిల్కాలారా కందుమ్మ గుడ్డలు..

రానువోను అడుగులు

తీరుద్ద ఆశలు తారు గోరంటలు..

గణమైన పొన్న పువ్వే గౌరమ్మ..

గజ్జాల ఒడ్డానమే గౌరమ్మ

ఆ పూలు తెప్పించి పూజించి

గంధములు కడిగించి కుంకుమల జాడించి

నీ నోము నీకిత్తుమే గౌరమ్మ

మా నోము మాకియ్యవే గౌరమ్మ..

నీ నోము నీకిత్తుమే గౌరమ్మ

మా నోము మాకియ్యవే గౌరమ్మ..

నీ నోము నీకిత్తుమే గౌరమ్మ..

మా నోము మాకియ్యవే గౌరమ్మ..

సేకరణ: HT తెలుగు

సంబంధిత కథనం