Winter Bath: చలికాలంలో నీటిలో వీటిని కలుపుకుని స్నానం చేస్తే అందం, పైగా అదృష్టం కలిసొస్తుంది
Winter Bath: ప్రతిరోజూ స్నానం చేయడం చాలా ముఖ్యం. దీని వల్ల శరీరంపై ఉన్న మురికి తొలగిపోతుంది. చలి కాలంలో స్నానమంటేనే ఎంతో మంది భయపడిపోతారు.నీటిలో ఇక్కడ చెప్పిన పదార్థాలను కలిపి స్నానం చేయడం వల్ల మీ అందం పెరగడమే కాకుండా మీ జీవితంలోకి అదృష్టాన్ని కూడా ఆహ్వానించవచ్చు.
స్నానం దినచర్యలో ముఖ్యమైన భాగం. ఉదయం లేచాక శరీరాన్ని శుభ్రపరచుకున్నాకే ఏ పనినైనా మొదలుపెట్టేవారు ఎంతో మంది. కొంతమంది శీతాకాలంలో స్నానం చేయడానికి ఇష్టపడకరు. ఈ చలిలో ఎవరు స్నానం చేస్తారు అనుకుంటూ ఉంటారు. కానీ స్నానం చేయడం అత్యవసరం. స్నానం చేయడం వల్ల శరీరంపై ఉన్న మురికిని శుభ్రపరచడమే కాదు, మనశ్శాంతి కూడా లభిస్తుంది. జ్యోతిషశాస్త్రం, వాస్తు శాస్త్రంలో కూడా స్నానం చాలా ముఖ్యమైనదని చెబుతున్నారు. మన పురాతన గ్రంథాలలో స్నానం అదృష్టాన్ని, ఆనందాన్ని, శ్రేయస్సును పెంచుతుందనే ప్రస్తావన ఉంది. ఇది మాత్రమే కాదు, స్నానం అందాన్ని, ఆకర్షణను పెంపొందించడానికి సహాయపడుతుంది. స్నానం చేసే నీటిలో కొన్ని వస్తువులను వేసి ఆ నీటిలో స్నానం చేయడం వల్ల శరీరాం శుభ్రపరచడమే కాదు, అన్ని రకాలుగా కలిసి వస్తుంది.
స్నానపు నీటిలో వేయాల్సిన పదార్థాలు
చిటికెడు పసుపు
ప్రతి భారతీయ వంటగదిలో పసుపు ఉంటుంది. ఇది ఆహారం రంగు, రుచిని పెంచుతుంది. స్నానం చేసే నీటిలో దీన్ని కలుపుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నీటిలో చిటికెడు పసుపుతో స్నానం చేయడం వల్ల అదృష్టం పెరుగుతుందని చెబుతారు. పసుపులోని శుద్ధి గుణాలు అన్ని రకాల ప్రతికూల శక్తులను తొలగిస్తాయి. ప్రతిరోజూ స్నానం చేసే కలిపే నీటిలో పసుపు కలపాలి. స్నానం చేస్తే, ఇది మీ చర్మాన్ని శుభ్రపరచడానికి, చర్మపు రంగును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
వేప ఆకులు
వేప ఆకులు అధికంగానే బయట దొరుకుతాయి. వేపలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. శరీరాన్ని లోతుగా శుభ్రపరచడానికి ఇందులోని గుణాలు పనిచేస్తాయి.అలర్జీలు, దురద, దద్దుర్లు వంటి ఇతర చర్మ సమస్యలకు కూడా ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం స్నానం చేసే నీటిలో వేప నీళ్లు వేసి స్నానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా చేయడం వల్ల శరీరంలో కొత్త, పాజిటివ్ ఎనర్జీ వచ్చి అన్ని రకాల నెగిటివిటీ తొలగిపోతుంది. దీని కోసం స్నానపు నీటిలో వేప ఆకులు, వేప నూనె లేదా వేప పొడి ఏదైనా కలుపుకోవచ్చు.
తులసి ఆకులు
తులసి మొక్క మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. స్నానపు నీటిలో తులసి ఆకులు లేదా తులసి ఆకుల రసాన్ని కలిపి తీసుకుంటే చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తులసి ఆకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అనేక చర్మ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో ఇది చాలా సహాయపడుతుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం తులసి ఆకులతో స్నానం చేయడం వల్ల నెగిటివిటీ తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది.
గులాబీ రేకులు
స్నానపు నీటిలో గులాబీ ఆకులను కలపడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. శతాబ్దాలుగా గులాబీని చర్మ సంరక్షణ ఔషధాల్లో ఉపయోగిస్తున్నారు. గులాబీ రేకులను నీటిలో కలిపి స్నానం చేయడం వల్ల చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారడమే కాకుండా దాని సువాసన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. గులాబీ ఆకుల నీటితో స్నానం చేయడం వల్ల జీవితంలో ప్రేమ, ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని అంటారు. అదృష్టం కూడా పెరుగుతుందని నమ్ముతారు.
గంధం నూనె
కొన్ని చుక్కల గంధపు నూనెను నీటిలో కలిపి స్నానం చేయవచ్చు. గంధాన్ని అందాన్ని పెంచుకోవడానికి శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. గంధం పొడిని లేదా కొన్ని చుక్కల గంధపు నూనెను నీటిలో కలిపి స్నానం చేయడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఇది మీ చర్మాన్ని మెరుగుపరుస్తుంది. సువాసనను అందిస్తుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జీవితంలో సానుకూలతను ఆకర్షించడానికి కూడా ఇది పనిచేస్తుంది. మనసుకు తాజాదనాన్ని, ఓదార్పును ఇస్తుంది.