Ayurveda for Diabetes: ఇన్సులిన్‍ను పెంచి.. మధుమేహాన్ని కంట్రోల్ చేసేందుకు ఆయుర్వేద చిట్కాలు
Ayurveda Tips for Diabetes: డయాబెటిస్ కంట్రోల్‍లో ఉండేందుకు ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలు ఉన్నాయి. శరీరంలో ఇన్సులిన్‍ను పెంచి మధుమేహాన్ని నియంత్రిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలివే..
ప్రస్తుత కాలంలో డయాబెటిస్‍తో చాలా మంది బాధపడుతున్నారు. ఆయుర్వేదం ద్వారా కూడా డయాబెటిస్‍ను కంట్రోల్ చేసుకోవచ్చని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకోవచ్చని అంటున్నారు. కొన్ని ఆయుర్వేద విధానాలు పాటిస్తే శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుందని చెబుతున్నారు.
వీటిని తీసుకుంటే..
కఫ దోషలో అసమతుల్యత కారణంగానే డయాబెటిస్ స్థితి వస్తుందని ఉజాల సైగ్నస్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్, ఫౌండర్ డాక్టర్ సుచిన్ బజాజ్.. హెచ్‍టీ లైఫ్‍స్టైల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. డయాబెటిస్‍ను మధుమేహం, ప్రమేహ అని కూడా అనొచ్చని తెలిపారు.
“పసుపు, ఉసిరి, మెంతులు, వేప తీసుకోవడం వల్ల జీవక్రియను మెరుగుపరుస్తుంది. వీటి వల్ల ప్యాంక్రియాటిక్ కణాలు పునరుత్పత్తి అవుతాయి. కణాల నిరోధకత తగ్గుతుంది. వాటిని తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇవి సహజంగా డయాబెటిస్ కంట్రోల్ చేసుకునే మార్గంగా ఉంది” అని సుచిన్ తెలిపారు.
“డయాబెటిస్ నియంత్రణకు ఆయుర్వేద విధానం చాలా సమగ్రహమైనది. సమస్య మూల కారణాన్ని పరిష్కరించేందుకు ఆహారం, జీవనశైలి, ఔషద మూలికలను ఆయుర్వేదం సూచిస్తుంది. కార్బొహైడ్రేట్లను తీసుకోవడం బాగా తగ్గించి.. చేదుగా ఉండే కూరగాయలు, బార్లీ, నెయ్యి వంటి వాటిని ఆహారంలో తీసుకోవాలి. ఆయుర్వేద ఆహారాలను తీసుకోవడం వల్ల రక్తంలో చెక్కర స్థాయిలు స్థిరంగా ఉండేందుకు తోడ్పడతాయి. తులసి, వేప, బిల్వ పత్రాలతో తయాలు చేసినవి తినడం వల్ల ఇన్సులిన్ సెన్సివిటీ అధికం అవుతుంది. ఆయుర్వేదం మధుమేహాన్ని నియంత్రించటంతో పాటు దానికి సంబంధిత సమస్యలను కూడా నివారించగలదు. ఆరోగ్యానికి ఆయుర్వేదం చాలా మేలు చేస్తుంది” అని ఆయన స్పష్టం చేశారు.
ప్రభావంతంగా..
శరీరంలో బ్లడ్ షుగర్ లెవెళ్లను ఆయుర్వేదం ప్రభావవంతంగా నియంత్రిస్తుందని షియోపాల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఆయుర్వేద నిపుణులు మూల్ మీనా తెలిపారు. “ఆయుర్వేదం ద్వారా డయాబెటిస్‍ను కంట్రోల్‍లోకి తెచ్చుకునే ప్రక్రియ.. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలోకి వచ్చేందుకు సహకరించటంతో పాటు పూర్తి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మెంతులు, గుగ్గుల్, పొడపత్రి (గుర్మార్) లాంటి మూలికల ద్వారా ప్రకృతి శక్తిని ఆయుర్వేదం ఉపయోగించుకుంటుంది. ఇన్సులిన్ ఉత్పత్తిపిని పెంచడం, ప్యాంక్రియాటిక్ ఆరోగ్యానికి మేలు చేయడం, గ్లూకోజ్ శోషణను తగ్గించడం ద్వారా డయాబెటిస్‍ను ఆయుర్వేదం నియంత్రిస్తుంది” అని మీనా వెల్లడించారు.
ఆయుర్వేద మూలికలు డయాబెటిస్‍కు ఎలా సహకరిస్తాయో ఆయన వివరించారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణే కాకుండా ఓవరాల్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని తెలిపారు. మధుమేహం మూల కారణాలపై ఆయుర్వేదం ప్రభావంతంగా పని చేస్తుందని వెల్లడించారు.
“ఉదాహణకు శుధ్ గుగ్గుల్ జీవక్రియను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో ఉండేందుకు ఉపకరిస్తుంది. గ్లూకోజ్ స్థాయిని కంట్రోల్ చేసేందుకు మెంతులు ఉపయోగపడతాయి. గుర్మార్‌ను షుగర్ నాశినిగా పిలుస్తారు. తీపి పదార్థాలు తినాలనే కోరికను ఇది తగ్గిస్తుంది. ఈ ఆయుర్వేద మూలికలను రోజువారి తీసుకుంటే డయాబెటిస్ మూల కారణాలను తగ్గించవచ్చు. మధుమేహ సమస్యను పరిష్కరించవచ్చు. డయాబెటిస్ కోసం ఆయుర్వేదాన్ని పాటిస్తే రక్తంలో చక్కెర స్థాయి తగ్గడం పాటు పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది” అని మూల్ మీనా వెల్లడించారు.