Chanakya Niti Telugu : ఇలాంటి వ్యక్తులను మీ జీవితంలోకి అస్సలు రానివ్వకండి-avoid these type of people in your life for peace according to chanakya niti ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chanakya Niti Telugu : ఇలాంటి వ్యక్తులను మీ జీవితంలోకి అస్సలు రానివ్వకండి

Chanakya Niti Telugu : ఇలాంటి వ్యక్తులను మీ జీవితంలోకి అస్సలు రానివ్వకండి

Anand Sai HT Telugu Published Jun 09, 2024 08:00 AM IST
Anand Sai HT Telugu
Published Jun 09, 2024 08:00 AM IST

Chanakya Niti In Telugu : చాణక్య నీతి ప్రకారం జీవితంలో కొందరిని అస్సలు దగ్గరకు రానివ్వకూడదు. ఎందుకంటే వారితో మీకు చెడు ఎక్కువగా జరుగుతుంది. కొందరి ప్రవర్తనతో మీ జీవితాన్ని నరకం చేసుకుంటారు.

చాణక్య నీతి
చాణక్య నీతి

శతాబ్దాల క్రితం చాణక్యుడు చెప్పినది నేటికీ వర్తిస్తుంది. చాణక్య నీతిలో మానవ జీవితాన్ని సరళంగా, విజయవంతం చేయడానికి సంబంధించిన అనేక విషయాలను పేర్కొన్నాడు. అందులో జీవితంలోని అన్ని విషయాలపై సలహాలు ఇచ్చాడు. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో సంపద, ఆస్తి, భార్య, స్నేహం, వివాహం వంటి అన్ని విషయాల గురించి లోతుగా చెప్పాడు.

నేటికీ ప్రజలు చాణక్యుడి సూత్రాలను అనుసరిస్తారు. జీవితంలో విజయం సాధించడానికి చాణక్యుడి మాటలు ఎంతగానో ఉపయోగపడతాయి. చాణక్యుడి ప్రకారం తన స్నేహితుడు ఎవరో, తన శత్రువు ఎవరో తెలిసినవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు. మీరు జీవితంలో విజయవంతంగా ముందుకు సాగాలంటే, చాణక్యుడి సలహాలను పాటించాలి. ఆయన ప్రకారం జీవితంలో విజయం సాధించాలంటే కొంతమంది వ్యక్తులకు దూరంగా ఉండాలి.

కోపం తెచ్చుకునే వ్యక్తులు

చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకునే వ్యక్తులు తమకే కాదు ఇతరులకు కూడా సమస్యలు సృష్టిస్తుంటారు. అలాంటి దృక్పథం ఉన్న వ్యక్తులు తమ తప్పును ఎప్పటికీ గుర్తించరు. ఎల్లప్పుడూ ఏది సరైనది, ఏది తప్పు అని అర్థం చేసుకోలేరు. చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకునే వ్యక్తిని ఎప్పుడూ నమ్మవద్దు. వారికి దూరంగా ఉండటం ఉత్తమం.

స్వార్థపరులు

స్వార్థపరుడు ఎప్పుడూ తన స్వలాభం కోసమే అన్ని పనులు చేస్తాడు. అలాంటి వారు అవకాశం ఇస్తే ఎవరికైనా హాని చేస్తారు. సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చే వారికి దూరంగా ఉండాలని చాణక్యుడు చెబుతాడు. అలాంటి వ్యక్తులు కొన్నిసార్లు సమస్యలు ఉన్నప్పుడు మీ సమస్యను మరింత చేసేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి వ్యక్తులు ఎవరికీ సహాయం చేయరు.

అబద్ధాలు

మంచి ప్రయోజనం కోసం అబద్ధాలు చెప్పడం సరైనదే. అయితే కొందరు చిన్న చిన్న విషయాలకు కూడా అబద్ధాలు చెబుతుంటారు. అలాంటి వ్యక్తులు మిమ్మల్ని ఎప్పుడైనా మోసం చేయవచ్చు. అలాంటి వారిని ఎప్పుడూ నమ్మవద్దు. వారికి దూరంగా ఉండమని చాణక్య నీతి చెబుతుంది.

పొగిడేవారు

అనవసరంగా ఇతరులను పొగిడే వారికి ఎప్పుడూ దూరంగా ఉండండి. అలాంటి వ్యక్తి మీ లోపాల గురించి నిజం చెప్పకుండా మిమ్మల్ని చీకటిలో ఉంచుతాడు. తమ లాభం కోసం మిమ్మల్ని తప్పుగా స్తుతిస్తారు. మీ శక్తి, డబ్బు చూసి దగ్గరకు వచ్చేవారు మీకు ప్రమాదకరంగా మారతారు అని చాణక్యనీతి చెబుతుంది.

మోసం చేసేవారు

ఇతరులను మోసం చేసే వ్యక్తులు మీ స్నేహితులు అయినప్పటికీ, కొన్నిసార్లు మిమ్మల్ని మోసగించవచ్చు. అవకాశం దొరికితే వారు మిమ్మల్ని, మీ విశ్వాసాన్ని నాశనం చేస్తారు. అలాంటి వ్యక్తి నుండి దూరంగా ఉండటం మంచిది.

రహస్యాలను దాచలేనివారు

చాణక్య నీతి ప్రకారం.. ఇతరుల రహస్యాలను దాచలేని వ్యక్తి నిజానికి ప్రమాదకరం. అలాంటి వారికి ఏదైనా రహస్యం చెబితే వారు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేయడానికి ఉపయోగిస్తారు. రహస్యాలను దాచుకోలేని వ్యక్తి మీ జీవితంలో చాలా నష్టాన్ని కలిగిస్తారు. అలాంటి వారికి ఎప్పుడూ దూరంగా ఉండటం మంచిది. చాణక్య నీతి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆయన చెప్పిన సూత్రాలను పాటిస్తే జీవితం ముందుగు వెళ్లేందుకు ఆస్కారం ఉంది.

Whats_app_banner