Kidney Foods: చలికాలంలో కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే వీటిని తినడం వెంటనే మానేయండి-avoid eating these immediately to avoid kidney stones during winters ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kidney Foods: చలికాలంలో కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే వీటిని తినడం వెంటనే మానేయండి

Kidney Foods: చలికాలంలో కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే వీటిని తినడం వెంటనే మానేయండి

Haritha Chappa HT Telugu
Dec 08, 2024 02:00 PM IST

Kidney Foods: శీతాకాలం వచ్చిందంటే శరీరానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలి. ఈ కాలంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి అనారోగ్యాలు కూడా వస్తాయి. కిడ్నీల కోసం చలికాలంలో ఏం తినకూడదో తెలుసుకోండి.

కిడ్నీల కోసం ఏం తినాలి?
కిడ్నీల కోసం ఏం తినాలి? (Pixabay)

చలికాలం ప్రభావం కిడ్నీలపై ఎక్కువగా ఉంటుంది. కిడ్నీలో పనితీరును మెరుగుపరిచే ఆహారాన్ని ప్రత్యేకంగా తీసుకోవాలి. మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగించే ఆహారాన్ని దూరం పెట్టాలి. మన శరీరంలో కాలేయం, గుండె, కిడ్నీలు వంటివి ఎంతో ముఖ్యమైన అవయవాలు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా వీటిని కాపాడుకోవాలి. చాలామంది చలికాలంలో దాహం వేస్తేనే నీరు తాగుతారు. దాహం వేయకపోతే నీరు తాగరు. చల్లగా ఉండే వాతావరణంలో దాహం వేయదు. అలాగని నీరు తాగడం మానేస్తే కిడ్నీలు దెబ్బతింటాయి. సాధారణంగా మీరు ఎంత నీటిని తాగుతారో అంత నీటిని చలికాలంలో కూడా తాగాల్సిందే. అప్పుడే కిడ్నీలు సరిగ్గా పనిచేస్తాయి. వ్యర్ధాలను సమర్ధవంతంగా ఫిల్టర్ చేసి బయటికి పంపిస్తాయి. అలాగే ఆరోగ్యానికి మేలు చేసే సూపులను, హెర్బల్ టీలను కూడా కిడ్నీల కోసం తాగాల్సిన అవసరం ఉంది.

yearly horoscope entry point

మూత్రపిండాల్లో రాళ్లు

చలికాలం ప్రారంభం కాగానే ఎంతో మందికి ఆరోగ్య సమస్యలు బయటపడుతూ ఉంటాయి. శారీరక శ్రమ లేకపోవడం ఎక్కువసేపు కూర్చునే ఉండడం లేదా నిద్రపోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం వంటివి కూడా ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తాయి. దీనివల్ల అధిక రక్తపోటు పెరగడం, శరీరం డిహైడ్రేషన్ బారిన పడడం వంటివి కలుగుతాయి. అలాగే శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరానికి చెమట తక్కువగా పడుతుంది. అప్పుడు శరీరంలో ఉన్న సోడియం మూత్రపిండాల్లో రాళ్లుగా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి చెమట పట్టేలా నడక, వ్యాయామం వంటివి చేయడం అలవాటు చేసుకోండి.

మీరు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకుంటే మూత్రపిండాలు చక్కగా పనిచేస్తాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాన్ని తగ్గిస్తాయి. ప్రతిరోజూ 8 నుంచి 10 గ్లాసుల నీటిని కచ్చితంగా తీసుకోండి. మీకు తీవ్ర అలసటగా అనిపిస్తున్న తలనొప్పి వస్తున్న డీహైడ్రేషన్ వల్ల ఈ సమస్య వస్తుందేమోనని ఆలోచించండి. వెంటనే నీళ్లు తాగండి.

కిడ్నీల కోసం ఏం తినకూడదు?

కిడ్నీలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మీరు కొన్ని రకాల ఆహారాలను చలికాలంలో దూరం పెట్టాలి. ముఖ్యంగా ఉప్పగా ఉండే పదార్థాలను దూరం పెట్టండి. ఉప్పును తినడం తగ్గించండి. ఆహారంలో ఉప్పు తక్కువైనా కూడా సర్దుకుపోండి. కానీ మరి కాస్త ఉప్పుని కలుపుకొని తినకండి. ఇవన్నీ కూడా కిడ్నీలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. రక్తపోటును పెంచేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను పెరిగేలా చేసి మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి ఉప్పు నిండుగా ఉండే ఆహారాలు, ప్రాసెస్ చేసిన స్నాక్స్ వంటివి దూరం పెడితే మంచిది. అలాగే అధిక కొవ్వులు ఉండే ఆహారాన్ని కూడా దూరం పెట్టాలి. మటన్ ఎక్కువగా తినకపోవడం మంచిది. చేపలు మితంగా చికెన్ వంటివి తీసుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం చేయడం మాత్రం మర్చిపోవద్దు. రోజుకు అరగంట పాటు వ్యాయామం చేయడం వల్ల కిడ్నీ సమస్యలు రాకుండా ఉంటాయి. చల్లని వాతావరణంలో మీ మూత్రపిండాలు ఉత్సాహంగా పనిచేయాలంటే వ్యాయామం అత్యవసరం.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner