Infertility in Men: పిల్లలు పుట్టకపోవడానికి మగవారు ఎంత వరకు కారకులు? ఆటంకం కలిగించే కారణాలేంటి?-at what extent are men responsible for not having children what are the factors that hinder it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Infertility In Men: పిల్లలు పుట్టకపోవడానికి మగవారు ఎంత వరకు కారకులు? ఆటంకం కలిగించే కారణాలేంటి?

Infertility in Men: పిల్లలు పుట్టకపోవడానికి మగవారు ఎంత వరకు కారకులు? ఆటంకం కలిగించే కారణాలేంటి?

Ramya Sri Marka HT Telugu

Infertility in Men: పిల్లలు పుట్టకపోవడానికి కారణం స్త్రీ, పురుషులిద్దరూ అని అందరికీ తెలిసిందే. పురుషులు వ్యంధ్యత్వానికి గురి కావడానికి కారణాలేంటి? కేవలం జీవనశైలి మాత్రమే మీ సంతానోత్పత్తిని అడ్డుకుంటోందా? ఏయే అంశాలు, మిమ్మల్ని తండ్రులు చేయడానికి ఆటంకం కలిగిస్తున్నాయో తెలుసుకోండి.

పిల్లలు పుట్టకపోవడానికి మగవారెంత వరకు కారకులు (Image by Pixabay)

పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు లేకపోవడం చాలా బాధించే విషయం. దాంపత్య జీవితం ఎంత ప్రశాంతంగా ఉన్నా పదేపదే వేధించే ప్రశ్న ఇది. ఈ విషయంలో స్త్రీ, పురుషులిద్దరిలో ఎవరిలో లోపమున్నా పిల్లలు కలగరని మనకు తెలిసిందే. అదే మగవారిలో లోపముంటే దానిని వ్యంధ్యత్వం అంటారు. అంటే ఒక సంవత్సరం పాటు క్రమం తప్పకుండా పిల్లలు పుట్టడం కోసం ప్రయత్నించి విఫలమైతే దానిని వ్యంధ్యత్వం అని పిలుస్తారు. ఇది ప్రత్యేకించి మగవారి గురించి మాత్రమే.

పురుష వంధ్యత్వాన్ని ఎలా పరీక్షిస్తారంటే:

డాక్టర్ వందనా రామనాథన్ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'మగవారి మెడికల్ హిస్టరీ, ఫిజికల్ ఫిట్‌నెస్, వీర్యం విశ్లేషణ ఆధారంగా పురుష వంధ్యత్వాన్ని నిర్ధారిస్తారు. స్పెర్మ్ కౌంట్, వీర్యకణాల చలనం, వాటి ఆకారం వంటి అంశాలు వీర్యం నాణ్యతను అంచనా వేయడానికి సహాయపడుతుంది. ఈ పరీక్షలో వీర్యాన్ని కచ్చితంగా విశ్లేషిస్తారు. సంతానోత్పత్తి కలగడానికి గల కారణాలను విశ్లేషించి తగిన చికిత్సను సూచిస్తారు. పురుష వంధ్యత్వం తరచుగా పలు కారణాల వల్ల సంభవిస్తుంది. అదే విధంగా హార్మోన్ల అసమతుల్యత కారణంగా స్పెర్మ్ ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. స్పెర్మ్ (వీర్యం) నాణ్యత లేనప్పుడే వ్యంధ్యత్వం కలుగుతుంది" అని వెల్లడించారు.

స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేసే కారకాలు

  • స్పెర్మ్ ఉత్పత్తి, దాని పనితీరును ప్రభావితం చేసే అనేక అంశాలు ఇలా ఉన్నాయి.
  • జెనెటికల్‌గా ఉండే సమస్యలైన క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటివి వీర్యంలో నాణ్యతను తగ్గిస్తాయి.
  • వృషణాల చుట్టూ సిరల విస్తరించేందుకు కారణమయ్యే వరికోసెల్ సమస్య వీర్య ఉత్పత్తిని తగ్గించేస్తుంది.
  • వృషణాలలో నుంచి వేడి బహిర్గతం కాకుండా చేయడం వల్ల కూడా స్పెర్మ్ ఉత్పత్తి తగ్గడానికి దారితీస్తుంది.
  • వృషణ గాయాలు లేదా టోర్షన్ కలగడం రక్త ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. స్పెర్మ్ ఉత్పత్తిపై ప్రభావం చూపించి, చాలా వరకూ ఉత్పత్తిని తగ్గించేస్తుంది.
  • గవదబిళ్ళలు వంటి అంటువ్యాధులు, ఇవి స్పెర్మ్ ఉత్పత్తిని దెబ్బతీస్తాయి.
  • టాక్సిన్స్, పురుగుమందులకు గురికావడం, ఇది స్పెర్మ్ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.
  • కీమోథెరపీ, రేడియేషన్తో సహా పలు క్యాన్సర్ చికిత్సలు తీసుకున్న వారిలో కూడా సంతానోత్పత్తి సమస్య కనిపిస్తుంటుంది.
  • తరచుగా వేడి టబ్ స్నానాలు, ఆవిరి స్నానాలు వంటి అధిక వేడితో చేసే స్నానాలు కూడా వీర్యం పారామీటర్లపై ప్రభావం చూపిస్తాయి.
  • ధూమపానం, అధికంగా మద్యం సేవించడం, మాదకద్రవ్యాల వాడకం వంటి అలవాట్లు పరోక్షంగా సంతానోత్పత్తిని అడ్డుకుంటాయి.
  • డయాబెటిస్, అధిక రక్తపోటు, థైరాయిడ్ రుగ్మతలు, హార్మోన్ల అసమతుల్యత వంటి దీర్ఘకాలిక పరిస్థితులు కూడా వీర్యం ఉత్పత్తిని తగ్గించేస్తాయి. కొన్నిసార్లు అంగస్తంభన సమస్యకు కూడా కారణమవుతాయి.
  • యాంటి డిప్రెసెంట్స్, అనాబాలిక్ స్టెరాయిడ్స్ వంటి కొన్ని మందులు స్పెర్మ్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తాయి.
  • ఇంకా చాలా కీలకమైన విషయమేమిటంటే, పురుష సంతానోత్పత్తిలో ప్రముఖ పాత్ర వహించేంది వయస్సు.
  • మహిళల్లో 34-35 సంవత్సరాల వయస్సు తర్వాత సంతానోత్పత్తి క్షీణత కనిపిస్తుంటే, పురుషుల్లో సాధారణంగానే 45 సంవత్సరాల వయస్సు తర్వాత స్పెర్మ్ నాణ్యతలో క్రమంగా తగ్గుదల కనిపిస్తుంది.
  • అయినప్పటికీ, పురుషులు వారి స్పెర్మ్ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఇంకా ఎక్కువ కాలం పాటు సంతానోత్పత్తిని కలిగి ఉండొచ్చని నిపుణుల అభిప్రాయం.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం