Ashwagandha Chai: ఉదయాన్నే అశ్వగంధ ఛాయ్ తాగారంటే.. గొంతులో కిచ్ కిచ్‌తో పాటు అనేక సమస్యలకు చెక్ పెట్టచ్చు
Ashwagandha Chai: ఉదయాన్నే ఛాయ్ తాగందే రోజును మొదలు పెట్టని వారు చాలా మంది ఉంటారు.అయితే ఎప్పుడూ తాగే రొటీన్ ఛాయ్‌కు బదులుగా అశ్వగంధ ఛాయ్ ను తాగి చూడండి. ఆయుర్వేదం ప్రకారం ఈ ఛాయ్ అనేక ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది. ముఖ్యంగా చలికాలంలో వచ్చే జలుబు, గొంతు సమస్యలకు చెక్ పెడుతుంది.
ఆయుర్వేదం ప్రకారం గోరు వెచ్చటి పాలు నిద్రలేమికి చక్కటి నివారణ. పాలకు జాజికాయ తోడైతే మరింత చక్కటి నిద్రను పొందవచ్చు. అలాగే ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత కలిగిన అశ్వగంధ శారీరక, మానసిక ఒత్తిడిని ఎదుర్కోవటం నుంచి శక్తిని పెంచడం, హర్మోన్లను సమతుల్యం చేయడం వంటి రకరకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగిన దాల్చిన చెక్కపొడి రక్తపోటును నియంత్రిస్తుంది, మెటాబాలిజం పెంచి శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
ఇలా అనేక ప్రయోజనాలను అందించే రకరకాల పదార్థాలన్నింటినీ కలిపి ఒకేసారి తీసుకుంటే ఎంత బాగుటుందో కదా. అవును మీరు వింటున్నది నిజమే. వీటన్నింటినీ కలిపి చక్కటి ఛాయ్ తయారు చేసుకోవచ్చు. దాని పేరే అశ్వగంధ ఛాయ్. ఉదయాన్నే ఈ ఛాయ్ తయారు చేసుకుని సిప్ చేశారంటే రుచితో పాటు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. అన్ని పదార్థాలు తయారుగా ఉండాలే కానీ తయారు చేయడం కూడా పెద్ద పనేం కాదు.
అశ్వగంధ ఛాయ్ కోసం కావాలసిన పదార్థాలు:
- ఒక కప్పు పాలు
- ఒక ముక్క అశ్వగంధ
- చిటికెడు పసుపు
- ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి
- ఒక ముక్క అశ్వగంధ
- చిటికెడు యాలకుల పొడి
- చిటికెడు అల్లం పొడి
- చిటికెడు జాజికాయ పొడి
- పావు టీ స్పూన్ మిరియాల పొడి
- ఒక టీ స్పూన్ టీ పౌడర్
- ఒక స్పూన్ నెయ్యి
- ఒక స్పూన్ తేనె
అశ్వగంధ ఛాయ్ తయారీ విధానం:
- ముందుగా ఒక పాత్రలో పాలు పోసుకుని వేడి చేయాలి.
- పాలు గోరువెచ్చగా మారిన తర్వాత దాంట్లో దాల్చిన చెక్క పొడి, పసుపు, అశ్వగంధ పొడి, యాలకుల పొడి, అల్లం పొడి, జాజికాయ పొడి, టీ పొడి, మిరియాల పొడి వేయాలి.
- అవన్నీగడ్డకట్టకుండా ఉండేలా పాలను బాగా కలపాలి.
- తరువాత దీంట్లో నెయ్యి వేసి మీడియం ఫ్లేమ్ మీద పది నిమిషాల పాటు వేడి చేయాలి.
- తరువాత స్టవ్ ఆఫ్ చేసి పాలు కాస్త చల్లారే వరకూ వేచి చూడలి.
- చల్లారిన తర్వాత పాలను వడకట్టి దాంట్లో తేనెను కలపాలి.
- అంతే హాట్, హెల్తీ అండ్ టేస్టీ అశ్వగంధ ఛాయ్ తయారయినట్టే కప్పులో పోసుకుని తాగేయడమే ఆలస్యం.
- పెద్దలతో పాటు పిల్లలకు కూడా ఇది చాలా మంచివది. ముఖ్యంగా శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, గొంతులో కిచ్ కిచ్ వంటి సమస్యలకు ఈ ఛాయ్ చక్కటి పరిష్కారం.