వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం వేడెక్కిపోతుంది. దీనివల్ల నీరసం, అలసట, చర్మ సమస్యలు, జీర్ణ సమస్యలు మొదలయినవి తరచూ కలుగుతుంటాయి. అటువంటి సమయాల్లో శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే పదార్థాలు తీసుకోవడం చాలా అవసరం. అలాంటి వాటిలో ఒకటి గోండ్ కటీరా షర్బత్ .
శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే శక్తివంతమైన ఔషధ పదార్థాలలో ఒకటి గోండ్ కటీరా. దీంతో తయారు చేసిన షర్బత్ వేసవిలో మీ ఆరోగ్యాన్ని కాపాడడంలో చాలా బాగా సహాయపడుతుంది. తియ్యగా తీపిగా, చల్లగా, అద్భుతమైన రుచి కలిగిన షర్బత్‌ను పిల్లల నుంచి పెద్ద వరకూ ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. గోండ్ కటీరా షర్బత్‌ను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇక్కడ చూడండి.
వేసవిలో మన శరీరం వేడెక్కిపోతుంది. గోండ్ కటీరా తీసుకుంటే శరీరం లోపల నుంచి చల్లగా మారుతుంది. ఇది ఒక సహజ శీతలీకరణ లక్షణాలు కలిగిన ఆహార పదార్థం.
వేసవిలో చెమట కారణంగా శరీరంలో ఎక్కువ నీటి నష్టం జరుగుతుంది. గోండ్ కటీరా నీటిని శరీరానికి కావాలసినంత నీటిని అందిస్తుంది. డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది.
వేసవిలో కొంతమందికి ముక్కు నుంచి రక్తం రావడం, చర్మం పై వేడి పొక్కులు (heat boils), లేదా మూత్ర సంబంధిత ఇబ్బందులు వస్తాయి. గోండ్ కటీరా వీటన్నిటినీ తగ్గించే శక్తి కలిగి ఉంటుంది.
గోండ్ కటీరా శరీరానికి బలాన్ని ఇస్తుంది. వేసవిలో అలసటగా అనిపించినప్పుడు గోండ్ కటీరా షర్బత్ లేదా స్మూతీ తీసుకుంటే తక్షణ శక్తి అందుతుంది.
జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తేమ అవసరం. గోండ్ కటీరా తినడం వల్ల చర్మం, జుట్టు పొడిబారకుండా తేమగా, మృదువుగా ఉంటుంది.
గోండ్ కటీరా జీర్ణ వ్యవస్థకు సహాయపడుతుంది. అయితే అధికంగా తీసుకుంటే కాస్త bloating (వాయువు) కలిగించొచ్చు, దేన్నైనా మోతాదులో మాత్రమే తీసుకోవాలి.
సంబంధిత కథనం