మీ దంతాలు పసుపుగా ఉన్నాయా? నిమ్మకాయతో వాటిని తళ తళ మెరిసేలా చేసుకోండి-are your teeth yellow make them shine with lemon ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మీ దంతాలు పసుపుగా ఉన్నాయా? నిమ్మకాయతో వాటిని తళ తళ మెరిసేలా చేసుకోండి

మీ దంతాలు పసుపుగా ఉన్నాయా? నిమ్మకాయతో వాటిని తళ తళ మెరిసేలా చేసుకోండి

Haritha Chappa HT Telugu

కొందరు దంతాలు పసుపుగా ఉంటాయి. నలుగురిలో నవ్వాలన్నా కూడా చిన్నతనంగా ఉంటుంది. అలాంటివారు నిమ్మకాయతోనే మీ దంతాలను మెరిపించుకోవచ్చు.

పసుపు దంతాలు తెల్లగా మారడం ఎలా? (PiXabay)

అందమైన నవ్వుకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అలా నవ్వాలంటే దంతాలు తెల్లగా ఉండాలి. అదే పసుపు రంగులో ఉన్న దంతాలతో ఎంత నవ్వినా ఎదుటివారికి అంతవిహీనంగానే కనిపిస్తాము. కాబట్టి దంతాలపై ఉన్న పసుపు రంగును వదిలించుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి.

ఎంతో మంది ఇలా దంతాలు పసుపు రంగులో ఉండే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటివారు బహిరంగంగా నవ్వలేక సంకోచిస్తారు. ఇలాంటి వారికే నిమ్మకాయ అద్భుతమైన ఇంటి నివారణ అని చెప్పవచ్చు. ఈ హోమ్ రెమిడిని పాటించడం కూడా చాలా సులువు.

నిమ్మకాయతో ఎలా

మీ దంతాలపై పసుపును తొలగించడానికి నిమ్మకాయ ఎంతగా ఉపయోగపడుతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ తో పాటు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. అంటే నిమ్మకాయ బ్యాక్టీరియాను చంపే శక్తిని కలిగి ఉంటుంది. అలాగే మురికిని కూడా తొలగిస్తుంది. కాబట్టి నిమ్మకాయతో మీ దంతాలపై ఉన్న పసుపు మురికిని తొలగించుకోవచ్చు.

ఇలా చేయండి

ఒక చిన్న గిన్నెను తీసుకొని అందులో ఒక స్పూన్ నిమ్మరసం వేయండి. అదే గిన్నెలో చిటికెడు ఉప్పు, అర స్పూను నూనె కూడా వేయండి. ఈ మొత్తం మిశ్రమాన్ని కలిపి కాసేపు పక్కన పెట్టండి. ఇది సహజ బ్లీచ్ లాగా మారుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాల్లో బ్రష్ ను ముంచి మీ దంతాలను ప్రతిరోజు శుభ్రం చేసేందుకు ప్రయత్నించండి. ఇలా రెండు నుంచి మూడు వారాలు చేయండి. దంతాల్లో మార్పు త్వరగా తెలుస్తుంది. కొన్ని వారాల్లోనే మీ దంతాలు తెల్లగా మారుతాయి. మీరు ఆనందంగా నవ్వవచ్చు. మీ పసుపు దంతాల వల్ల ఇక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.

నిమ్మకాయలో ఉన్న బ్లీచింగ్ గుణాలు దంతాలపై ఉన్న పసుపు మరకలను సులువుగా తొలగిస్తాయి. అలాగే మనం ఇందులో ఉప్పును కూడా వాడాము. ఉప్పు కూడా నిమ్మకాయతో కలిసి అద్భుతమైన ఔషధంగా మారుతుంది. ఈ రెండు మీ దంతాల మురికిని పోగొడతాయి. అయితే ఈ రెండింటి కలయికలతో వచ్చిన రసాన్ని మింగేయకుండా ఉమ్మేయడం చాలా అవసరం. అందులో ఎన్నో క్రిమి కీటకాలు బ్యాక్టీరియాలు ఉండే అవకాశం ఉంటుంది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.