వంట చేయడం వల్ల వంటగది గోడలు గ్రీజుతో జిగటగా మారాయా? ఈ చిట్కాలు పాటించండి
వంట చేసేటప్పుడు నూనె గోడలపై చేరడం వంటివి జరుగుతాయి. నూనె, ఆవిరి, మసాలా దినుసుల కారణంగా వంటగది గోడలకు పట్టేస్తాయి. అవి చాలా జిగటగా మారుతాయి. దాన్ని క్లీన్ చేయడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకోండి.
ఎవరి ఇంటిలోనైనా ముఖ్యమైన భాగం వంటగది. అక్కడే కుటుంబానికి అవసరమైన ఆహారం సిద్ధమవుతుంది. ప్రతి మహిళ ఇంట్లోని వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. కానీ వంటగది క్లీన్ అంత సులువు కాదు. మిగతా గదులతో పోలిస్తే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవడం కాస్త కష్టమే. ఎందుకంటే వంట చేసేటప్పుడు, నూనె, ఆవిరి, మసాలా దినుసులు వంటగది గోడలు జిడ్డుగా మారుతాయి. వంటగది గోడలపై ఉన్న మరకలు పొగట్టడానికి ఎంతో అలసిపోతారు. కొన్ని శుభ్రపరిచే ట్రిక్స్ మీ వంటగదిని మెరిపిస్తాయి. గోడలను శుభ్రం చేయడానికి చిట్కాలు గురించి ఇక్కడ ఇచ్చాము. వీటిని ఫాలో అయితే మీ వంటగది మిల మిల మెరిసిపోతుంది. గదికి పట్టిన గ్రీజు త్వరగా వదిలేస్తుంది.
వెనిగర్
వంటగది గోడలను శుభ్రం చేయడానికి వెనిగర్ ఉపయోగించవచ్చు. ఈ రెమెడీ చేయడానికి, స్ప్రే బాటిల్ లో ఒక కప్పు వెనిగర్, ఒక కప్పు నీరు వేసి బాగా కలపాలి. ఈ స్ప్రే బాటిల్ తో గోడపై చల్లి 5 నిమిషాలు వదిలేయండి. కాసేపు నానిన తర్వాత తడి గుడ్డతో గోడను తుడుచుకోవాలి. గ్రీజు మరీ వదలకుండా ఉండే మందపాటి స్క్రబ్బర్ తో గట్టిగా రుద్దాలి. ఇలా రెండు మూడు సార్లు చేస్తే గోడలు తెల్లగా మారుతాయి.
బేకింగ్ సోడా
వంటగది గోడలను శుభ్రం చేయడానికి మీరు బేకింగ్ సోడాను కూడా ప్రయత్నించవచ్చు. ఇందుకోసం 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ను మరకలపై రుద్దండి. ఆ తర్వాత తడి గుడ్డతో అక్కడ గట్టిగా రుద్దాలి. లేదా స్క్రబ్బర్ తో రుద్దండి. అక్కడ పట్టిన మురికి మొత్తం పోతుంది.
ఇక మూడవ చిట్కా విషయానికి వస్తే ఒక బకెట్ గోరువెచ్చని నీటిలో 1 టీస్పూన్ డిష్ వాష్ ద్రవాన్ని వేసి బాగా కలపండి. స్పాంజితో తేలికగా రుద్దడం వల్ల గోడలు శుభ్రపడతాయి. స్క్రబ్బర్ తో బాగా రుద్దాక పొడి గుడ్డతో తుడిచేస్తే గోడల మీద జిడ్డు పోతుంది.
జిడ్డుగా కాకుండా సాధారణ మరకలు ఉంటే వాటిని నిమ్మరసంతో పోగొట్టుకోవచ్చు. నిమ్మరసాన్ని మరకలపై వేసి పది నిమిషాల పాటు వదిలేయాలి. ఆ తర్వాత తడి గుడ్డతో రుద్దుతూ గోడను శుభ్రం చేసుకోవాలి. ఈ రెమెడీని అనుసరించడం వల్ల మరకలు, జిడ్డు తొలగిపోవడమే కాకుండా వాసన కూడా పోతుంది.
నిజానికి ప్రతిరోజూ వంట చేశాక వెంటనే స్టవ్ వెనుక ఉన్న గోడను క్లీన్ చేస్తే అక్కడ ఉన్న మరకలు కఠినంగా మారకుండా ఉంటాయి. దీని వల్ల మీ పని కూడా సులువు అయిపోతుంది. రోజూ చేయలేకపోయినా వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసిన కూడా మరకలు మొండిగా మారకుండా ఉంటాయి. ఇక్కడ మేము చెప్పిన పద్దతులన్నీ చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నవే. కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.
సంబంధిత కథనం