Kids Weight: మీ పిల్లలు సన్నగా ఉన్నారా? వీటిని తినిపించారంటే వారు బరువు పెరగడంతో పాటూ ఎంతో ఆరోగ్యం-are your kids skinny if fed these they gain weight and are very healthy ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kids Weight: మీ పిల్లలు సన్నగా ఉన్నారా? వీటిని తినిపించారంటే వారు బరువు పెరగడంతో పాటూ ఎంతో ఆరోగ్యం

Kids Weight: మీ పిల్లలు సన్నగా ఉన్నారా? వీటిని తినిపించారంటే వారు బరువు పెరగడంతో పాటూ ఎంతో ఆరోగ్యం

Haritha Chappa HT Telugu

Kids Weight: పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. వారిలో ఎదుగుదల లోపం కనిపించినా, శరీరం మరీ సన్నగా ఉన్నా వారి మెనూలో కొన్ని ఆహార పదార్థాలను చేర్చాల్సిన అవసరం ఉంది. బరువు పెంచేందుకు మీ పిల్లలకు తినిపించాల్సిన అయిదు ప్రధాన ఆహారాలు ఉన్నాయి.

పిల్లలకు పెట్టాల్సిన ఆహారం (Pixabay)

పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, వారి శారీరక, మానసిక అభివృద్ధి… రెండింటికీ తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు. ఇందుకోసం వారి ఆహారంలో కొన్ని పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. కొందరు పిల్లలు ఆరోగ్యంగా కనిపిస్తున్నప్పటికీ సన్నగా ఉంటారు. బయటి వారు ఈ పిల్లలను చూసి ఏమీ తినడం లేదా మీ బాబు అని ప్రశ్నిస్తూ ఉంటారు. పిల్లలు మరీ సన్నగా ఉంటే వారి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. వారికి రోజూ పెట్టే భోజనంలో కొన్ని రకాల ఆహారాలు ఉండేలా చూసుకోండి. ఇవన్నీ కూడా ఆరోగ్యకరమైన పద్ధతి బరువు పెరిగేలా చేస్తాయి. అలాంటి ఆహారాలను ఇక్కడ ఇచ్చాము. వీటిని ప్రతిరోజూ వారి ఆహారంలో ఉండేలా చూసుకోండి.

కోడిగుడ్లు

కోడిగుడ్లలో ప్రోటీన్, విటమిన్ డి, విటమిన్ బి, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫోలిక్ యాసిడ్తో పాటు అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదల కోసం వారికి రోజూ ఒకటి లేదా రెండు గుడ్లు తినిపించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. గుడ్డు పిల్లలను ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచడమే కాకుండా, అందులో ఉండే ఫోలిక్ యాసిడ్ పిల్లలను మానసికంగా దృఢంగా మార్చడంలో సహాయపడుతుంది.

పాలు

పిల్లల అభివృద్ధికి వారి ఆహారంలో పాలు చేర్చడం చాలా ముఖ్యం. పాలలో ఉండే కాల్షియం, విటమిన్ డి, ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు ఎముకలను బలోపేతం చేస్తాయి. ఇది పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి దారితీస్తుంది. పిల్లలు తరచుగా పాలు తాగడానికి ఇష్టపడరు. కానీ వారి చేత పాలు కచ్చితంగా తాగించండి. పాలల్లో తేనె వంటివి కలిపి తాగించేందుకు ప్రయత్నించండి.

డ్రై ఫ్రూట్స్

అనేక రకాల డ్రై ఫ్రూట్స్ లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు ఇందులో ఉండే పోషకాలు ఉపయోగపడతాయి. అందువల్ల, పిల్లలకు గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తినిపించడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లల ఆహారంలో బాదం, వాల్ నట్స్, ఎండుద్రాక్ష, జీడిపప్పు, మఖానా వంటి డ్రై ఫ్రూట్స్ ను తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి.

అరటిపండు

ఎదిగే వయసు పిల్లలకు రోజూ ఒక అరటిపండు తినిపించడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అరటిపండ్లలో విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ ఎ, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల బిడ్డకు తక్షణ శక్తి లభిస్తుంది. వీటితో పాటు అరటిపండ్లు తినడం వల్ల పిల్లల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతిరోజూ ఒక అరటిపండు తినే పిల్లలు, వారి మానసిక ఎదుగుదల కూడా వేగంగా ఉండటానికి సహాయపడుతుంది.

నెయ్యి

పిల్లలు శారీరకంగా ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే వారి ఆహారంలో దేశీ నెయ్యిని తప్పనిసరిగా చేర్చాలి. పిల్లలకు నెయ్యి ద్వారా మంచి కొవ్వులు శరీరానికి లభిస్తాయి. క్రమం తప్పకుండా నెయ్యి తింటే పిల్లల మెదడు కూడా చురుగ్గా ఉంటుంది. వీటితో పాటు నెయ్యిలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడతాయి.