Eyebrow Threading: కనుబొమ్మలు థ్రెడింగ్ చేయించుకున్నాక విపరీతంగా మంట వస్తోందా? ఈ చిట్కాలు పాటిస్తే మంట తగ్గిపోతుంది
Eyebrow Threading: ప్రతి నెలా కనుబొమ్మలు థ్రెడింగ్ చేయించుకునే వారి సంఖ్య ఎక్కువే. అయితే థ్రెడింగ్ అయ్యాక ఆ భాగమంతా మంటగా అనిపిస్తుంది. చిన్న చిన్న మొటిమల్లాంటివి పొడుచుకువస్తాయి. ఆ సమస్య నుంచి బయటపడడం చాలా సులువు.
విల్లులా వంగే కనుబొమ్మలు ఒక వ్యక్తి ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయి. అమ్మాయిలు ప్రతి నెలా కచ్చితంగా కనుబొమ్మలు థ్రెడింగ్ చేయించుకుంటారు. మరికొందరు మాత్రం థ్రెడింగ్ చేయించుకున్నాక వచ్చే మంట, నొప్పి వంటివి భరించలేక ఆ పనికి దూరంగా ఉంటారు. అలాగే కొందరిలో కనుబొమ్మల ప్రాంతంలో చిన్న చిన్న మొటిమలు రావడం ప్రారంభమవుతాయి. ఈ దద్దుర్లు విపరీతంగా నొప్పి, మంట కలిగిస్తాయి. మీరు కూడా ప్రతి నెలా ఈ సమస్యతో సతమతమవుతుంటే కనుబొమ్మలు థ్రెడింగ్ చేయించుకున్నాక చిన్న చిట్కాలు పాటించడం ద్వారా ఆ సమస్యను తగ్గించుకోవచ్చు.
థ్రెడింగ్ చేశాక ఎందుకిలా?
ముఖంపై ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. థ్రెడింగ్ సమయంలో వాటిని చాలా బలంగా లాగిపడేస్తారు. వీటిని తొలగించాలక ఆ ప్రాంతంలో కొద్దిగంటల పాటూ దద్దుర్లు, దురద వస్తుంది. థ్రెడింగ్ సమయంలో చర్మంపై ఒత్తిడి కారణంగా ఇది సంభవిస్తుంది. దీని వల్ల చర్మం బయటి ఉపరితలంపై మండుతున్న అనుభూతి ఉంటుంది. చిన్న మొటిమలు కనిపించడం ప్రారంభిస్తాయి.
థ్రెడింగ్ చేసేటప్పుడు ఉపయోగించే థ్రెడ్ లేదా ఇతర పరికరాలు శుభ్రంగా లేకపోతే, వాటిలో ఉండే బ్యాక్టీరియా ముఖంపైకి రావచ్చు. ఇది మొటిమలకు కారణమవుతుంది.
మన చర్మంపై సహజ నూనెలు ఉత్పత్తి అవుతుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే ఆ నూనె వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. అలాగే దుమ్మూ ధూళి వల్ల కూడా రంధ్రాలు మూసుకుపోతాయి. ఇది కూడా చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశాలను పెంచుతుంది.
చర్మాన్ని సాగదీయండి
థ్రెడింగ్ చేసే సమయంలో చర్మాన్ని సాగదీస్తూ ఉంటారు. ఇది చర్మాన్ని దెబ్బతీస్తుంది. ఆ ప్రాంతంలో చర్మపు చికాకు, దురదను పెంచుతుంది. వీలైనంత వరకు చర్మం పాడవ్వకుండా కనుబొమ్మలు థ్రెడింగ్ చేసుకునేందుకు ప్రయత్నించండి.
యాంటీసెప్టిక్ క్రీమ్
థ్రెడింగ్ చేసిన వెంటనే కనుబొమ్మలకు యాంటీసెప్టిక్ క్రీమ్ అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఎలాంటి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అలాగే దురద, నొప్పి కూడా తగ్గిపోతాయి.
ఐస్ కంప్రెస్
కనుబొమ్మలు థ్రెడ్ చేసిన తరువాత, ఆ ప్రాంతంలో చిన్న చిన్న ఐసు ముక్కలతో తేలికగా మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల చర్మంపై చికాకు, మంట వంటివి తగ్గుతాయి. తగ్గడంతో పాటు దద్దుర్లు, మొటిమలు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.
థ్రెడింగ్ చేసిన వెంటనే ఎండలో తిరగకండి. థ్రెడింగ్ చేసిన ప్రాంతంలో ఎండ తగిలితే సమస్య పెరిగిపోతుంది. అక్కడున్న చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి మచ్చలు పడడం, చర్మం మందంగా మారడం వంటివి జరగవచ్చు.
టాపిక్