ప్రస్తుత బిజీ లైఫ్‌లో చాలా మంది మహిళలు జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. పొడిబారినట్లుగా మారిపోవడం, చిక్కులు పడి జుట్టు తెగిపోతుండటం, వెంట్రుకల చివర్లలో చిట్లినట్లుగా కనిపించడం చాలా మంది మహిళలల్లో చూస్తున్నాం. ఇంకా చిన్న వయస్సులోనే అమ్మాయిల జుట్టు రాలిపోయి, జుట్టు తెల్లబడి, బట్టతల సమస్యలతో పోరాడుతున్నారు. దీనికి వాతావరణం కూడా ఒక కారణం కావొచ్చు. పొడిగాలి జుట్టును నిర్జీవంగా మార్చడంతో అందం కూడా పాడవుతుంది.
ఇటువంటి జుట్టు సమస్యలను పరిష్కరించడానికి, జుట్టుకు మెరుపు జోడించడం వంటి విషయాలకు టీ నీటిని (డికాషన్‌ను) ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నీటిని మీరు ఏయే విధాలుగా ఉపయోగించవచ్చో ఇక్కడ తెలుసుకోండి.
మీ హెయిర్ కేర్ రొటీన్‌లో డికాషన్‌ను చేర్చడం చాలా సులభం. జుట్టు సంరక్షణకు ఇది చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఒకవేళ మీరు కూడా జుట్టుకు డికాషన్‌ను ఉపయోగించాలని అనుకుంటే, దాని కోసం ఈ మూడు టెక్నిక్స్ ఫాలో అవండి.
డికాషన్‌ను హెయిర్ మాస్క్‌గా వాడాలనుకుంటే, మీరు గ్రీన్ టీ, బ్లాక్ టీ ఏదైనా హెర్బల్ టీతో టీ నీటిని తయారు చేసుకోవచ్చు. ముందుగా టీ పొడిని నీటిలో మరిగించి ఆపై చల్లబరచండి. ఇప్పుడు జుట్టును షాంపూతో కడిగిన తరువాత, ఈ నీటిని శుభ్రమైన, తడి జుట్టుకు అప్లై చేయండి. ఇప్పుడు మీ స్కాల్ప్, జుట్టును ఒక 5 నిమిషాల పాటు మసాజ్ చేసి మరో 5 నిమిషాల పాటు వదిలేయండి. ఆపై సాధారణమైన నీటితో బాగా కడగాలి. గోరువెచ్చని నీటితో కడిగితే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. మంచి ఫలితాల కోసం ఈ పద్ధతిని వారానికి ఒకటి లేదా రెండుసార్లు రిపీట్ చేయడం మంచిది.
డికాషన్‌తో మాస్క్ కూడా తయారు చేసుకోవచ్చు. చల్లటి, స్ట్రాంగ్ టీని పెరుగు, తేనె లేదా ఆలివ్ నూనెతో బాగా కలుపుకోండి. తరువాత దానిని జుట్టు చివర్ల వరకు అంటే, జుట్టు తడిగా ఉన్నప్పుడే దానిని మాస్క్‌లా అప్లై చేసుకుని, కొంతసేపు అలాగే ఉంచండి. తరువాత చల్లటి నీటితో బాగా కడిగేయండి.
మరింత మంచి ఫలితాల కోసం, టీ ఆకులను కొన్ని కొన్ని నిమిషాలు నీటిలో మరిగించండి. ఆ విధంగా టీ కషాయం తయారు చేసుకుని దానిని గాలికి ఆరనిస్తూ చల్లబరుచుకోండి. ఆపై ఆకులను వడకట్టి పక్కకు పెట్టుకోండి. ఆ లిక్విడ్‌ను షాంపూ చేసిన తరువాత తడి జుట్టును కడగడానికి ఉపయోగించండి.
దీని ఉపయోగం కోసం ఒక గిన్నెలో టీ తయారు చేసి దానిని పూర్తిగా చల్లారనివ్వండి. అది చల్లగా అయిన తర్వాత స్ప్రే బాటిల్‌లో నింపుకోండి. ఇప్పుడు మీ జుట్టును స్టైల్ చేయడానికి ముందు మీ జుట్టు, స్కాల్ప్‌పై దానిని స్ప్రే చేయండి.
ఈ విధంగా జుట్టును కడగడం, హెయిర్ మాస్క్ వేసుకోవడం, హెయిర్ టీ స్ప్రే వంటి సులభమైన టెక్నిక్సును ఉపయోగించి జుట్టును కాపాడుకోవచ్చు.