Abrosexuality: మీకు కొన్నిసార్లు అబ్బాయిలు, కొన్నిసార్లు అమ్మాయిలు ఆకర్షణగా అనిపిస్తున్నారా? అయితే మీరు ఆబ్రోసెక్సువల్-are you sometimes attracted to boys and sometimes to girls you have more abrosexuality traits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Abrosexuality: మీకు కొన్నిసార్లు అబ్బాయిలు, కొన్నిసార్లు అమ్మాయిలు ఆకర్షణగా అనిపిస్తున్నారా? అయితే మీరు ఆబ్రోసెక్సువల్

Abrosexuality: మీకు కొన్నిసార్లు అబ్బాయిలు, కొన్నిసార్లు అమ్మాయిలు ఆకర్షణగా అనిపిస్తున్నారా? అయితే మీరు ఆబ్రోసెక్సువల్

Haritha Chappa HT Telugu
Sep 13, 2024 04:30 PM IST

Abrosexuality: ప్రపంచంలో ఎన్నో రకాల మనుషులు ఉన్నారు. కొందరు అబ్బాయిల్ని మాత్రమే ఇష్టపడతారు. మరికొందరు అమ్మాయిల్ని ఇష్టపడతారు. కొందరు మాత్రం కొన్నిసార్లు అబ్బాయిలను, కొన్నిసార్లు అమ్మాయిలను ఇష్టపడతారు. అదే ఆబ్రోసెక్సువాలిటీ కండిషన్.

ఆబ్రోసెక్సువాలిటీ సమస్య గురించి తెలుసా?
ఆబ్రోసెక్సువాలిటీ సమస్య గురించి తెలుసా? (pixabay)

Abrosexuality: కొందరు తమలో తామే కొన్ని విచిత్రమైన లక్షణాలను గమనిస్తూ ఉంటారు. ఒక్కోసారి వారికి అబ్బాయిలు తెగ నచ్చేస్తారు. ఇంకొకసారి మాత్రం అబ్బాయిలను చూస్తేనే అసహ్య పడుతుంటారు. మరొక్కసారి అమ్మాయిలు పట్ల ఆకర్షితులు అవుతూ ఉంటారు. అలా అని వారికి అమ్మాయిలే నచ్చాలని లేదు, మళ్లీ అబ్బాయిల వైపు ఆకర్షణ పుడుతుంది. ఇలా ఆకర్షణ మారుతూ ఉండడం అనేది ఆబ్రోసెక్సువాలిటీ అని కండిషన్.

ఆబ్రోసెక్సువాలిటీ అంటే ఏమిటి?

స్త్రీకి ఎదుటి స్త్రీ పైనే ఆకర్షణ కలిగితే వారిని లెస్బియన్లు అంటారు. అదే పురుషులు మరో పురుషులపై మనసు పడితే వారిని గే అని అంటారు. కానీ కొందరు స్త్రీ, పురుషులు... ఇద్దరి పైన శారీరక ఆకర్షణ కలుగుతుంది. ఒకసారి స్త్రీ నచ్చితే, మరొకసారి పురుషుడు నచ్చుతారు. ఎప్పటికప్పుడు వారి ఇష్టం ఇలా మారిపోతూ ఉంటుంది. దీన్నే వైద్య పరిభాషలో ఆబ్రోసెక్సువాలిటీ అని పిలుస్తారు.

ఆబ్రోసెక్సువాలిటీ లక్షణాలు కలిగి ఉన్నవారికి కొన్ని రోజులు లేదా కొన్ని గంటల సేపే పురుషుడు పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఆ తర్వాత ఆకర్షణ స్త్రీ వైపు మరలుతుంది. ఇలా వారి దృష్టి మారడానికి కొన్ని గంటలు లేదా కొన్ని రోజులు కొన్ని నెలలు కూడా పట్టవచ్చు.

ఎల్‌జిబిటీక్యు కమ్యూనిటీలో లేని కొత్త కాన్సెప్ట్ ఆబ్రోసెక్సువాలిటీ. ఈ కండిషన్ తో బాధపడుతున్న వారికి తాము ఆ సమస్యను కలిగి ఉన్నామని తెలియడానికి చాలా సమయం పడుతుంది. చాలా మంది తమ ఫీలింగ్స్‌ను అర్థం చేసుకోలేక తికమక పడతారు.

ఆబ్రోసెక్సువాలిటీతో ఇబ్బంది పడేవారి మానసిక స్థితి కూడా గందరగోళంగా మారిపోతుంది. వారికి వారే అర్థం కారు. కొన్నిసార్లు పురుషులు నచ్చడం, కొన్నిసార్లు మహిళలు నచ్చడంతో చాలా ఆందోళన పడుతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటారు. ఏ పని మీద శ్రద్ధ పెట్టలేరు. అసహనంగా ఉంటారు. కుటుంబంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. తమకు ఏదో డిజార్డర్ ఉందనుకుంటారు.

ఇది రావడానికి కారణం

ఇలా ఆబ్రోసెక్సువాలిటీ రావడానికి వారు పెరిగిన వాతావరణం, హార్మోన్ల అసమతుల్యత వారి ఆలోచనలు కూడా కారణం కావచ్చు అని చెబుతున్నారు వైద్యులు. ప్రస్తుతం ఇది వైద్యశాస్త్రానికి కొత్త విషయం. దీనిపై ఇంకా అధ్యయనాలు సాగుతున్నాయి. దీనికి ఎలాంటి మందులు లేవు. థెరపిస్టుతో మాట్లాడి కోపాన్ని, అసహనాన్ని తగ్గించుకోవాలి. జీవితంలో ఎవరూ కూడా కొన్నిసార్లు పురుషులతో, కొన్నిసార్లు మహిళలతో శారీరక సంబంధాలు పెట్టుకుని సుఖంగా జీవించలేరు. అందుకే ఆబ్రోసెక్సువాలిటీ బారిన పడిన వారి జీవితం చాలా ఆందోళనకరంగా మారిపోతుంది.

టాపిక్