garlic thokku rice: లంచ్ బాక్సుల్లోకి ఈజీగా, వెరైటీగా ఏమైనా కావాలా? ఇదిగోండి వెల్లులి తొక్కు అన్నం రెసిపీ మీ కోసమే!-are you searching for tasty and variety lunch box recipes try this easy garlic thokku rice ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Garlic Thokku Rice: లంచ్ బాక్సుల్లోకి ఈజీగా, వెరైటీగా ఏమైనా కావాలా? ఇదిగోండి వెల్లులి తొక్కు అన్నం రెసిపీ మీ కోసమే!

garlic thokku rice: లంచ్ బాక్సుల్లోకి ఈజీగా, వెరైటీగా ఏమైనా కావాలా? ఇదిగోండి వెల్లులి తొక్కు అన్నం రెసిపీ మీ కోసమే!

Ramya Sri Marka HT Telugu
Feb 02, 2025 07:00 AM IST

garlic thokku rice: ఉదయాన్నే అన్నం కూర వండే సమయం లేనప్పడు అన్నం వండేసి ఇలా వెల్లుల్లి తొక్కు అన్నం తయారు చేసి పిల్లల లంచ్ బాక్సుల్లో పెట్టండి. దీని రుచి ఎలా ఉంటుందంటే.. ఇంటికి వచ్చాక కూడా ఇదే అన్నం కావాలని అడుగుతారు పిల్లలు..

వెల్లుల్లి తొక్కు రైస్ చేసి పెట్టండి రుచిగా ఉంటుంది
వెల్లుల్లి తొక్కు రైస్ చేసి పెట్టండి రుచిగా ఉంటుంది (solarahome )

ఉదయాన్నే స్కూలుకు వెళ్లే పిల్లలు, ఆఫీసుకు వెళ్లే భర్తలు ఉంటే ఆడవాళ్ల హడావిడి అంతా ఇంతా ఉండదు. కొన్ని సార్లు ఇంట్లో కూరగయాలు ఉండవు, ఉన్నా కట్ చేసి వంట చేసే సమయం ఉండదు. అలాంటప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాక సతమతమవుతుంటారు మహిళలు. అలాంటి వారికోసమే ఈ రెసిపీ. అన్నం వండుకుంటే చాలా ఈ వెల్లుల్లి తొక్కు అన్నం చాలా సులువుగా తయారవుతుంది. రుచిలో కూడా ఇది చాలా బాగుంటుంది. తయారు చేసి బాక్సుల్లో పెట్టారంటే వదలకుండా తినేస్తారు.

వెల్లుల్లి తొక్కు అన్నం కోసం కావాల్సిన పదార్థాలు:

వెల్లుల్లి పేస్టు కోసం..

  • ఒక టీస్పూన్ నూనె,
  • ఒక టీస్పూన్ మినపపపప్పు,
  • ఒక టీస్పూన్ ధనియాలు,
  • అర టీస్పూన్ జీలకర్ర,
  • 40 నుంచి యూభై వెల్లుల్లి రెబ్బలు,
  • 10 నుంచి 12 ఎండు మిరపకాయలు
  • అర పిడికెడు చింతపండు

వెల్లుల్లి రైస్ తాళింపు కోసం..

  • అన్నం
  • రెండు టీ స్పూన్ల నూనె
  • అర టీస్పూన్ ఆవాలు
  • ఒక పెద్ద ఉల్లిపాయ
  • కరివేపాకు రెబ్బలు
  • మీ రుచికి సరిపడా ఉప్పు
  • కొత్తిమీర

వెల్లుల్లి తొక్కు అన్నం తయారు చేసే విధానం:

  • ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో నూనె పొసి వేడి చేయండి.
  • నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో మినపప్పు, ధనియాలు వేసి వేయించండి.
  • ఇవి కాస్త వేగిన తర్వాత జీలకర్ర వేయండి. తర్వాత తొక్కతీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను తీసుకుని దీంట్లో వేయండి.
  • వెల్లుల్లి రెబ్బలు ఒక నిమిషం పాటు వేగిన తర్వాత దాంట్లో ఎండుమిరపకాయలు వేసి వేయించండి.
  • ఇవన్నీ చక్కగా వేగిన తర్వతా దాంట్లో చింతపండు వేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారినవ్వండి.
  • ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా తయారు చేసుకోండి.
  • ఇప్పుడు ముందుగా తీసుకున్న ఫ్రైయింగ్ ప్యాన్ ను తీసుకుని దాంట్లో నూనె పోసి వేడి చేయండి.
  • నూనె కాస్త వేడెక్కిన తర్వాత దాంట్లో ఆవాలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి.
  • ఇవి కాస్త వేగిన తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు వేసి వేయించండి.
  • కరివేపాకు కూడా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీలో వేసి తయారే చేసుకున్న వెల్లుల్లి పేస్టును దీంట్లో వేసి కలపండి.
  • ఈ మిశ్రమం దాదాపు 7 నుంచి 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత దాంట్లో నుంచి నూనె పైకి తేలుతుంది. ఈ సమయంలోనే మీ రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి.
  • ఇప్పుడు ముందుగా వండి పక్కక్కు పెట్టుకున్న అన్నం కానీ, మిగిలిన అన్నాన్ని గానీ వెల్లుల్లి మిశ్రమంలో వేసి బాగా కలపండి.
  • దీన్ని రెండు నిమిషాల పాటు చిన్న మంట మీద ఉంచి వేయించండి. తర్వాత అన్నంలో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి.

అంతే వెల్లుల్లి తొక్కు అన్నం తయారు అయినట్టే. టేస్ట్ చేశారంటే అన్నం ఎక్కువ వండుకుని మరీ ఇలా చేసుకోవాలి అనుకుంటారు. పిల్లల లంచ్ బాక్సుల కోసం ఉదయాన్నే అన్నం వండుకుని వెల్లుల్లి తొక్కు అన్నం చేశారంటే వారి బాక్సు అంతా ఖాళీ చేయందే ఊరుకోరు. ఆలస్యం చేయకుండా అన్నం ఉందేమో చూసి వెంటనే ఈ రెసిపీని తయారు చేసి టేస్ట్ చేసేయండి.

Whats_app_banner