మీ మూడ్ బాగోలేదా? అయితే ఈ రంగులను చూడండి మూడ్ ఉత్సాహంగా మారిపోతుంది-are you in a good mood just look at these colors and your mood will change for the better ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మీ మూడ్ బాగోలేదా? అయితే ఈ రంగులను చూడండి మూడ్ ఉత్సాహంగా మారిపోతుంది

మీ మూడ్ బాగోలేదా? అయితే ఈ రంగులను చూడండి మూడ్ ఉత్సాహంగా మారిపోతుంది

Haritha Chappa HT Telugu

కలర్ సైకాలజీ ప్రకారం, ప్రతి రంగు మన ప్రవర్తన, భావోద్వేగాలను భిన్నంగా ప్రభావితం చేస్తాయి. ఆ రంగు మీ మూడ్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం. మీకు మూడ్ బాగోలేనప్పుడు, నిరాశగా అనిపించినప్పుడు కొన్ని రంగులు ఎక్కువగా చూసేందుకు ప్రయత్నించండి.

మీ మూడ్ పై రంగులు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? (shutterstock)

రంగులు మనసుపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక్కోసారి కారణం లేకుండా మనసు అకస్మాత్తుగా విచారంగా మారుతుంది. కొందరిలో మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువ అవుతాయి. ఒక క్షణం మనసు ఆకాశాన్ని తాకాలనుకుంటుంది, మరుక్షణం ఆ వ్యక్తి ఒంటరిగా దుఃఖ మేఘాలతో చుట్టినట్టు ఫీలవుతారు. మీ చుట్టూ ఉన్న రంగులే దీనికి కారణం. అవును, కలర్ సైకాలజీ ప్రకారం, ప్రతి విభిన్న రంగు మానవ ప్రవర్తన, భావోద్వేగాలను భిన్నంగా ప్రభావితం చేస్తుంది. ఆ రంగు మీ మూడ్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం. మీకు నిరాశగా అనిపించినప్పుడు కొన్ని రంగులను ఎక్కువగా చూడాలి. మరికొన్ని రంగులను ఒత్తిడిగా అనిపించినప్పుడు చూడకూడదు. కాబట్టి ఏ రంగు మీపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసుకోండి.

ఎరుపు రంగు

మీ మూడ్ బాగోలేనప్పుడు ఎరుపు రంగును చూడకండి. అలా చూస్తే ఒత్తిడి మరింతగా పెరిగిపోతుంది. ఎరుపు ఉద్వేగం, తీవ్రతకు ప్రసిద్ది చెందింది. ఇది శక్తి, ప్రేరణను పెంచుతుంది. కానీ ఇది ఎక్కువగా ఉపయోగిస్తే చంచలత, ఆందోళన, కోపం వంటి ఒత్తిడితో కూడిన భావోద్వేగాలకు కూడా దారితీస్తుంది.

నీలం

నీలం రంగును శాంతపరిచే రంగుగా పరిగణిస్తారు. ఇది మానసిక స్థితిని ప్రశాంతంగా ఉంచడం ద్వారా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీని వల్ల వ్యక్తి రిలాక్స్ గా, ప్రశాంతంగా ఉంటాడు. నీలం రంగును ఉపయోగించడం వల్ల నిద్రను మెరుగుపరచడానికి, నిద్రలేమి సమస్యను అధిగమించడానికి కూడా సహాయపడుతుంది. మీరు మీ పడకగది లేదా కార్యాలయానికి ఈ రకమైన రంగును ఉపయోగించవచ్చు.

పసుపు

రంగు పసుపు రంగు ఆనందం, ఆశ, సృజనాత్మకతను పెంచుతుందని భావిస్తారు. ఇది మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది. లోతైన ఆలోచనను ప్రేరేపిస్తుంది. అయినప్పటికీ, ఎక్కువ పసుపు రంగు కూడా ఆందోళన, చంచలతకు కారణమవుతుందని గుర్తుంచుకోండి.

ఆకుపచ్చ

ఆకుపచ్చ రంగు ప్రకృతితో ముడిపడి ఉందని నమ్ముతారు. దాని కారణంగా ఇది ఒక వ్యక్తికి శాంతి, సమతుల్యత, తాజాదనాన్ని కలిగిస్తుంది. ఆకుపచ్చ రంగు రంగుల స్పెక్ట్రం మధ్యలో ఉంటుంది. ఇది కళ్ళకు విశ్రాంతినిస్తుంది. ఈ రంగు మెదడు సమతుల్య, ప్రశాంతమైన అనుభూతిని సృష్టిస్తుంది. ఆకుపచ్చ మీ ఆలోచన, సంబంధాలు, శారీరక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపడం ద్వారా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

ఊదా రంగు

ఊదా రంగు కళాత్మకమైనది. ఇది వ్యక్తీకరణ, లోతైన ఆలోచన, ఆధ్యాత్మిక అవగాహన వైపు ప్రజలను ప్రేరేపిస్తుంది. ఈ రంగు మానసిక స్థితిని ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.

తెలుపు రంగు

తెలుపు రంగు స్వచ్ఛత, నిరాడంబరత, అమాయకత్వం, శాంతికి ప్రతీక. ఇది మానసిక స్థితిని తేలికపరుస్తుంది. మానసికమైన స్పష్టతను ఇస్తుంది. తెలుపు చల్లదనానికి ప్రతీక. ఇది జీవితాన్ని ప్రశాంతంగా మారుస్తుంది.

నలుపు

నలుపు రంగు శక్తి, రహస్యాన్ని సూచిస్తుంది. ఇది మానసిక స్థితిని తీవ్రంగా చేస్తుంది. కానీ ఎక్కువ నలుపు రంగును ఉపయోగించడం విచారాన్ని కలిగిస్తుంది.

ఆరెంజ్

ఆరెంజ్ కలర్ జీవితంలో ఉత్సాహాన్ని, ఆప్యాయతను, సానుకూలతను పెంచుతుంది. ఈ రంగు ఎరుపు, పసుపు మిశ్రమం. ఇది శక్తివంతమైన, ఆకర్షణీయమైన రంగుగా మారుతుంది.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం