ఆందోళన, విచారం లాంటి మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడం చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. మీరు ఒంటరివాళ్లు కాదనే ఫీలింగ్ తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందిపడాల్సి వస్తుంది. ఇలా చేయడం కోసం మీరు ప్రతిసారి ఒంటరిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఒక గ్రూపుగా ఉండి చేసే యాక్టివిటీలు కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటాయట. ఒకే విధమైన సమస్యను ఎదుర్కొంటున్న వారితో కలిసి గడపడం వల్ల ఫీలింగ్‌ను కొంతవరకూ మార్చుకోవచ్చట.
అది వ్యాయామమైనా, డ్యాన్సింగ్ అయినా మీకు కాస్త ఊరటనిస్తుందట. ఇది మిమ్మల్ని ఒంటరితనం నుంచి దూరం చేయడమే కాదు. ఇటువంటి గ్రూపులో జాయిన్ అవడం వల్ల మనలో కూడా కాస్త బాధ్యత పెరుగుతుంది. మిమ్మల్ని మానసిక సమస్యల నుంచి బయటపడేసే మెంటల్ హెల్త్ యాక్టివిటీస్‌లో కొన్నింటి గురించి తెలుసుకుందామా!
సమాజంలో తిరగడం, గ్రూపు యాక్టివిటీస్లో పాల్గొనడం మీ మానసిక ఆరోగ్యంపై నిజంగానే మంచి మార్పును చూపిస్తుంది. సామాజిక అవగాహనతో పాటు ఒంటరిగా ఉండిపోయామనే భావన నుంచి దూరం చేస్తుంది. భావోద్వేగాలతో పాటు మానసిక భద్రతను కలుగజేస్తుందట. ఒకరికొకరు తమ ఫీలింగ్స్‌ను షేర్ చేసుకుని, ఊరట కలిగించుకుంటారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకుని కొత్త అవకాశాల దిశగా ప్రయాణిస్తారు. ఈ విధంగా సహాయపడే 6 గ్రూప్ యాక్టివిటీస్ ఏంటో చూద్దాం.
ఎంటర్‌టైన్మెంట్ ఈవెంట్స్, లలిత కళలు, సామాజికంగా మెలగడం వంటివి గ్రూప్ థెరపీగా భావించొచ్చు. ప్రస్తుతం చాలా మంది ఫాలో అవుతున్న టెక్నిక్ ఇది. థెరప్యూటిక్ హార్టికల్చర్ లాంటి కొత్త టెక్నిక్స్ అంటే మొక్కలు నాటడం, వాటికి నీరు పట్టడం వంటివి మీలో ఒత్తిడిని తగ్గించి మూడ్ ను ఇంప్రూవ్ చేస్తుంది.
ఒకే విధమైన మానసిక సమస్యలతో బాధపడుతున్న వారితో కలిసి గ్రూప్ మీటింగ్స్ లో పాల్గొనడం చాలా బెస్ట్ ప్రాక్టీస్. ఈ సందర్భలో ప్రతి ఒక్కరూ సేఫ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నామని ఫీలై వారి సమస్యను లేదా పరిస్థితిని వివరిస్తార. అక్కడే వారికి ఎమోషనల్ సపోర్ట్ తో పాటు ఆందోళన తొలగిపోతుంది. ఈ విధమైన సెషన్స్ ద్వారా దీర్ఘకాలంగా బాధపడుతున్న రుగ్మతల నుంచి దూరంగా ఉండవచ్చు. ఇవి 8 నుంచి 12 మంది ఉండే టీంలు కావొచ్చు.
గ్రూప్ మెంటల్ హెల్త్ యాక్టివిటీస్ గురించి మాట్లాడటం అంటే అందులో వ్యాయామాలు కూడా చేర్చుకోవచ్చు. ఇవి మీ ఫిజికల్ ఫిట్‌నెస్ మెరుగుపరచడమే కాకుండా, మీ మూడ్ మారుస్తుంది. ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. 10 నుంచి 15 మంది వరకూ పాల్గొనే ఈ యాక్టివిటీస్ తో సోషల్ సపోర్ట్, డిప్రెషన్ తగ్గించుకోవడం, ఒంటరితనం పోగొట్టుకోవడం వంటి ప్రయోజనాలు పొందొచ్చు. ఇంకా వీటి సాయంతో సమాజంలో పరిచయాలు కూడా పెరుగుతాయి.
గ్రూప్ మెంటల్ హెల్త్ యాక్టివిటీ గురించి చెప్పాలంటే డ్యాన్సింగ్ కూడా వస్తుంది. మిమ్మల్ని ప్రశాంతంగా, సంతోషంగా ఉంచుతుంద. జుంబా డ్యాన్స్ లేదా ఫ్రీస్టైల్ మూమెంట్ డ్యాన్స్ మీ మూడ్ ను పెంచి గ్రూప్ బాండింగ్ మెరుగయ్యేలా చేస్తుంది. మీలో ఉన్న డోపమైన్, సెరెటోనిన్ పెంచుతుంది. అదే విధంగా మీలో మూడ్ మార్చి ఆందోళన కలిగించే లక్షణాలను దూరం చేస్తుంది. ఇతరులతో కలిసి డ్యాన్స్ చేయడ వల్ల సామాజిక బంధాలు బలపడి, ఒంటరిగా ఉన్నామనే భావనకు దూరం అవుతారు.
గ్రూపుగా చేసే ప్రక్రియ అయిన వ్యక్తిగతంగా ప్రశాంతతను చేకూర్చడంలో యోగా, ధ్యానం ప్రభావవంతంగా పనిచేస్తాయి. యోగా చేయడం వల్ల కార్టిసాల్ స్థాయిలు తగ్గి స్ట్రెస్ ఫీలింగ్ దూరమవుతుంది. దీర్ఘంగా శ్వాస తీసుకోవడం మీ నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. ఒక గ్రూపులో ఉండి యోగా చేయడం వల్ల ఒక కమ్యూనిటీలో ఉన్నామనే ఫీలింగ్ కలిగిస్తుంది. ఫలితంగా ఒంటరితనం పోగడుతుంది. నవ్వే యోగా చేయడం వల్ల సామాజిక బంధాలు బలపడటమే కాకుండా ఒత్తిడి తగ్గిపోతుంది. అదే ధ్యానం విషయానికొస్తే మోటివేషన్ పెరుగుతుంది. పైగా ఇది రోజూ చేయడం చాలా సులువైన ప్రక్రియ కూడా.
ఒక గ్రూపుగా అందరితో కలిసి నడవడం అనేది సంతోషంగా ఉంచే అంశం. మనం చేయగలిగే గ్రూప్ మెంటల్ యాక్టివిటీస్ లో ఇదే సులువైన ప్రక్రియ. దీనికి మీరు చేయాల్సిందల్లా గ్రూపును వెతుక్కోవడమే. అది పార్క్ అయినా కావొచ్చు. మీ వీధిలో అయినా కావొచ్చు. ప్రకృతిలో ఇతరులతో కలిసి నడవడం వల్ల మీలో సామాజిక బంధాలు బలపడేందుకు దోహదపడుతుంది.
సంబంధిత కథనం