Wedding Tips: పెళ్లి అనగానే తెలియని భయం, ఆందోళన కలుగుతున్నాయా? వాటి నుంచి ఇలా భయటపడండి!
Wedding Tips: మీరు త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారంటే, ఎవరిలోనైనా ఒత్తిడి కలగడం సహజం. కొందరిలో భయం కూడా కలుగుతుంది. అటువంటి సమస్య నుంచి బయటపడాలనుకుంటున్నారా.. రండి ఈ చిట్కాలు మీకోసమే.
వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉత్సాహంతో పాటు తేలికపాటి ఒత్తిడిని కలిగిస్తుంది. ఆ సమయంలో ప్రతి వ్యక్తి తనలో తాను అనేక రకాల ప్రశ్నలు అడుగుకుని, వాటికి సమాధానాలను వెదుక్కునే సమయం. ఈ ప్రక్రియ జరుగుతున్నంత సేపు వారిలో ఆందోళన, భయం కనిపిస్తుంటాయి. నిజానికి, జీవితంలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వల్ల వచ్చే ఆనందం, ఫలితాల గురించి ఆలోచిస్తూ మరో లోకంలో ఉండిపోతాం. ఈ మార్పుల వివాహమంటేనే అందరిలోనూ ఒత్తిడి స్థాయిని పెంచుతుంది. అందుకే, మీరు త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతుంటే, కొత్త జీవితం గురించి ఒత్తిడిని అనుభవిస్తున్న వారికి, ఈ వివాహ చిట్కాలు సహాయపడతాయి.

వివాహ ఒత్తిడిని నిర్వహించే చిట్కాలు
మీలో మీరు ప్రశ్నించుకోండి
మీరు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటుంటే, కాబోయే పార్టనర్ గురించి ఏదైనా ప్రశ్న మొదలైతే దానిని వెంటనే నివృతి చేసుకోండి. మీలో మీరు అదే విషయం గురించి పదేపదే ఆలోచిస్తుంటే, ఆ ప్రశ్న మిమ్మల్ని బాధిస్తుంది. అంతేకాకుండా ఆ ఒత్తిడిని ఇంకా పెంచుతుంది కూడా. అందుకే ఆ ప్రశ్నలను వారిని నేరుగా అడగడం మంచిది. ఇలా చేయడం వల్ల మీ ఒత్తిడి మాత్రమే తగ్గదు, మీ ప్రత్యేక దినాన్ని మరపురానిదిగా చేయడంలో కూడా మార్చుకోవచ్చు.
సమయానికి ఏర్పాట్లు పూర్తి చేయండి
వివాహానికి కొద్ది రోజులు మాత్రమే ఉంటే ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఏర్పాట్లు పూర్తి కాలేదన పెరిగిపోతుంది. ఇది ప్రత్యేకంగా వధువు తరఫు వారిలో అత్యధికంగా కనిపిస్తుంది. అటువంటి ఒత్తిడి నుండి తప్పించుకోవడానికి, ప్లాన్ ప్రకారం పనులు పూర్తి చేసుకోండి. పెళ్లికి సంబంధించిన డ్రెస్సుల షాపింగ్, నగల షాపింగ్, స్కిన్ కేర్ రొటీన్, మేకప్ వంటి వాటిని ముందుగానే ప్లాన్ చేసుకోండి. నిర్లక్ష్యం కనబరచకుండా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ ఆ తంతును పూర్తి చేసేయండి.
ఆందోళన చెందకండి
విషయాలను సరళంగా ఉంచుకోండి, అవి సులభంగా జరుగుతాయి. ఇబ్బందిగా అనిపించిన విషయాలను పెద్దలతో చర్చించండి. పెళ్లి అనగానే ప్రతి ఒక్కరూ ఊహా ప్రపంచంలో విహరిస్తుంటారు. ఫలితంగా సినిమాలు, ఇంకా వేరే చోట చూసినట్లుగా తమను తాము ఊహించుకుని అంచనాలు పెంచేసుకుంటారు. ఊహకు తగ్గట్లుగా జరగకపోతే మీలో అసహనం పెరిగిపోతుంది. అలా కాకుండా రియాలిటీలో ఉండండి. మీ హెయిర్ స్టైల్ మీకు నచ్చిన నటిలా లేదా నటుడిలా లేకపోతే డిస్సప్పాయింట్ అవకండి. మీలో కనిపించిన లోపాన్ని సరిచేసుకుంటూ, ఆ లుక్‌ను పరిపూర్ణం చేయడానికి ప్రయత్నించండి.
భవిష్యత్తు గురించి ఆందోళన తగ్గించండి
భవిష్యత్తు ఎలా ఉంటుందో అంచనాలు వేయకండి. కాస్త ప్రశాంతంగా ఉండండి, ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి ముందుకు పోవడాన్ని ఆనందంగా అనుభవించడానికి ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. ఆత్మవిశ్వాసం పెంచుకుని సహనంతో మీరు పెళ్లి జీవితం ఆనందంగా తయారుచేసుకోవచ్చు. పెళ్లి అంటే ఇద్దరి బంధం, కానీ మీ వ్యక్తిగత స్వతంత్రతను అలాగే గౌరవించడం కూడా అవసరం. ఈ సమతుల్యత మీ ఇద్దరిలోనూ మంచి సమర్థతను పెంచే విధానం.
సంబంధిత కథనం