Tea and Snacks: టీ తాగుతున్నారా? టీతో పాటూ ఈ స్నాక్స్ ను మాత్రం తినకండి, విషంతో సమానం
Tea and Snacks: పొద్దున్నే ఒక కప్పు టీ తాగకపోతే టీతో ఏవి అస్సలు తినకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవి మీ ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు.
మనదేశంలో ఎక్కువ మంది తాగే డ్రింక్ టీ. కాఫీ కన్నా కూడా టీని తాగే వారి సంఖ్యే ఎక్కువ. ఇండియాలో టీ కి ఉన్న క్రేజ్ ఇంతా అంతా కాదు. ఉదయం, సాయంత్రం ఒక కప్పు టీ తాగితే తప్ప కొందరికి రోజు గడవదు. చాలామంది టీతో పాటూ కొన్ని రకాల స్నాక్స్ తింటూ ఉంటారు. అలా తింటే వారికి మజాగా అనిపిస్తుంది. అయితే టీతో పాటూ కొన్ని రకాల స్నాక్స్ తినడం వల్ల శరీరానికి ఎంతో హాని జరగుతుంది. టీ తాగేటప్పుడు తినకూడని పదార్థాలు కొన్ని ఉన్నాయి.
టీతో తినకూడని స్నాక్స్
వేడి వేడి టీతో స్నాక్స్ తినడం చాలా సాధారణం. టీతో కొన్ని రకాల స్నాక్స్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ ఆహార పదార్థాలను టీతో తినడం ద్వారా, కెఫిన్ శోషణ మందగిస్తుంది, ఇది ఆరోగ్యానికి హానికరం.
గుడ్డు వంటకాలు
కొంతమంది ఉదయం అల్పాహారంలో ఆమ్లెట్ లేదా గుడ్డుతో చేసిన స్నాక్స్ తింటూ టీ తాగుతూ ఉంటారు. మీరు వారిలో ఒకరైతే… ఆ తప్పును చేయకండి. వాస్తవానికి, గుడ్లు లేదా ఆమ్లెట్ వంటివి టీ కలిపి తినడం పూర్తిగా మానేయండి. ఇది జీర్ణించుకోవడం చాలా కష్టమవుతుంది. పొట్ట సమస్యలు ఉన్నవారు ఈ కాంబినేషన్ పూర్తిగా మానేయాలి.
టీ తయారీలో పాలను ఉపయోగించినప్పటికీ, పాలతో తయారు చేసిన ఉత్పత్తులను టీతో తినకూడదు. జున్ను, పెరుగు, క్రీమ్ వంటి పాల ఉత్పత్తులను టీతో తినడం వల్ల టీలో కనిపించే పాలీఫెనాల్స్ ప్రభావాన్ని తొలగిస్తుంది.
స్వీట్లు, కేకులు
తీపి బిస్కెట్లు, చాక్లెట్లు, స్వీట్లు, కేకులు వంటి తీపి పదార్థాలను టీతో తినడం మానుకోండి. ఈ పదార్థాలను టీతో తినడానికి రుచికరంగా అనిపించవచ్చు, కానీ ఆరోగ్యానికి మాత్రం హానికరం. నిజానికి వీటిని టీతో కలిపి తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ వేగంగా పెరిగి శరీరంలో ఎనర్జీ లెవల్స్ తగ్గుతాయి. దీనితో పాటు, ఇది అనేక ఇతర నష్టాలను కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్లకు తీపి పదార్థాలను టీతో కలపడం విషంతో సమానం.
బజ్జీలు
ప్రతి ఒక్కరూ వేడి వేడి టీతో వేడివేడి బజ్జీలు తినడానికి ఇష్టపడతారు. అవి తినడానికి చాలా రుచికరంగా అనిపిస్తాయి. అయితే ఈ కాంబినేషన్ ఆరోగ్యానికి చాలా హానికరం. టీ తాగేటప్పుడు నూనెలో వేయించిన వస్తువులను జీర్ణం చేయడం కొంచెం కష్టం. అటువంటి పరిస్థితిలో, వాటిని టీతో కలిపి తినేటప్పుడు, ఈ కలయిక జీర్ణవ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)