Smoothie Mistakes: పండ్లతో కలిపి పాలు తీసుకుంటున్నారా? ఈ స్మూతీ కాంబినేషన్లు చాలా ప్రమాదకరమైనవని మీకు తెలుసా?-are you consuming milk with fruits did you know that this smoothie combination is very dangerous ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Smoothie Mistakes: పండ్లతో కలిపి పాలు తీసుకుంటున్నారా? ఈ స్మూతీ కాంబినేషన్లు చాలా ప్రమాదకరమైనవని మీకు తెలుసా?

Smoothie Mistakes: పండ్లతో కలిపి పాలు తీసుకుంటున్నారా? ఈ స్మూతీ కాంబినేషన్లు చాలా ప్రమాదకరమైనవని మీకు తెలుసా?

Ramya Sri Marka HT Telugu
Published Feb 15, 2025 07:30 PM IST

Smoothie Combination: జ్యూస్ చేసుకున్నా స్మూతీ తయారు చేసుకున్నా పాలు కలిపి తీసుకుంటున్నారా? అంతేకాకుండా స్మూతీలలో మరిన్ని కాంబినేషన్లు ట్రై చేస్తున్నారా? ఆగండి. మీకు తెలియకుండానే ప్రమాదకర కాంబినేషన్లు తీసుకుంటున్నారేమో చెక్ చేసుకోండి.

ఈ స్మూతీ కాంబినేషన్లు చాలా ప్రమాదకరమైనవని మీకు తెలుసా?
ఈ స్మూతీ కాంబినేషన్లు చాలా ప్రమాదకరమైనవని మీకు తెలుసా? (pexels)

స్మూతీలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అందరం భావిస్తాం. అయితే స్మూతీలలో కొన్ని పదార్థాలు కలపడం వల్ల జీర్ణ వ్యవస్థకు సమస్యగా మారతాయట. గ్యాస్, బ్లోటింగ్, చర్మ సమస్యలు వంటి ఇబ్బందులు కలగవచ్చు. పాలు లేదా పెరుగుతో పండ్లను కలపడం అనేది ముమ్మాటికీ కరెక్ట్ కాదట. అలా చేయడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారొచ్చని నిపుణులు చెబుతున్నారు. అవగాహన లేకుండా స్మూతీలతో వేరే కాంబినేషన్లు ట్రై చేసి ఇబ్బందులు తెచ్చుకోకండి. కరెక్ట్ కాంబినేషన్ వాడి స్మూతీలను రెడీ చేసుకోవడం వల్ల శరీరానికి సరిపడా పోషకాలు అందుతాయి.

అసలు స్మూతీ అంటే ఏమిటి? ఎలా తయారుచేయాలి?

స్మూతీస్ అంటే లిక్విడ్ రూపంలో ఉండే ఫ్రూట్ జ్యూస్, నీళ్లు, కొబ్బరి నీళ్లు ఏవైనా కావొచ్చు. సాధారణంగా కూరగాయలు లేదా పండ్లను గ్రైండ్ చేసే లిక్విడ్ ఫాంను స్మూతీగా చెప్తుంటారు. చాలా మంది వీటిలో యోగట్ లేదా ఐస్ క్రీమ్ కూడా కలుపుకుంటుంటారు. ఆయుర్వేద నిపుణుల ప్రకారం, ఈ స్మూతీలలో కావాలనుకున్న ప్రతి కాంబినేషన్ ట్రై చేయకూడదట.

స్మూతీ కాంబినేషన్స్ ఎందుకు ప్రమాదకరం:

ఆరోగ్యకరమైన పోషకాలను కలిపి తీసుకునే స్మూతీలు రుచితోనే కాదు డైట్ లోనూ చాలా మంచివి. కానీ, తప్పుడు కాంబినేషన్లు మాత్రం చర్మాన్ని ఇబ్బందికి గురి చేస్తాయి. గ్యాస్ట్రిక్, బ్లోటింగ్ సమస్యలు తీసుకొస్తాయి. పండ్లు, కూరగాయల్లో చాలా విటమిన్లు, మినరల్స్, ఫైటోకెమికల్స్, ఫైబర్ ఉంటాయి. ఇవి శరీరానికి సరిపడ మొత్తంలోనే అందాలి. అలా కాకుండా తప్పుడు కాంబినేషన్ తో టరై చేస్తే, అదనపు పోషకాలు అంది ఇబ్బందికరంగా మారతాయి.

పండ్లు, కూరగాయలు

పండ్లతో పాటుగా కూరగాయలను కలిపి స్మూతీ చేయడం అత్యంత హానికరమైనది. పండ్లలో ఉండే యాంటీబాక్టీరియల్ ఎంజైమ్‌లు వాటితో కలిసిన ప్రతీ పదార్థంతో రియాక్షన్ కనబరుస్తుంటాయి. ఆరోగ్యకరమైన స్మూతీ రెసిపీలలో.. పండ్లను పాలు, పెరుగు, కూరగాయలు, ధాన్యాలు, పప్పులు లేదా మాంసంతో కలపడం మంచిది కాదు! పండ్లు ఇతర ఫుడ్ కాంబినేషన్‌తో కలిపి తీసుకున్నప్పుడు అవి విషంగా మారి చర్మ సమస్యలను కలిగించవచ్చు. కాబట్టి, పండ్లను ఇతర పదార్థాలతో కలపకుండా విడిగా

తినడం అత్యంత ఉత్తమమైన పని..

పెరుగు లేదా యోగట్:

పెరుగు లేదా యోగర్ట్ లో మంచి జీవ బ్యాక్టీరియా ఉంటుంది. కానీ అది ఆయుర్వేదంలో అత్యంత బరువైన ఆహారంగా పరిగణిస్తారు. స్మూతీ రెసిపీలలో దీనిని తప్పక చేర్చాలని అనుకుంటే, పండ్లతో కలిపి తీసుకోకపోవడం మంచిది.

పాలు, పండ్లను కలపడం:

పండ్లను పాలు లేదా పెరుగుతో కలపడం వల్ల జీర్ణక్రియ మందగించవచ్చు. అంతేకాకుండా శరీరానికి ఆహారం శోషించుకోవడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది.

స్మూతీలలో ఈ పదార్థాలను ఎలా ఉపయోగించుకోవాలి:

  • ఆరోగ్యకరమైన స్మూతీ కోసం ఒకే పండు లేదా సమానమైన స్థాయి పోషకాలుండే పండ్లను వినియోగించండి.
  • స్మూతీలో కూరగాయలను ఉపయోగించాలంటే, వాటిని ఉడికించి లేదా తరిగి తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల త్వరగా జీర్ణమవుతుంది.
  • కూరగాయల రసాలు తీసుకోవడం మీకు అలవాటుగా ఉంటే, వాటిని డాక్టర్ సూచనలతో మాత్రమే తీసుకోవాలి.

ఆరోగ్యకరమైన స్మూతీ కాంబినేషన్లు:

- పండ్లు + నట్ మిల్క్

- పండ్లు + డ్రై ఫ్రూట్స్

- కూరగాయలు + పెరుగు, మసాలాలు

- కూరగాయలు + ధాన్యాలు, మసాలాలు

- పాలు + డ్రై ఫ్రూట్స్, మసాలాలు

- పెరుగు + డ్రై ఫ్రూట్స్, మసాలాలు

ఈ కాంబినేషన్లను ఆరోగ్యకరమైనవి. అంతేకాకుండా పోషక విలువలతో కూడి రుచికరంగా కూడా అనిపిస్తాయి.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం