Face Mask: మహిళలూ.. ముప్పై ఏళ్లు దాటాయా? చర్మాన్ని బిగుతుగా, యవ్వనంగా మార్చే ఈ 3 పవర్ ఫుల్ ఫేస్ మాస్క్‌లు మీ కోసమే!-are women over thirty tighten your skin and look younger with these face masks ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Face Mask: మహిళలూ.. ముప్పై ఏళ్లు దాటాయా? చర్మాన్ని బిగుతుగా, యవ్వనంగా మార్చే ఈ 3 పవర్ ఫుల్ ఫేస్ మాస్క్‌లు మీ కోసమే!

Face Mask: మహిళలూ.. ముప్పై ఏళ్లు దాటాయా? చర్మాన్ని బిగుతుగా, యవ్వనంగా మార్చే ఈ 3 పవర్ ఫుల్ ఫేస్ మాస్క్‌లు మీ కోసమే!

Ramya Sri Marka HT Telugu

Face Mask: ముప్పై ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపించే సమస్య ఇది. చర్మం వదులుగా మారి వేలాడుతూ కనిపించడమే కాకుండా, ముడతలు వంటివి మొదలవుతాయి. ఈ సమస్య తగ్గాలంటే, సరైన స్కిన్ కేర్ పాటించాలి. అలా మీ చర్మాన్ని బిగుతుగా ఉంచుకునేందుకు ఇంట్లో ఉండే తయారుచేసుకోల మాస్క్ గురించి తెలుసుకోండి. ‌

స్కిన్ టైట్‌గా మార్చే ఫేస్ మాస్క్

చర్మకాంతిని కాపాడుకోవడానికి, వయస్సు పెరుగుతున్న కొద్దీ చర్మంపై ఏర్పడే వృద్ధాప్య ఛాయలు తగ్గించుకోవడానికి, చర్మ సంబంధిత సమస్యలను దూరంగా ఉంచుకోవడానికి సరైన చర్మ సంరక్షణను పాటించాలి. మీరు ఎటువంటి చర్మ సంరక్షణను పాటించకపోతే, కాలక్రమేణా బిగుతుగా ఉన్న చర్మం క్రమంగా వేలాడడం ప్రారంభిస్తుంది. అతి జాగ్రత్త తీసుకుని స్కిన్ ట్రీట్మెంట్స్ ఎక్కువగా తీసుకుంటే, మరో ప్రమాదముంది. ఎక్కువ కెమికల్స్ వాడటం వల్ల ముఖం మరింత అధ్వానంగా మారుతుంది. అలాంటప్పుడు 30 ఏళ్ల తర్వాత స్కిన్ టైటెనింగ్ ఫేస్ మాస్క్‌లు వేసుకోవడం ప్రారంభించాలి. ఈ మాస్కులను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా.

1) కీర దోసకాయ మాస్క్:

కీర దోసకాయల్లో ఉండే తేమ, యాంటీ ఏజింగ్ లక్షణాల కారణంగా అనేక చర్మ సంరక్షణ ప్రక్రియలకు చాలా బెస్ట్ ఆప్షన్. ఇందులో ఉండే విటమిన్ సి చర్మాన్ని మెరిసేలా చేసి ఫ్రీరాడికల్స్‌తో పోరాడుతుంది. దీనిని ఉపయోగించడానికి, మీడియం సైజు దోసకాయను తురుముకోండి. ఒక క్లాత్ సాయంతో లేదా పేపర్ టవల్‌తో దోసకాయను రసాన్ని పిండండి. ఇప్పుడు దోసకాయ జ్యూస్‌లో రెండు టేబుల్ స్పూన్ల రోజ్ హిప్ ఆయిల్ వేయండి. ఈ మిశ్రమాన్ని కాటన్ బాల్ సహాయంతో నీటితో కడిగి శుభ్రం చేసుకున్న ముఖానికి అప్లై చేయాలి. 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.

2) అరటి ఫేస్ ప్యాక్:

ముడతలను తొలగించుకుని, చర్మాన్ని బిగుతుగా ఉంచుకోవడానికి అరటిపండు చాలా ప్రభావవంతమైన మార్గం. ఇందులో విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉండటం వల్ల చర్మం మెరిసిపోతుంది. దీనిని తయారుచేసుకోవడానికి పండిన అరటిపండును గుజ్జుగా చేసుకోవాలి. ఆ గుజ్జును నీటితో శుభ్రం చేసుకున్న ముఖం, మెడ భాగాల్లో అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. దీనిని కొద్ది రోజుల పాటు వాడిన తర్వాత చర్మం మృదువుగా అనిపిస్తుంది.

3) గుడ్డులోని తెల్లసొన:

గుడ్డులోని ఈ భాగంలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంలో తేమను కూడా పెంచుతుంది. దీన్ని ఉపయోగించడం వల్ల ముడతలు కూడా తక్కువగా కనిపిస్తాయి. దీన్ని అప్లై చేయడానికి, గుడ్డును పగులగొట్టి, అందులోని తెల్లసొనను ఒక గిన్నెలోకి వేరు చేయండి. తర్వాత అందులో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి గుడ్డులోని తెల్లసొనను మెత్తగా, నురగగా మారే వరకు బీట్ చేయాలి. మొఖాన్ని శుభ్రం చేసుకుని, ఆ తర్వాత చర్మంపై ఈ మిశ్రమాన్ని అప్లై చేసి పూర్తిగా ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

మరింకెందుకు లేటూ.. ఇప్పుడే మొదలుపెట్టి మీ చర్మాన్ని యవ్వనవంతంగా మార్చేసుకోండి.!

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం