Cleaning tips: ఇంట్లో చీమలు బాధపడలేకపోతున్నారా? ఈ చిట్కాలు పాటిస్తే చీమలు పోతాయి
Cleaning tips: వర్షాకాలంలో ఇళ్లలో, ముఖ్యంగా వంటగదిలో చీమలు తరచుగా కనిపించడం ప్రారంభిస్తాయి. ఈ చీమలను తరిమికొట్టడానికి చిన్న చిట్కాలు పాటించండి.
వర్షాకాలం వచ్చిందంటే ఇంట్లో పురుగులు, చీమలు అధికంగా చేరుకుంటాయి. ముఖ్యంగా ఎర్ర చీమలు ఇళ్ల మూల నుంచి బయటకు రావడం ప్రారంభిస్తాయి. వంటింట్లో ఎర్ర చీమలు ఎక్కువగా చేరుకుంటాయి. ఆహారం ఎక్కడున్నా ఎర్ర చీమలు అక్కడ చేరిపోతాయి. ఆఖరికి అన్నానికి చీమలు పట్టేస్తాయి. వందచీమలు కలిసి ఆహారంపై చేరితే దాన్ని తినాలనిపించదు. తెల్లన్నంలో ఉన్న చక్కెర కోసం ఎర్ర చీమలు దాన్ని తినేందుకు ఇష్టపడుతున్నారు. వర్షాకాలంలో ఈ చీమలను వదిలించుకోవడానికి కొన్ని చిట్కాలను పాటించండి.
నల్ల మిరియాలు, పసుపుతో…
నల్ల మిరియాలు, పసుపు పొడిని నీటిలో వేసి మరిగించాలి. ఆ నీటిని ఒక స్ప్రే బాటిల్ లో వేయాలి. ఈ వాటర్‌ను వంటగది మూలల్లో, ఆహార పదార్థాలను ఉంచే ప్రదేశాల్లో స్ప్రే చేయాలి. వీటి వాసనకు చీమలు రాకుండా నిరోధిస్తుంది.
ఉప్పు, వెనిగర్‌తో…
చీమలకు వైట్ వెనిగర్ వాసన నచ్చదు. కాబట్టి నీటిలో ఉప్పు, వెనిగర్ వేసి అందులో వస్త్రాన్ని ముంచి కిచెన్ టైల్స్, ఫ్లోర్, సింక్ చుట్టుపక్కల ప్రాంతాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. స్టవ్ ఉంచిన చోట ఆ నీటితో తుడిస్తే చీమలు అక్కడికి రావు.
మార్కెట్లో అనేక రకాల స్ప్రేలు అందుబాటులో ఉన్నాయి. కానీ అత్యంత ప్రభావవంతమైనది లక్ష్మణ రేఖ. దీన్ని అప్లై చేయడం వల్ల వంటగదిలో చీమలు, బొద్దింకలు రాకుండా ఉంటాయి.
అలా ఎర్ర మిరపకాయల ఘాటైన వాసన కూడా చీమలకు నచ్చదు. చీమలు ఉండే ప్రదేశాలలో ఎర్ర మిరపకాయలను చిక్కటి పేస్ట్ లా చేసి అక్కడ అప్లై చేయాలి. లేదా ఎండు మిర్చిని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని స్ప్రే బాటిల్ లో వేయాలి. ఆ నీటిని స్ప్రే చేస్తూ ఉండాలి. ఎండు మిరపకాయలను నీటిలో కలిపి శుభ్రం చేయడం వల్ల చీమలు రావు.
దాల్చిన చెక్క పొడిని చీమలు ఉన్నచోట చల్లినా అవి ఇంట్లో నుంచి వెళ్లిపోతాయి. ఆ పొడి వాసన చీమలను ఉక్కిరి బిక్కిరి అయ్యేలా చేస్తుంది. పుదీనా ఆకుల వాసన కూడా చీమలకు నచ్చవు. నీటిలో పుదీనా ఆకులను వేసి మరిగించాలి. ఆ నీటిని ఒక స్ప్రే బాటిల్ లో వేసి చీమలు ఉన్న చోట చల్లాలి. ఆ వాసనకు చీమలు రావడానికి ఇష్టపడవు.
బొరాక్స్ పొడిని చీమలు ఇష్టపడవు. కాబట్టి చీమలు ఉన్న చోట ఈ పొడిని చల్లాలి. బిర్యానీ ఆకులు కూడా చీమల నిరోధకాలుగా పనిచేస్తాయి. దోసకాయ తొక్కలు కూడా చీమలు నచ్చవు. కాబట్టి దోసకాయ తొక్కలను ఎండబెట్టి పొడి చేసి చీమలు ఉన్న చోట చల్లుకోవాలి.