Arati puvvu Curry: అరటిపువ్వు కర్రీ ఇలా చేశారంటే ఎంతో రుచిగా ఉంటుంది, రెసిపీ ఇదిగో
Aratipuvvu Curry: అరటిపువ్వుతో చేసే కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీన్ని ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో చేస్తే ఈ కర్రీ సులువుగా వండేయచ్చు. అరటిపువ్వు కర్రీ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
అరటిపువ్వుతో చేసే కర్రీ ఎంతో రుచిగా ఉంటుంది. శాకాహారులకు ఈ కూర నచ్చుతుంది. అరటిపువ్వు కూరను ఎంతో ప్రత్యేకంగా వండుతారు. ముఖ్యంగా వేడుకల సమయంలో శాకాహారులు దీన్ని స్పెషల్ డిష్ గా చెబుతారు. అరటిపువ్వు కూరను సింపుల్ వండేయచ్చు. రెసిపీ ఇదిగో.

అరటిపువ్వు కూర రెసిపీకి కావాల్సిన పదార్థాలు
అరటిపువ్వు తరుగు - ఒకటిన్నర కప్పు
నూనె - రెండు స్పూన్లు
పసుపు - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
పచ్చి శెనగపప్పు - ఒక స్పూను
ఆవాలు - అర స్పూను
మినపప్పు - ఒక స్పూను
ఎండుమిర్చి - నాలుగు
కరివేపాకులు - గుప్పెడు
పచ్చిమిర్చి - రెండు
జీలకర్ర - ఒక స్పూను
వేరుశెనగపలుకులు - మూడు స్పూన్లు
అరటి పువ్వు కూర రెసిపీ
1. అరటి పువ్వును సన్నగా తరిగి ఒక గిన్నెలో వేయాలి. వాటిలో నీరు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. ఒక గిన్నెలో నీళ్లు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో అరటిపువ్వు తరుగును వేసి కలుపుకోవాలి.
3. ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి పది నిమిషాలు ఉడికించాలి.
4. దాన్ని వడకట్టి తీసి పక్కన పెట్టుకోవాలి.
5. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
6. అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, వేరుశెనగపలుకులు, పచ్చి శెనగపప్పు వేసి బాగా కలుపుకోవాలి.
7. అందులో కరివేపాకులు, ఎండు మిర్చి, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి.
8. రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని చిన్న మంట మీద వేయించాలి. ఇది బాగా వేయించాక స్టవ్ ఆఫ్ చేయాలి.
9. అరటిపువ్వుతో చేసిన ఈ కూర అందరికీ నచ్చుతుంది. పైగా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
అరటిపువ్వులో మన ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ ఎ, విటమిన్ ఇ, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి వంటివి అధికంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీనిలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మహిళలు, పిల్లలు కచ్చితంగా దీన్ని తినాలి. రక్త హీనత సమస్యను ఇది తగ్గిస్తుంది. అరటిపువ్వు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి రక్తహీనతను నివారిస్తుంది.
సంబంధిత కథనం