April Fools Day : ఏప్రిల్ ఫూల్స్ డే చరిత్ర.., ఈ ఫన్నీ విషెస్‌తో ఆటపట్టించండి-april fools day 2024 why do we celebrate it and april fool funny greetings messages quotes whatsapp status ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  April Fools Day 2024 Why Do We Celebrate It And April Fool Funny Greetings Messages Quotes Whatsapp Status

April Fools Day : ఏప్రిల్ ఫూల్స్ డే చరిత్ర.., ఈ ఫన్నీ విషెస్‌తో ఆటపట్టించండి

Anand Sai HT Telugu
Apr 01, 2024 11:00 AM IST

April Fools Day History : ఏప్రిల్ 1వ తేదీ వచ్చిందంటే ఎవరిని ఫూల్ చేద్దామా అని చాలా మంది చూస్తుంటారు. ఏప్రిల్ ఫూల్ అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రజాదరణ పొందింది. అయితే దాని చరిత్ర, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం..

ఏప్రిల్ ఫూల్స్ డే చరిత్ర
ఏప్రిల్ ఫూల్స్ డే చరిత్ర (Unsplash)

ఏప్రిల్ 1వ తేదీ వచ్చిందంటే చాలు.. చిలిపి మాటలు, వేరే వారిని ఆటపట్టించడంలాంటివి జరుగుతాయి. ఏప్రిల్ ఫూల్ డే ప్రపంచవ్యాప్తంగా ప్రాచూర్యం పొందింది. ఈ రోజున పని ప్రదేశంలో, పాఠశాలలో ఎవరిని అందరి ముందు బకరా చేద్దామా అని చూస్తారు. ఒక్కరు బుక్కైనా అందరూ కలిసి నవ్వుకుంటారు. నిజానికి ఏప్రిల్ ఫూల్‌ డే రోజున చేసే జోకులతో అక్కడి వాతావరణం మెుత్తం తేలిక అవుతుంది. భారతదేశంలో కూడా ఏప్రిల్ ఫూల్స్ డేని చాలా ఉత్సాహంతో జరుపుకుంటారు.

ప్రపంచంలో ఎక్కడ నివసించినా ఏప్రిల్ 1వ తేదీన తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో చిలిపిగా ఆటపట్టించడం చూడవచ్చు. అయితే ఏప్రిల్ 1వ తేదీని ఏప్రిల్ ఫూల్స్ డేగా ఎందుకు జరుపుకుంటారు?

1564లో ఫ్రాన్స్‌లో ఏప్రిల్ ఫూల్స్ డే ప్రారంభమైందని చరిత్ర చెబుతోంది. 1564కి ముందు ఏప్రిల్ 1ని నూతన సంవత్సర దినోత్సవంగా జరిపేవారు. పాత క్యాలెండర్ పాటించాలని పట్టుబట్టే వారిని ఫూల్స్ అని పిలిచేవారు. తరువాత ఫూల్స్ డే చేయడం ఆనవాయితీగా మారింది. ఆ రోజు ఒకరినొకరు ఆటపట్టించడం ఆనవాయితీగా మారింది.

16వ శతాబ్దంలో పోప్ గ్రెగొరీ XIII జూలియన్ క్యాలెండర్ నుండి గ్రెగోరియన్ క్యాలెండర్‌కు మారిన తర్వాత ఈ సంప్రదాయం ప్రారంభమైంది. అంతకుముందు ఏప్రిల్ మొదటి రోజు కొత్త సంవత్సరం, కానీ కొత్త క్యాలెండర్ సంవత్సరం ప్రారంభాన్ని జనవరికి మార్చింది. మార్చి చివరిలో కొత్త సంవత్సరాన్ని జరుపుకోనేవారిని ఫూల్స్ గా చూడడం మెుదలైంది. కొత్త సంవత్సరం జనవరి 1కి మారిందని తెలియని వారిని ఏప్రిల్ ఫూల్స్ అని పిలిచేవారు. అలా ఈ సంస్కృతి మెుదలైంది.

18వ శతాబ్దంలో ఏప్రిల్ ఫూల్స్ డే బ్రిటన్ అంతటా వ్యాపించింది. ఇది తరువాత స్కాట్లాండ్‌కు వ్యాపించింది. అక్కడ ప్రజలు చిలిపిగా ఆటపట్టించుకోవడం మెుదలైంది. ఏప్రిల్ ఫూల్స్ డే కేవలం ఇతరుల మీద జోకులు, ఆటపట్టించడం మాత్రమే కాకుండా సీరియస్ గా ఉన్న ప్రదేశాన్ని కూల్ చేసేందుకు కూడా ఉపయోగపడుతుంది. మీరు ఎవరితోనైనా అసంతృప్తిగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి ముఖంలో చిరునవ్వు తీసుకురావడానికి ఒక చిన్న కామెడీ గేమ్ ఆడొచ్చు. ఈ సందర్భం స్నేహితులను ఒకచోట చేర్చడానికి సహాయపడుతుంది.

ఏప్రిల్ ఫూల్స్ డే విషెస్

ఏప్రిల్ ఫూల్స్ డే చరిత్ర తెలుసుకున్నాం కదా.. అయితే కొన్ని ఫన్నీ కామెంట్స్ సందేశాల రూపంలో మీ స్నేహితులకు పంపించండి. వారు చూస్తే నవ్వుకుంటారు. ఏదైనా ఇతరులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జరుపుకోవాలి. ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలను ఇలా పంపండి.

ఈ సందేశాన్ని చదువుతున్న మూర్ఖులకు ఈ తెలివైన వ్యక్తి నుండి శుభాకాంక్షలు

నేను మీకు దీపావళి, పొంగల్, క్రిస్మస్, మీ వివాహ వార్షికోత్సవం లేదా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం మర్చిపోయి ఉండవచ్చు. కానీ మీలాంటి వారికి చాలా ప్రత్యేకమైన రోజున నేను మిమ్మల్ని గుర్తుంచుకుంటాను. హ్యాపీ ఫూల్స్ డే మిత్రమా!

తెలివైన వ్యక్తి, మూర్ఖుడి మధ్య తేడా ఏంటి? ఒక తెలివైన వ్యక్తి సందేశాన్ని పంపాడు.. ఒక మూర్ఖుడు వాటిని చదువుతున్నాడు. మీరు నా సందేశాలను ఎన్నిసార్లు చదివారు? Happy April Fools Day

ఒక రోజు మీ కోసం రూపొందించారు. మీరు ఈ రోజు కోసం పుట్టారు. హ్యాపీ ఏప్రిల్ ఫూల్స్ డే

భూమి తిరగకుండా ఆపగలదు, పక్షులు ఎగరడం ఆపగలవు, కొవ్వొత్తులను కరగడం మానివేయవచ్చు.. గుండె కొట్టుకోవడం ఆగిపోవచ్చు. కానీ మీ మెదడు ఎప్పుడూ పనిచేయడం ప్రారంభించదు. పూల్స్ డే మీలాంటి వారి కోసమే

నువ్వు నాకు చాలా విలువైన దానివి.. నువ్వు లేకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను... నువ్వే నా ప్రాణం, నేను నిన్ను ప్రతిచోటా అనుభూతి చెందుతాను.. ఇక చాలు చదివింది ఆపండి.. మీ చిన్న మెదడుపై ఎక్కువ ఒత్తిడి పెట్టకండి.. నేను ఆక్సిజన్ గురించి మాట్లాడుతున్నాను. ఏప్రిల్ ఫూల్..

WhatsApp channel

టాపిక్