Face Acne: ముఖంపై మొటిమలు, డార్క్ స్పాట్స్ వంటివి రాకుండా ఉండాలంటే పసుపు ఇలా అప్లై చేయండి
Face Acne: ముఖంపై పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ పెరిగిపోతుంటే పసుపుతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని ముఖానికి అప్లై చేయాలి. ఇది కొద్ది రోజుల్లోనే చర్మాన్ని మెరిపిస్తుంది. మచ్చలేనిదిగా మారుస్తుంది
ముఖంపై నల్లటి మచ్చలు, పిగ్మెంటేషన్‌కు అనేక కారణాలు ఉండవచ్చు. సూర్యరశ్మి కారణంగా నల్లని మచ్చలు ఏర్పడతాయి. కొన్నిసార్లు హార్మోన్ల కారణంగా ముఖంపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. మహిళలు తమ అందానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అందం చెడిపోకుండా కాపాడుకోవాలనుకుంటారు. ఇలాంటి డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ తో ఇబ్బంది పడుతుంటే ఇంట్లోనే కొన్ని చిట్కాలను పాటించండి. ఇంట్లోనే పసుపుతో చేసిన ఫేస్ ప్యాక్ వేసుకోండి. ఇది ఎంతో ఉత్తమంగా పనిచేస్తుంది. పసుపు సింపుల్‌గా వాడడం వల్ల మీ చర్మాన్ని మెరిపించుకోవచ్చు.
పసుపుతో చేసిన ఫేస్‌ప్యాక్
పసుపుతో చేసిన ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖంపై ఉండే మచ్చలను, మొటిమలను తొలగించడానికి సహాయపడుతుంది. నల్లటి మచ్చలు, పిగ్మెంటేషన్ సమస్యతో బాధపడుతుంటే ఈ ఫేస్ ప్యాక్ ను వరుసగా ఇరవై రోజుల పాటు అప్లై చేయాలి.
ఫేస్ ప్యాక్ వేసుకోవాలంటే ఒక చెంచా పసుపు తీసుకుని ఐరన్ పాన్ మీద వేయించాలి. పసుపు బంగారు రంగులోకి మారిన వెంటనే గ్యాస్ మంటను ఆపి గాజు గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పసుపులో తేనె మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఇందులో ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసుకుని పావుగంట సేపు వదిలేయాలి. తరువాత ముఖాన్ని నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం రంగు మారుతుంది.
చర్మం జిడ్డుగా ఉంటే తేనెకు బదులుగా పెరుగు, టమోటా రసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇది పిగ్మెంటేషన్ సమస్యను అధిగమించడానికి సహాయపడుతుంది. మొటిమలు రాకుండా తగ్గాలంటే పసుపుతో ఇలా ఫేస్ మాస్క్ వేసుకోవడం అలవాటు చేసుకోండి. మీకు ఎంతో మార్పు కనిపిస్తుంది.
పసుపులో ఉండే కర్కుమిన్ సమ్మేళనం, యాంటీఆక్సిడెంట్లు… మెలనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. ముఖంపై మెలనిన్లు కారణమవుతాయి. పసుపును చర్మానికి అప్లై చేసినప్పుడు హైపర్ పిగ్మెంటేషన్ సమస్య తగ్గడంతో పాటు చర్మంపై నలుపు-గోధుమ రంగు మచ్చలు కూడా తేలికగా ఉంటాయి.
పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువ. ఇది శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్‌ను మరింత పెంచుతుంది. ఆహారంలో పసుపును భాగం చేసుకోవాలి. దీనివల్ల ఆర్ధరైటిస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.అనేక దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కూడా ఇది అడ్డుకుంటుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పసుపును ఉపయోగించుకోవచ్చు. అల్జీమర్స్ వ్యాధి నుంచి తప్పించుకోవాలన్నా మీ ఆహారంలో పసుపును భాగం చేసుకోండి.
గాయాలు తగిలినప్పుడు వెంటనే పసుపు పొడిని పెట్టడం వల్ల ఆ గాయం పెద్దది కాకుండా అడ్డుకోవచ్చు. దీనిలో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. పసుపును ఆహారంలో తినడం వల్ల డయాబెటిస్ నుంచి కాపాడుకోవచ్చు. కల్తీ పసుపు కూడా మార్కెట్లో లభిస్తుంది. అలాంటి పసుపు వాడడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. స్వచ్ఛమైన పసుపు వాడడం వల్ల ఎక్కువ లాభాలను పొందవచ్చు.