ఈ 3 వస్తువులను వారానికి ఒకసారి మీ చర్మానికి అప్లై చేయండి, ముఖంలో మెరుపు కనిపిస్తుంది
మెరిసే చర్మం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీనికి మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. మీ చర్మం మెరవాలంటే శెనగపిండి, పాలు, దోసకాయ అద్భుతంగా పనిచేస్తాయి.
వేసవిలో చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే అది కాంతివంతంగా ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. మచ్చలు లేకుండా కాంతివంతంగా మారుస్తాయి. నిర్జీవంగా కనిపిస్తున్న చర్మాన్ని ఇంట్లో ఉన్న ఒక మూడు వస్తువులు కొన్ని గంటల్లోనే మెరిసేలా చేస్తాయి. అవే దోసకాయ, శెనగపిండి, పాలు.
వేసవిలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. సూర్యకిరణాల్లోని అతినీలలోహిత కిరణాలు, గాలిలోని దుమ్ము చర్మాన్ని చికాకు పెడతాయి. అలాగే పనుల వల్ల కలిగే అలసట కారణంగా కూడా చర్మం నిర్జీవంగా మారిపోతుంది. కాబట్టి వేసవిలో చర్మ సందరక్షణ చాలా ముఖ్యం. చర్మాన్ని కాపాడుకోవడానికి లేదా మెరిసేలా చేయడానికి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చాలామంది బ్యూటీ పార్లర్ లో చుట్టూ తిరుగుతూ ఎన్నో డబ్బులు ఖర్చు పెడతారు. నిజానికి ఇంట్లో ఉన్న ఒక మూడు వస్తువులతోనే మీరు మీ చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు.
వారానికి రెండు మూడుసార్లు ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో చేసి చూడండి. మీ చర్మం లో మార్పును మీరే గమనిస్తారు. మీ చర్మం లో కొత్త మెరుపుని గుర్తిస్తారు.
పాలను ఇలా ఉపయోగించండి
మీ ముఖాన్ని శుభ్రం చేయడానికి ముందుగా పాలను ఉపయోగించండి. దీని కోసం పచ్చి పాలను తీసుకోండి. ఎందుకంటే పచ్చిపాలలో క్లెన్సింగ్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగిస్తాయి. దుమ్ము ధూళిని కూడా తొలగిస్తాయి. ఒక గిన్నెలో పాలు వేసుకొని దూదిని ముంచి ముఖానికి అప్లై చేయండి. ఆ దూదితోనే చర్మాన్ని క్లీన్ చేస్తూ ఉండండి. పాలతో నాలుగైదు నిమిషాలు పాటు ఇలా చర్మాన్ని శుభ్రం చేశాక నీటితో ఒకసారి కడుక్కోండి.
శెనగపిండి ఫేస్ ప్యాక్
ఆ తర్వాత ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి సిద్ధం అవ్వండి. శెనగపిండి ఫేస్ ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చర్మం నుండి టాన్ తొలగిస్తుంది. అలాగే సూర్య కాంతి వల్ల కలిగే మచ్చలను కూడా తీసేస్తుంది. ముఖానికి స్వచ్ఛమైన మెరుపును అందిస్తుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి రెండు స్పూన్ల శెనగపిండిని తీసుకోండి. అందులో చిటికెడు పసుపును వేసి పేస్టులా చేసుకోండి. తగినంత పెరుగును కూడా వేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ లా వేసుకొని పావుగంట పాటు వదిలేయండి. తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోండి వారానికి రెండు సార్లు ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.
దోసకాయ టోనర్
ఇక టోనర్ గా దోసకాయను ఉపయోగించుకోవచ్చు. దోసకాయ రసాన్ని తీసి ఒక చిన్న గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు అందులో రోజ్ వాటర్ ను వేసి బాగా కలపండి. దాంట్లో దూదిని ముంచి ముఖానికి అప్లై చేయండి. టోనర్ అప్లై చేసుకున్నాక అలా రాత్రంతా నిద్రపోతే మంచిది. లేదా పావుగంట తర్వాత ముఖాన్ని కడుక్కోవచ్చు. టోనర్ ను వారానికి ఒకసారి ఇలా దోసకాయ రసాన్ని ముఖానికి ఇలా వారానికి ఒక్కసారి అప్లై చేసుకున్నా చాలు.. అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ముఖం కడుక్కున్న తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవడం మరవకండి.
పైన చెప్పిన పాలు, శెనగపిండి ఫేస్ ప్యాక్, దోసకాయ టోనర్ మీ వారంలోనే మీ ముఖానికి మంచి మెరుపును అందిస్తాయి. మీ చర్మాన్ని తాజాగా మారుస్తాయి. ఈ మూడు వాడడం వల్ల బ్యూటీ పార్లర్ కు వెళ్లాల్సిన అవసరం కూడా తప్పుతుంది.
సంబంధిత కథనం
టాపిక్