Two Wheeler Loan: ఆన్‌లైన్‌లో టూ వీలర్ లోన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి!-apply for two wheeler loan in online how to know here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Apply For Two Wheeler Loan In Online How To Know Here

Two Wheeler Loan: ఆన్‌లైన్‌లో టూ వీలర్ లోన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి!

HT Telugu Desk HT Telugu
May 02, 2022 09:42 PM IST

Two Wheeler Loan: ఆన్‌లైన్‌లో ద్విచక్ర వాహన రుణం పొందాలనుకుంటున్నారా? అయితే ఈ కింది ప్రక్రియ ద్వారా మీరు సులభంగా రుణాన్ని పొందవచ్చు.

Two Wheeler Loan:
Two Wheeler Loan:
  • కరోనా తర్వాత ద్విచక్ర వాహనాలకు ప్రాధాన్యత పెరిగింది.  ప్రజా రవాణా పరిమితంగా మారడంతో చాలా మంది సొంత వాహనాన్ని కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా అవసరానికి అణుగుణంగా ఉండేలా టూ వీలర్ కొనుగోళ్లపై దృష్టి సారించారు. కొందరు వెంటనే డబ్బును చెల్లించి బైక్‌లు కొనుగోలు చేస్తుంటే .. మరి కొందరు లోన్‌పై ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. అయితే ద్వి చక్ర వాహనాల  లోన్ కోసం బ్యాంకులకు వెళ్లకుండా ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్ లో   టూ వీలర్ రుణం ఎలా పొందవచ్చో.. దీనికి కావాల్సిన అర్హతలు ఏంటో తెలుసుకుందాం.

85 శాతం వరకు రుణం సౌకర్యం

లోన్ పొందడానికి మీకు కనీసం 21 సంవత్సరాల వయస్సు ఉండాలి. దీని కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు ఆన్‌లైన్‌లో రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు. బైక్ కొనుగోలుకు ఏ సంస్థ కూడా పూర్తి రుణాన్ని అందించదు. ద్వి చక్రానికి అయే ఖర్చులో గరిష్టంగా 85 శాతం వరకు మాత్రమే రుణం ఇస్తుంది. మిగిలిన మొత్తాన్ని కొనుగోలుదారుడే చెల్లించాలి.

ఎలా దరఖాస్తు చేయాలి

ఆన్‌లైన్‌లో ద్విచక్ర వాహన రుణం కోసం దరఖాస్తు చేయడానికి, నేరుగా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. ముందుగా బ్యాంకు రుణగ్రస్తులు నుండి ముఖ్యమైన సమాచారాన్ని తీసుకుంటుంది, ఆ తర్వాత మొత్తం సమాచారాన్ని స్క్రూటినీ చేసిన తర్వాత రుణం ఇవ్వాలా వద్దా అని బ్యాంక్ నిర్ణయిస్తుంది. దీని తర్వాత, బ్యాంక్ ఉద్యోగులు మీకు కాల్ చేసి, ఈ ప్రక్రియను కొనసాగించడానికి మొత్తం సమాచారాన్ని అందిస్తారు. ఈ సమయంలో, మీరు రుణానికి సంబంధించి ఎలాంటి ప్రశ్ననైనా అడగవచ్చు.

ఈ డాక్యుమెంట్స్ ముఖ్యం 

బ్యాంకు మొత్తం ప్రక్రియలో, మీరు అనేక రకాల డాక్యుమెంట్స్ సమర్పించాలి- ఓటర్ ID, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి. లోన్ వర్క్‌లో భాగంలో మీరు ఈ పత్రాలను సమర్పించడం తప్పనిసరి. కరెంటు బిల్లు, రేషన్ కార్డు, టెలిఫోన్ బిల్లు వంటి పత్రాలు అడ్రస్ ప్రూఫ్‌గా బ్యాంకులు అడుగుతాయి. మీరు మీ సౌలభ్యం ప్రకారం వాయిదా కాల వ్యవధిని ఎంచుకోవచ్చు. వాయిదాల రూపంలో తిరిగి రుణాన్ని చెల్లించవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్