ప్రస్తుతం జుట్టు రాలడం అనే సమస్యతో అందరూ బాధపడుతున్నారు. సరైన జీవనశైలి లేకపోవడం, ఆహార నియమాలు లేకపోవడంతో జుట్టు రాలుతుంది. ఈ కాలంలో చిన్నాపెద్దా తేడా లేకుండా ఈ సమస్యలను అందరూ ఎదుర్కొంటున్నారు. జుట్టు పెరుగుదలకు, జుట్టు రాలకుండా ఉండేందుకు కరివేపాకును ఉపయోగించవచ్చు. జుట్టు రాలే సమస్య ప్రస్తుత రోజుల్లో అందరినీ వేధిస్తోంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం ఉండటం లేదు. ఈ సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇది మరింత ఒత్తిడికి కూడా దారితీస్తుంది. జుట్టు కోసం జాగ్రత్తలు అవసరం.
రోజుకు 30 నుంచి 80 వెంట్రుకలు రాలడం సహజం. కానీ కొందరికి అధికంగా జుట్టురాలుతుంది. విపరీతమైన జుట్టు రాలడం చివరికి బట్టతలకి దారితీస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు కరివేపాకు చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆకు వంట రుచిని పెంచడమే కాకుండా జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ఎలా వాడాలో తెలుసుకోవాలి.
మెంతికూరను కరివేపాకుతో కలిపి జుట్టుకు పట్టించడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దీని కోసం ఒక గిన్నెలో ఉసిరికాయ రసం, మెంతి పేస్ట్ తీసుకోండి. దానికి కరివేపాకు రసం కలపండి. తర్వాత ఈ పేస్ట్‌ను జుట్టుకు పట్టించాలి. కాసేపటి తర్వాత కడుక్కోవాలి. ఇలా చేస్తే జుట్టు రాలడం, చుండ్రు సమస్య నుంచి బయటపడొచ్చు.
కరివేపాకును పెరుగుతో కలిపి జుట్టుకు పట్టించడం వల్ల మేలు జరుగుతుంది. ఈ రెండు పదార్థాలు జుట్టుకు చాలా మేలు చేస్తాయి. ఒక గిన్నెలో పెరుగు తీసుకుని అందులో కరివేపాకు కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. ఈ హెయిర్ ప్యాక్ జుట్టు పెరిగేందుకు చాలా సాయపడుతుంది.
ఉల్లిపాయ జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు రాలకుండా ఉండేందుకు చాలా మంది ఉల్లిపాయ రసాన్ని అప్లై చేస్తుంటారు. దానితో కరివేపాకు కలుపుకొంటే మంచి ఫలితం ఉంటుంది. ముందుగా కరివేపాకును రుబ్బుకోవాలి. తర్వాత ఉల్లిపాయ రసంతో కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు పట్టించి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.
ఈ హెయిర్ ప్యాక్స్ వారానికి రెండు సార్లు ఉపయోగించాలి. జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. అంతేకాదు జుట్టు పెరుగుదల కూడా ఉంటుంది.
ఎక్కువ రోజులు ఒత్తిడి అనుభవిస్తే, అది నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించటం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ కారణంగా మీ జుట్టుపై ప్రభావం పడుతుంది. ఫలితంగా జుట్టు రాలడం వంటి సమస్యలను వస్తాయి. ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి రోజూ ధ్యానం చేయాలి. సరైన నిద్రపోవాలి.
రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను ఉపయోగించడం వలన కూడా జుట్టు సమస్యలు ఎక్కువ వస్తాయి. హెయిర్ ప్రొడక్ట్స్‌లో ఉండే సల్ఫేట్‌లు జుట్టుకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ, వీటి వల్ల జుట్టు పొడిబారి, త్వరగా పాడైపోయేలా చేస్తాయి. ఇది జుట్టును తెల్లగా మారుస్తుంది. అందువల్ల సల్ఫేట్ లేని జుట్టు సంరక్షణ ఉత్పత్తులను వాడాలి.