Anushka Laughing Disease : అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి.. ఏంటీ ఈ లాఫింగ్ డిసీజ్?!
Anushka Shetty Laughing Disease : నటి అనుష్క శెట్టి గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమెకు తెలుగు రాష్ట్రాల్లో చాలా క్రేజ్. అయితే ఆమె లాఫింగ్ డిసీజ్‌తో బాధపడుతుంది. ఈ వ్యాధి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
నవ్వే బెస్ట్ మెడిసిన్.. గొప్ప గొప్ప వైద్యులు కూడా ఈ మాట చెబుతారు. అయితే బాహుబలి నటి అనుష్క శెట్టికి అది ఓ వ్యాధిగా ఉంది. ఆమె అరుదైన నవ్వే పరిస్థితితో బాధపడుతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అంటే ఆమె నవ్వడం ప్రారంభించిన తర్వాత ఆపడం అసాధ్యం. నవ్వుతూనే ఉంటుంది.
ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తనకు లాఫింగ్ సమస్య ఉందని చెప్పుకొచ్చింది. కామెడీ సన్నివేశాలను చూస్తున్నప్పుడు లేదా షూట్ చేస్తున్నప్పుడు నవ్వడం ప్రారంభిస్తే.. 15 నుండి 20 నిమిషాలు నవ్వుతూనే ఉంటుంది. కొన్నిసార్లు కిందపడి పడేలా నవ్వు వస్తుందని చెప్పింది స్విటీ. ఈ కారణంగా చాలా సార్లు ఆమె షూటింగ్‌లు ఆగిపోయాయి. అయితే ఈ నవ్వు వ్యాధి ఏమిటి?
పీబీఏ
లాఫింగ్ వ్యాధిని సాధారణంగా సూడోబుల్బార్ ఎఫెక్ట్ (PBA) అంటారు. ఇది ఒక నాడీ సంబంధిత పరిస్థితి. ఇది అనియంత్రిత లేదా ఆగని నవ్వు లేదా ఏడుపును కలిగిస్తుంది. వ్యక్తి అంతర్గత భావోద్వేగ స్థితిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఇది మెదడు గాయం లేదా అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ (ALS) వంటి అంతర్లీన నరాల వ్యాధి ఫలితంగా కలిగే రుగ్మత.
నవ్వడం లేదా ఏడుపు అనేవి.. ఈ వ్యాధి ఉన్నవారికి వస్తే కొన్నిసార్లు ఆపకుండా కంటిన్యూ చేస్తారు. వారిని ఆపడం కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు తీవ్రంగా ఉంటుంది. సాధారణంగా ఊహించిన దానికంటే ఎక్కువ కాలం నవ్వుతూ ఉంటారు. PBA ఉన్నవారి జీవితం, వారి కుటుంబ సభ్యుల జీవితాలపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. సూడోబుల్బార్ ప్రభావం ప్రధాన సంకేతాలు తరచుగా ఏడవడం లేదా నవ్వడం వంటి ప్రభావాలు.
హాస్యాస్పదమైన లేదా విచారకరమైన వాటిని చూడటం లేదా వినడం కారణంగా ఈ పీబీఏ ప్రభావం చూపిస్తుంది. ఇది కాసేపటికి ఇబ్బందిని కూడా కలిగిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్నప్పుడు మానసిక స్థితి, ప్రభావం మధ్య వ్యత్యాసం ఉంటుంది.
కచ్చితమైన కారణాలు లేవు
పీబీఏకి కచ్చితమైన కారణాలు తెలియకపోయినా.. భావోద్వేగ వ్యక్తీకరణను నియంత్రించే మీ మెదడులోని నాడీ సంబంధితన మార్గాలకు అంతరాయం కలిగించడం వలన ఇబ్బంది సంభవించవచ్చు. అనేక నాడీ సంబంధిత సమస్యలు ఈ పరిస్థితి కారణమవుతాయి. అవేంటో చూద్దాం..
నాడీ సంబంధిత సమస్యలు
మెదడుకు తీవ్రమైన గాయం.
అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ (ALS), దీనిని లౌ గెహ్రిగ్స్ వ్యాధి అని కూడా పిలుస్తారు.
మల్టిపుల్ స్క్లెరోసిస్ (MS).
అల్జీమర్స్ వ్యాధి, చిత్తవైకల్యం ఇతర రూపాలు.
స్ట్రోక్.
పార్కిన్సన్స్ వ్యాధి.
మెదడు కణితులు.
మూర్ఛరోగం.
విల్సన్ వ్యాధి
మానసిక స్థితి
సూడోబల్బార్ ఎఫెక్ట్‌కు ఎలాంటి నివారణ లేదని వైద్యులు చెబుతున్నారు. అయితే కొన్ని మందులు మాత్రం దానిని నిర్వహించడంలో సాయపడతాయి. నవ్వడం, ఏడుపును తీవ్రతను తగ్గించడంలో సాయపడతాయి. ఒక వ్యక్తి మానసిక స్థితి చాలా భిన్నంగా ఉంటుంది. వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటుంది. ఇది ఒకరి అంతర్గత భావన. విచారం, కోపం లేదా ఆనందం కావచ్చు. నవ్వడం లేదా ఏడవడం వంటి వ్యక్తి భావోద్వేగాల ద్వారా వీటి ప్రభావాలు కనిపిస్తాయి. దాని ఆధారంగా పీబీఏను అంచనా వేస్తారు.
గమనిక : నటి అనుష్క శెట్టి తనకు PBA వ్యాధి ఉందని ధృవీకరించలేదు. కానీ ఆమె చెప్పిన లక్షణాలు మాత్రం లాఫింగ్ డిసీజ్‌కి సంబంధించినవిగా ఉన్నాయి. అందులో భాగంగా పీబీఏ గురించి కొన్ని విషయాలు చెప్పాం. కేవలం సమాచారం మీకు చెప్పడం మాత్రమే మా ఉద్దేశం.