Banana Hair Mask: అనుష్క శర్మ సీక్రెట్ హెయిర్ మాస్క్! అరటితో ఇలా చేశారంటే డాండ్రఫ్ దూరమై, అందమైన కురులు మీ సొంతమవుతాయి-anushka sharmas secret hair mask if you do this with banana dandruff will go away and you will have beautiful hair ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Banana Hair Mask: అనుష్క శర్మ సీక్రెట్ హెయిర్ మాస్క్! అరటితో ఇలా చేశారంటే డాండ్రఫ్ దూరమై, అందమైన కురులు మీ సొంతమవుతాయి

Banana Hair Mask: అనుష్క శర్మ సీక్రెట్ హెయిర్ మాస్క్! అరటితో ఇలా చేశారంటే డాండ్రఫ్ దూరమై, అందమైన కురులు మీ సొంతమవుతాయి

Ramya Sri Marka HT Telugu
Jan 04, 2025 01:00 PM IST

Banana Hair Mask: చలికాలంలో చుండ్రు సమస్యతో మీరు ఇబ్బంది పడుతుంటే అనుష్క శర్మ సీక్రెట్ హెయిర్ మాస్క్ మీకు ఖచ్చితంగా సహాయపడుతుంది. అరటిపండుతో ఇంట్లోనే దీన్ని మీరు సులువుగా తయారు చేసుకోవచ్చు. ఈ బనానా హెయిర్ మాస్క్ చుండ్రును వదిలించడందో పాటు అనుష్క లాంటి అందమైన కురులను మీ సొంతం చేస్తుంది.

అనుష్క శర్మ సీక్రెట్ హెయిర్ మాస్క్!
అనుష్క శర్మ సీక్రెట్ హెయిర్ మాస్క్!

బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణుల్లో అనుష్క శర్మ ఒకరు. అనుష్క శర్మ మెరిసే చర్మానికి మాత్రమే కాకుండా అందమైన జుట్టుకు ఫాన్స్ ఎక్కువ. ఇక తన సిల్కీ అండ్ బ్యూటిఫుల్ హెయిర్ గురించి చెప్పాలంటే మార్కెట్లో దొరికే హానికరమైన షాంపూలు, నూనెల కన్నా.. ఇంట్లో తన కిచెన్‌లో ఉండే నేచురల్ పదార్థాలనే ఎక్కువగా నమ్ముతారట అనుష్క. అందమైన ఆరోగ్యకరమైన కురుల కోసం, ముఖ్యంగా చుండ్రు సమస్య నుంచి దూరంగా ఉండటం కోసం ఆమె రెగ్యులర్ గా ఉపయోగించే సీక్రెట్ హెయిర్ మాస్క్ ఒకటి ఉందట. అదే అరటి హెయిర్ మాస్క్(Banana Hair Mask). ఇది వెంట్రుకలను అందంగా మెరిసేలా తయారు చేయడంతో పాటు చుండ్రు సమస్యను శాశ్వతంగా దూరం చేస్తుంది.

yearly horoscope entry point

అరటి హెయిర్ మాస్క్(Banana Hair Mask) ఉపయోగాలు:

  • అరటిపండ్లలో ఉండే జింక్, మెగ్నీషియం దెబ్బతిన్న వెంట్రుకలకు మరమ్మత్తు చేయడానికి, చుండ్రును వదిలించుకోవడానికి సహాయపడుతుంది.
  • ఈ పండులోని సహజ న్యూట్రియంట్లు జుట్టును ఆరోగ్యంగా, రీఫ్రెష్‌గా ఉంచుతాయి. జుట్టును దృఢంగా, మెత్తగా మారుస్తుంది. తద్వారా జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి.
  • అరటి పండు హైడ్రేటింగ్ గుణాలతో నిండినది. జుట్టును, తలపైన ఉండే చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి పొడిబారడాన్ని( Dry Scalp) తగ్గిస్తుంది. తద్వారా చుండ్రు(dandruff)ను తొలగించడమే కాకుండా, కుదుళ్లను( Hair follicles) ఆరోగ్యంగా తయారు చేస్తుంది.
  • అరటి పండులో ఉన్న పోటాసియం, విటమిన్ B6 వంటి పోషకాలు జుట్టు జుట్టు పటుత్వాన్ని పెంచుతాయి.
  • అరటి పండులో ఉండే విటమిన్ A, విటమిన్ Cలు రక్తప్రసరణను మెరుగుపరచి జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి. ఫలితంగా వెంట్రుకలు త్వరగా పెరుగుతాయి.

అరటి హెయిర్ మాస్క్ కోసం కావాల్సిన పదార్థాలు:

  1. 2 పండిన అరటిపండ్లు
  2. అర కప్పు పాలు లేదా పెరుగు
  3. ఒకటి లేదా రెండు టీస్పూన్ల తేనె

అరటి హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలి?

  • అరటి హెయిర్ మాస్క్ తయారు చేయాలంటే ముందుగా రెండు అరటిపండ్లను తీసుకుని ఫోర్క్ సహాయంతో మెత్తగా రుబ్బుకోవాలి.
  • ఇప్పుడు దీంట్లో అరకప్పు పాలు లేదా పెరుగు వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. పాలలో లాక్టిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది, ఇది తలలో దురదను తగ్గించడానికి సహాయపడుతుంది.
  • ఆ తర్వాత అరటిపండు గుజ్జులో 1-2 టీస్పూన్ల తేనె కలపాలి. తేనెలో ఉండే క్లెన్సింగ్ గుణాలు నెత్తిని హైడ్రేట్‌గా ఉంచడానికి సహాయపడతాయి.
  • అంతే అరటి హెయిర్ మాస్క్ తయారైనట్టే.

అరటి హెయిర్ మాస్క్ ఎలా అప్లై చేసుకోవాలి:

  • అరటి హెయిర్ మాస్క్ అప్లై చేయడానికి ముందు తలంతా శుభ్రంగా ఉండాలి. నూనె లేదా దుమ్ము వంటివి ఉండకుండా తలస్నానం చేసి ఉండటం వల్ల మరిన్ని ఫలితాలను పొందవచ్చు.
  • ఈ మాస్క్‌ను జుట్టు మూలాల నుండి చివరల వరకు సమానంగా అప్లై చేయాలి.
  • సుమారు 40 నిమిషాలు ప్యాక్ ను అలాగే ఉంచుకున్న తర్వాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి.
  • ఉత్తమ ఫలితాల కోసం వారానికి ఒకసారి ఈ హెయిర్ మాస్క్‌ను అప్లై చేయండి.

Whats_app_banner