Anti valentines week: రేపటి నుంచే యాంటీ వాలెంటైన్స్ వీక్ మొదలు, స్లాప్ డే నుంచి బ్రేకప్ డే వరకు ఫుల్ లిస్టు ఇదిగో-antivalentines week starts from tomorrow from slap day to breakup day here is the full list ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Anti Valentines Week: రేపటి నుంచే యాంటీ వాలెంటైన్స్ వీక్ మొదలు, స్లాప్ డే నుంచి బ్రేకప్ డే వరకు ఫుల్ లిస్టు ఇదిగో

Anti valentines week: రేపటి నుంచే యాంటీ వాలెంటైన్స్ వీక్ మొదలు, స్లాప్ డే నుంచి బ్రేకప్ డే వరకు ఫుల్ లిస్టు ఇదిగో

Haritha Chappa HT Telugu
Published Feb 14, 2025 05:03 PM IST

Anti valentines week: ఫిబ్రవరి 15న యాంటీ వాలెంటైన్స్ వీక్ ప్రారంభమవుతుంది. వాలెంటైన్స్ వీక్ కు వ్యతిరేకంగా దీన్ని నిర్వహించుకుంటారు. ప్రేమలో మోసపోయిన వారు ఈ యాంటీ వాలెంటైన్ వీక్ జరుపుకుంటారు.

యాంటీ వాలెంటైన్స్ వీక్ ఫుల్ లిస్టు ఇదిగో
యాంటీ వాలెంటైన్స్ వీక్ ఫుల్ లిస్టు ఇదిగో (Image by Canva)

ఫిబ్రవరి ప్రేమ మాసం. ప్రేమికులు పండుగ చేసుకునే నెల. కానీ ఇదే నెలలో ప్రేమలో మోసపోయిన వారి కోసం, ప్రేమ సంబంధాలు ఇష్టపడని వారి కోసం కూడా ప్రత్యేక దినోత్సవాలు ఉన్నాయి. అదే యాంటీ వాలెంటైన్స్ వీక్.  వాలెంటైన్స్ డే ఫిబ్రవరి 14న ముగిసిన వెంటనే యాంటీ వాలెంటైన్స్ డే మొదలైపోతుంది. వారం రోజుల పాలూ దీన్ని నిర్వహించుకుంటారు. 

 యాంటీ వాలెంటైన్స్ లో మొదటి రోజు స్లాప్ డే - ఫిబ్రవరి 15న, ఫిబ్రవరి 16న కిక్ డే, ఫిబ్రవరి 17న పెర్ఫ్యూమ్ డే, ఫిబ్రవరి 18న ఫ్లర్ట్ డే, ఫిబ్రవరి 19న కన్ఫెషన్ డే, ఫిబ్రవరి 20న మిస్సింగ్ డే, ఫిబ్రవరి 21న బ్రేకప్ డే ఇలా ఏడు రోజులు ఉంటాయి. ప్రతి రోజుకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. 

1. స్లాప్ డే - ఫిబ్రవరి 15

స్లాప్ డే
స్లాప్ డే (Freepik)

మీరు ప్రేమలో మోసపోయారా? మీకు మాజీ ప్రేయసి లేదా ప్రియుడు ఉన్నారా? వారు మిమ్మల్ని బాధపెట్టిన అన్నింటికీ  మీ మాజీకి గుణపాఠం నేర్పాలనుకుంటే, ఇది మీ రోజు. వారు పెట్టిన బాధకు ప్రతిఫలంగా వారికి ఒక చెంపదెబ్బ కొట్టి వారి జ్ఞాపకాలను తొలగించండి. జీవితాంతం హ్యాపీగా బతకమని చెప్పడమే స్లాప్ డే ఉద్దేశం.

2. కిక్ డే - ఫిబ్రవరి 16

కిక్ డే
కిక్ డే

వాలెంటైన్స్ వీక్ రెండో రోజును కిక్ డే అంటారు. ఇది ఫిబ్రవరి 16న వస్తుంది. స్లాప్ డేలో మాదిరిగానే, కిక్ డే రోజున మీ మాజీకు వారి జ్ఞాపకాలను, వారి నుండి మీరు అందుకున్న అన్ని బహుమతులను తన్ని బయటకు పడేయడం ద్వారా ఆ సంబంధం నుంచి పూర్తిగా బయటికి వచ్చేయాలి.

3. పెర్ఫ్యూమ్ డే - ఫిబ్రవరి 17

పెర్ఫ్యూమ్ డే
పెర్ఫ్యూమ్ డే (Image by Canva)

వాలెంటైన్స్ వీక్ లో మూడో రోజును పెర్ ఫ్యూమ్ డే అంటారు. ఇది ఫిబ్రవరి 17 న వస్తుంది.  ఇకపై మీరు దృష్టి పెట్టడం, మీ భవిష్యత్తును అందంగా మార్చుకోవడానికి మీకు మీరు ప్రామిస్ చేసుకోవాలి.  మంచి అనుభూతిని కలిగించేందుకు మీకు నచ్చే పెర్ఫ్యూమ్ కొనుక్కుని మీరు వాడాలి. ఇది పాత వాసనను మీ నుంచి తొలగించి కొత్త అనుభూతిని అందిస్తుంది.

ఫ్లర్డ్ డే
ఫ్లర్డ్ డే (Image by Canva)

ఫ్లర్ట్ డే అంటే యాంటీ వాలెంటైన్స్ వీక్ లో నాలుగో రోజు. ఫిబ్రవరి 18న జరుపుకుంటారు. ఒంటరిగా ఉండటం వల్ల ఎంతో మంది చికాకుపడతారు. మాజీ ప్రేయసిని లేదా ప్రియుడిని మర్చిపోలేక కూడా కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు మళ్లీ ప్రేమలో పడేందుకు ప్రయత్నించండి. మీకు తగ్గ మంచి వ్యక్తిని ఎంపిక చేసుకుని వారితో అందంగా మాట్లాడి ఫ్లర్ట్ చేయండి.

5. కన్ఫెషన్ డే - ఫిబ్రవరి 19

కన్ఫెషన్ డే
కన్ఫెషన్ డే (Image by Canva)

వాలెంటైన్స్ వీక్ లో ఐదో రోజును కన్ఫెషన్ డే అంటారు. ఇది ఫిబ్రవరి 19న వస్తుంది. మీకు చాలా కాలంగా ఎవరిపైనైనా క్రష్ ఉంటే ఈ రోజు కచ్చితంగా వారికి కలవండి. మీకు నచ్చిన వ్యక్తికి మీ భావాలను తెలియజేయండి. అదనంగా, మీరు గతంలో ఎవరినైనా ప్రేమ విషయంలో బాధించి ఉంటే.., ఆ తప్పులను అంగీకరించండి. మీ తప్పులను మీరు తెలుసుకోవడం కూడా చాలా అవసరం.

6. మిస్సింగ్ డే - ఫిబ్రవరి 20

మిస్సింగ్ డే
మిస్సింగ్ డే

మిస్సింగ్ డే అంటే యాంటీ వాలెంటైన్స్ వీక్ లో ఆరో రోజు. ఫిబ్రవరి 20న జరుపుకునే ఈ రోజున మీరు మీ ఫీలింగ్స్ గురించి ఎవరికైనా చెప్పుకోవచ్చు. అది మీ స్నేహితుడు కావచ్చు, ఆ చిరకాల క్రష్ కావచ్చు. మీ మనసుకు దగ్గరైన వాళ్లకి ఎవరికైనా మీరు ఎవరిని మిస్ అవుతున్నారో చెప్పవచ్చు. దీని వల్ల గుండెల్లోని భారం చాలా వరకు తగ్గిపోతుంది.

7. బ్రేకప్ డే - ఫిబ్రవరి 21

బ్రేకప్ డే
బ్రేకప్ డే (Image by Canva)

వాలెంటైన్స్ వీక్ చివరి రోజు బ్రేకప్ డే. ఇది ఫిబ్రవరి 21న వస్తుంది. మీరు మీ అనుబంధంలో ఉండలేక ఇబ్బంది పడుతున్నా, మీ భాగస్వామితో విసిగిపోయినా ధైర్యంగా బ్రేకప్ చెప్పండి. స్వేచ్ఛా వాయువులను పీల్చుకోండి. విషపూరిత అనుబంధంలో ఉండాల్సిన అవసరం ఎవరికీ లేదు.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం