శ్రీదేవితో బోనీ పెళ్లి: తన బాల్యంపై తొలిసారి మాట్లాడిన బోనీ మొదటి కూతురు-anshula on life after boney sridevi marriage ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  శ్రీదేవితో బోనీ పెళ్లి: తన బాల్యంపై తొలిసారి మాట్లాడిన బోనీ మొదటి కూతురు

శ్రీదేవితో బోనీ పెళ్లి: తన బాల్యంపై తొలిసారి మాట్లాడిన బోనీ మొదటి కూతురు

HT Telugu Desk HT Telugu

తన తండ్రి బోనీ కపూర్.. శ్రీదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత తన చిన్నప్పటి జీవితం ఎలా మారిందో అన్షులా కపూర్ మొదటిసారి ఓపెన్‌గా మాట్లాడారు.

అన్షులా కపూర్, జాన్వీ కపూర్, శ్రీదేవి, బోనీ కపూర్

రియాలిటీ షో 'ది ట్రైటర్స్'తో అన్షులా కపూర్ తెరంగేంట్రం చేశారు. తన తండ్రి బోనీ కపూర్.. శ్రీదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత తన చిన్నప్పటి జీవితం ఎలా మారిందో మొదటిసారి ఓపెన్‌గా మాట్లాడారు. అప్పట్లో శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్‌ల లవ్ స్టోరీ ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశం. బోనీ కపూర్‌కు అప్పటికే మోనా షౌరీ కపూర్‌తో పెళ్లయి అర్జున్ కపూర్, అన్షులా కపూర్‌లకు నాన్నగా ఉన్నారు. సరిగ్గా అప్పుడే ఆయన శ్రీదేవిని కలిశారు.

1996లో బోనీ తన మొదటి భార్య మోనాకు విడాకులిచ్చి, వారి ఇంటిని వదిలేసి, అదే ఏడాది శ్రీదేవిని సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. వారికి జాన్వీ కపూర్, ఖుషి కపూర్‌లు పుట్టారు. అర్జున్ కపూర్ గతంలో తన నాన్నతో సంబంధాలు అంత బాగోలేదని కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పేవారు. ఆ తర్వాత 2018లో శ్రీదేవి అకాల మరణం అన్షులా, అర్జున్‌లను వారి చెల్లెళ్లు జాన్వీ, ఖుషీలకు మరింత దగ్గర చేసింది. ఇప్పుడు వారంతా ఒకే కుటుంబంగా, సంతోషంగా ఉన్నారు.

అయితే చిన్నతనంలో అన్షులాకు తల్లిదండ్రుల విడాకులు, బోనీ రెండో పెళ్లి వల్ల చాలా కష్టాలు ఎదురయ్యాయి. ఈ విషయంపై అర్జున్ కపూర్ చెల్లెలు అన్షులా కపూర్ ఇటీవల నయన్ దీప్ రక్షిత్‌తో ఓ చిట్‌చాట్‌లో మనసు విప్పి మాట్లాడారు.

బోనీ కపూర్, మోనా షౌరీ కపూర్‌కు విడాకులిచ్చి శ్రీదేవిని పెళ్లి చేసుకున్న 90ల కాలంలో మన దేశంలో విడాకులు, విడిపోవడం లాంటివి చాలా అరుదుగా ఉండేవని అన్షులా వివరించారు. తన చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ అన్షులా “నేను ఒకటో క్లాస్‌లో ఉన్నాను. అప్పుడు ఏమైందంటే, మా జీవితంలో జరుగుతున్న విషయాల వల్ల కొన్ని కుటుంబాలు మాతో కలవడానికి ఇష్టపడలేదు. వాళ్ల పిల్లలు మా ఇంటికి రావడం, ఏదైనా గొడవల్లో చిక్కుకోవడం వారికి నచ్చేది కాదు. 90ల్లో స్కూల్ అయ్యాక, పిల్లలు ఒకరి ఇంటికి ఒకరు వెళ్ళేవారు కదా? నాకు గుర్తుంది. నా క్లాస్‌మేట్స్ నా పట్ల ప్రవర్తించే విధానంలో, వాళ్ల కుటుంబాలు నా పట్ల ప్రవర్తించే విధానంలో పెద్ద మార్పు వచ్చింది. స్కూల్‌లో అదొక చాలా ఎమోషనల్, చాలా గందరగోళమైన సమయం.” అని వివరించారు.

"నాన్న ఎంచుకున్న పార్ట్‌నర్ వల్ల, అది దురదృష్టమో, అదృష్టమో గానీ, విషయం బాగా పబ్లిక్ అయింది. ఎందుకంటే వాళ్లిద్దరూ పబ్లిక్ ఫిగర్స్. వాళ్లు అంతగా ఫేమస్ కాకపోయి ఉంటే, మేం దానిని తట్టుకోవడం మరింత సులభంగా ఉండేది." అని అన్షులా తెలిపారు. ఈ సంఘటన తనపై మానసికంగా ప్రభావం చూపడమే కాకుండా, నాన్న ఇంట్లో లేకపోవడం వల్ల కలిగిన గందరగోళాన్ని కూడా తాను ఎదుర్కొన్నానని అన్షులా వివరించారు.

ప్రస్తుతం అన్షులా ఒక పారిశ్రామికవేత్తగా, బాడీ పాజిటివిటీ, మానసిక ఆరోగ్యానికి మద్దతుగా నిలుస్తున్నారు. మరోవైపు అర్జున్, జాన్వీ, ఖుషీలు బాలీవుడ్‌లో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంలో బిజీగా ఉన్నారు.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.