ఆడవారిపై పెత్తనం చెలాయించడాన్ని చాలా మంది మగవారు అదేదో తమ అధికారంలా భావిస్తుంటారు. తమ ముందు ధైర్యంగా ఎదురుతిరిగి మాట్లాడినా, నోరు పెద్దది చేసినా మహిళలను దూషించడమే కాకుండా కొన్నిసార్లు ఇష్టమొచ్చినట్లు కొడుతున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఆడపిల్లల తల్లిదండ్రులు పెళ్లి చేసేటప్పుడు ఎన్నో రకాలుగా ఆలోచిస్తారు. అబ్బాయి మంచివాడా కాదా, అలవాట్లు, ఆస్తి పాస్తులు ఇలా ఒక్కటేమిటి పలు విధాలుగా ఆలోచిస్తారు. అయినప్పటికీ కొన్నిసార్లు మోసపోయి అమ్మాయి జీవితాన్ని బలిపెడుతున్నారు. ముఖ్యంగా భార్యలను హింసించే భర్తలైతే కోకొల్లలు. తాజాగా ఓ వరుడు పెళ్లి వేదికపైనే వధువుపై దాడికి పాల్పడ్డాడు. ఇష్టమొచ్చినట్లు ఆమెను కొట్టి తన ప్రతాపాన్ని ఆమెపై చూపాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.,వీడియోను గమనిస్తే.. పెళ్లి వేదికపై వధువు, వరుడు నిల్చుని ఉంటారు. వరుడు తన చేతిలో ఉన్న లడ్డూ తినమని వధువు నోటికి అందించబోతాడు. ఇందుకు ఆమెకు తినడం ఇష్టం లేదని నిరాకరిస్తుంది. దీంతో పొగరుగా లడ్డూను వరుడు.. వధువు ముఖంపై విసురుతాడు. అబ్బాయి ప్రవర్తన చూసి కోపోద్రిక్తురాలైన అమ్మాయి కూడా లడ్డూను అతడిపైకి విసుతుంది. దీంతో చిర్రెక్కిపోయిన వరుడు.. వధువు చెంపపై పెళ్లుమని కొడతాడు. అంతటితో ఆగకుండా పంచులతో ఆమెపై విరుచుకుపడతారు. రెండు, మూడు సార్లు వధువుపై దాడి చేస్తాడు. చుట్టుపక్కల వారించే లోపే ఆమెను కొడతాడు. వరుడు ప్రవర్తనకు వివాహనికి వచ్చిన అతిథులు కూడా షాక్ అయ్యారు.,,ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వరుడి ప్రవర్తన చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. కొంతమంది వధువును ఇలా కొట్టినందుకు అతడిపై చర్యలు తీసుకోవాలని మండిపడుతున్నారు.,రామ్ సుబాగ్ యాదవ్ అనే ఫేస్‌బుక్ యూజర్ ఈ వీడియోను తన పోస్ట్ చేశాడు. ఈ వీడియో పోస్ట్ అయిన నాలుగు రోజుల్లోనే 23 వేల వీక్షణలు అందుకుంది. 1900 మంది తమ స్పందనలు తెలియజేశారు.,