Anant Ambani-Radhika Merchant : అతిథులకు ముఖేష్ అంబానీ అందించిన లగ్జరీలు ఇవే-anant ambani radhika merchant pre wedding expensive services provide to guests by mukesh ambani ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Anant Ambani Radhika Merchant Pre Wedding Expensive Services Provide To Guests By Mukesh Ambani

Anant Ambani-Radhika Merchant : అతిథులకు ముఖేష్ అంబానీ అందించిన లగ్జరీలు ఇవే

Anand Sai HT Telugu
Mar 04, 2024 02:35 PM IST

Anant Ambani-Radhika Merchant : ఇప్పుడు దేశం అంతా హాట్ టాపిక్.. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ గురించే. అయితే ఈ వేడుకకు వచ్చిన వారి కోసం ముఖేష్ అంబానీ ఎలాంటి ఏర్పాట్లు చేశారో తెలిస్తే మాత్రం కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే.

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ గత కొన్ని రోజులుగా దేశంలోనే అతిపెద్ద టాపిక్. రాధిక మర్చంట్, అనంత్ అంబానీల ప్రీ-వెడ్డింగ్ వేడుక గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగింది. ప్రపంచ స్థాయి ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. బాలీవుడ్ ప్రముఖులు ఎంతో సందడి చేశారు. అంబానీ ఇంటి ఈ వేడుక రిహన్న ప్రదర్శనతో ప్రారంభమైంది. ఆమె ప్రదర్శనకే కోట్ల డబ్బు కుమ్మరించింది అంబానీ ఫ్యామిలీ.

జామ్‌నగర్‌లో మూడు రోజుల పాటు ఈ ప్రీ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. అయితే తమ అతిథుల కోసం అంబానీ కుటుంబం వివిధ విలాసవంతమైన, ప్రత్యేకమైన సేవలను ఏర్పాటు చేసింది. ముంబయి, ఢిల్లీ నుండి జామ్‌నగర్‌కు చార్టర్డ్ విమానాలు, ప్రపంచ స్థాయి చెఫ్‌లు, వార్డ్‌రోబ్ సేవలు, అతిథులు ప్రయాణం చేసేందుకు విలాసవంతమైన కార్లను ఏర్పాటు చేసింది. గెస్టులను ఎంటర్టైన్ చేసేందుకు రిహన్న, అర్జిత్ సింగ్, దిల్జిత్ దోసాంజ్ సహా అనేక మంది సెలబ్రెటీలను తీసుకొచ్చారు.

దాదాపు 1,000 మంది అతిథులను గొప్పగా చూసేందుకు ప్లాన్ చేశారు. అంబానీ కుటుంబం.. జపనీస్, థాయ్, మెక్సికన్, పార్సీ థాలీతో సహా అనేక రకాల వంటకాలను అతిథులకు అందించింది. ఇండోర్‌లోని జార్డిన్ హోటల్ నుండి 21 మంది చెఫ్‌ల బృందాన్ని నియమించింది. అల్పాహారం కోసం 75 వంటకాలు, మధ్యాహ్న భోజనంలో 225 రకాల వంటకాలు, రాత్రి భోజనానికి దాదాపు 275 రకాల వంటకాలు, అర్ధరాత్రి 85 రకాల వంటకాలు అందుబాటులో ఉన్నాయి. ఇండోర్ నుండి చెఫ్‌లు ఒక ప్రత్యేక కౌంటర్‌ను కలిగి ఉంటారు. ఇక్కడ వారు సాంప్రదాయ ఇండోర్ వంటకాలను అందిస్తారు.

ప్రీ-వెడ్డింగ్ హాజరైన అతిథులకు లాండ్రీ, చీరల డ్రేపర్‌లు, హెయిర్‌స్టైలిస్ట్‌లు, మేకప్ ఆర్టిస్టులతో.. అబ్బో ఇలా ఒకటి ఏంటి.. పలు సేవలకు కూడా ఉన్నాయి. జామ్‌నగర్ విమానాశ్రయం నుండి అంబానీ గ్రాండ్ రిలయన్స్ గ్రీన్స్ కాంప్లెక్స్‌కు అతిథులను తరలించడానికి రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్, BMW సహా లగ్జరీ కార్లను పెట్టారు.

రిహన్నాతో పాటు, అర్జిత్ సింగ్, దిల్జిత్ దోసాంజ్ వంటి అనేక మంది సంగీతకారులు జామ్‌నగర్‌లో ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్ గేట్స్, ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, వాల్ట్ డిస్నీ సీఈవో బాబ్ ఇగర్, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, బాలీవుడ్ స్టార్లు షారుఖ్ ఖాన్, అమితాబ్ వంటి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

అంతేకాదు.. స్టార్ క్రికెటర్లు కూడా ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరయ్యారు. మనం ఎంఎస్ ధోనీని క్రికెట్ ఆడేప్పుడు చూశాం. కానీ అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ధోనీ దాండియా ఆడాడు. వీరి మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన హాజరయ్యారు. అతిథ్యంతో ముఖేష్ అంబానీ అతిథులను ఉక్కిరిబిక్కిరి చేశారనే చెప్పాలి. తన కొడుకు ప్రీ వెడ్డింగ్ వచ్చిన అతిథులకు ముఖేష్ స్వయంగా వడ్డించారు. అనంత్ అంబానీ మాట్లాడిన మాటలకు ముఖేష్ కంటతడి పెట్టుకున్న విషయం తెలిసిందే. దానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.

WhatsApp channel