Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో ఆంగ్ల అక్షరం Mల మధ్య ఒక N ఇరుక్కుపోయింది, అది ఎక్కడుందో ఐదు సెకండ్లలో చెప్పండి
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్లు ఆసక్తికరంగా ఉంటాయి. ఇక్కడ మేము ఒక ఆప్టికల్ ఇల్యూషన్ ఇచ్చాము. దీన్ని సాల్వ్ చేసి చూపించండి.
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్లు అంటే ఎంతో మందికి ఆసక్తి ఉంటుంది. ఇవి కంటికి, మెదడుకు సవాలు విసురుతాయి. కాసేపు మిమ్మల్ని అక్కడే ఆగిపోయేలా చేస్తాయి. అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ ఇక్కడ ఇంకొకటి ఇచ్చాము. ఇది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఆంగ్ల అక్షరం M ఈ ఆప్టికల్ ఇల్యుషన్లో కనిపిస్తోంది. ఎన్నో Mల మధ్య ఒక ఆంగ్ల అక్షరం N ఉంది. అది ఎక్కడ ఉందో మీరు కనిపెట్టాలి.
ఒక్కో లైను చూసుకుంటూ పోతే ఆన్సర్ ఇట్టే దొరికేస్తుంది. దానికి కాస్త సమయం పడుతుంది. అలా ఎక్కువ సమయంలో కనిపెడితే మీ గొప్పతనం ఏముంది? కేవలం 5 సెకండ్లలోనే N అక్షరాన్ని కనిపెట్టండి. అలా కనిపెట్టారంటే మీకు తెలివితేటలు సూపర్ అని చెప్పుకోవచ్చు. అంతేకాదు కళ్ళు, మెదడు... ఈ రెండూ సమన్వయంతో అద్భుతంగా పనిచేస్తున్నాయని అర్థం.
ఆప్టికల్ ఇల్యూషన్ జవాబు
మీరు ఆప్టికల్ ఇల్యూషన్ కేవలం ఐదు సెకండ్లలోనే చేధించారంటే... మెదడుకు మీ మొత్తం నాడీ వ్యవస్థ పై నియంత్రణ ఉందని అర్థం చేసుకోవచ్చు. అలా నాడీ వ్యవస్థ పై మీ మెదడు అంతా నియంత్రణ కలిగి ఉన్నప్పుడే ఆలోచనలు, నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలుగుతారు. లేకుంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవచ్చు. మీకు ఆలోచించే సామర్థ్యం తగ్గిపోవచ్చు.
ఇక జవాబు విషయానికి వస్తే 5 సెకన్లలో జవాబును కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. ఐదు సెకన్లు దాటి మీరు జవాబులు కనిపెట్టినా కూడా పెద్దగా ఫలితం లేదు. ఇక ఆంగ్ల అక్షరం Mల మధ్య ఆంగ్ల అక్షరం N ఎక్కడుందో మేము చెబుతున్నాం. నిలువ వరుసల్లో ఆరో లైన్‌ను చూడండి. అందులో కింద నుంచి నాలుగవ అక్షరం N. నాలుగు సెకన్ల పాటు పరిశీలనగా చూస్తే ఐదో సెకన్లలో మీకు ఆన్సర్ దొరికిపోవడం చాలా సులువు. అయితే దీనికి ఎంతో ఏకాగ్రత అవసరం. ఏకాగ్రత ఉన్నవారు మాత్రమే ఆప్టికల్ ఇల్యూషన్లను చేధించగలరు.
ఆప్టికల్ ఇల్యూషన్లో ఇప్పుడు ఎంతో వైరల్ అవుతున్నాయి. అవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. కాబట్టి వాటిని సాల్వ్ చేసే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఆప్టికల్ ఇల్యూషన్ పేరుతో ఎన్నో ఇన్స్టా గ్రామ్ పేజీలు ఉన్నాయి. మీకు ఆసక్తి అనిపిస్తే ఆ పేజీల్లోకి వెళ్లి రోజుకు రెండు ఆప్టికల్ ఇల్యూషన్లను సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే మీ ఇంట్లోని పిల్లల చేత కూడా కొన్ని సులువైన ఆప్టికల్ ఇల్యూషన్లను సాల్వ్ చేసేలా చూడండి. ఇది వారి ఏకాగ్రతను పెంచడంతోపాటు, మెదడు సామర్థ్యాన్ని పెంచుతుంది. వారికి చదువుపై ఆసక్తిని, ఏకాగ్రతను పెరిగేలా చేస్తుంది.
ఆప్టికల్ ఇల్యూషన్ల చరిత్ర విషయానికి వస్తే ఎక్కడా వీటి గురించి పెద్దగా వివరాలు లేవు. అయితే ఎక్కువ మంది చరిత్రకారులు చెబుతున్న ప్రకారం గ్రీకు దేశంలో ఎక్కువగా ఈ ఆప్టికల్ ఇల్యూషన్ల ఆధారాలు లభించాయి. ముఖ్యంగా గ్రీసు దేశంలోని పాత ఆలయాలపై కొన్ని రకాల ఆప్టికల్ ఇల్లుషన్లు కనిపించాయి. కాబట్టి ప్రస్తుతానికి వీటి పుట్టినిల్లుగా గ్రీసు దేశాన్ని అనుకోవాలి. అవి ఎక్కడ పుడితేనేమి... ప్రస్తుతం ప్రపంచమంతా పాకేసాయి. ఎంతోమందికి వినోదాన్ని పంచుతున్నాయి.
టాపిక్