Retro Walking Benefits : వెనక్కు నడిస్తే అనేక ప్రయోజనాలు.. బరువు తగ్గుతారా?-amazing health benefits with retro walking benefits weight loss ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Retro Walking Benefits : వెనక్కు నడిస్తే అనేక ప్రయోజనాలు.. బరువు తగ్గుతారా?

Retro Walking Benefits : వెనక్కు నడిస్తే అనేక ప్రయోజనాలు.. బరువు తగ్గుతారా?

Anand Sai HT Telugu

Retro Walking Benefits In Telugu : రెట్రో వాకింగ్ లేదా రివర్స్ వాకింగ్‌తో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీ దిన చర్యలో భాగం చేసుకోవడం వలన అద్భుతాలు చూడొచ్చు.

రెట్రో వాకింగ్

ఎప్పుడైనా వెనుకకు నడవడానికి ప్రయత్నించారా? ఇలా చేస్తే చాలా మంది మనకు పిచ్చి అని చూస్తుంటారు. అర్ధంలేనిదిగా అనిపించవచ్చు. కానీ ఇది మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. వాకింగ్, జాగింగ్‌తో పాటు రివర్స్ వాకింగ్‌ను మీ దినచర్యలో చేర్చుకోవడానికి ప్రయత్నించండి. 10-20 నిమిషాల రెట్రో వాకింగ్ చేస్తే అద్భుత ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి. ప్రతిరోజూ లేదా వారానికి కొన్ని సార్లు ఇలా చేస్తే.. మీ మనస్సు, శరీరం బాగుంటుంది.

రివర్స్ వాకింగ్‌ను రెట్రో-వాకింగ్ అని కూడా పిలుస్తారు. ఆరోగ్యం, మానసిక ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. మోకాలి, పిరుదు, చీలమండల కదలిక పరిధిని మెరుగుపరచడానికి, బలాన్ని పెంపొందించడానికి రివర్స్ వాకింగ్‌ను ఉపయోగిస్తారు.

వెనుకకు నడవడం వల్ల మీ శరీరంపై మీరు ఉపయోగించే శక్తి పెరుగుతుంది. అందువలన ఇది మీ శారీరక దృఢత్వాన్ని మెరుగుపరుస్తుంది. వెనుకకు నడవడం నిజానికి కండరాలను వేరే విధంగా పని చేసేలా చేస్తుంది. విభిన్నంగా ఆలోచించడం, వ్యవహరించడం కూడా దీనితో వస్తుంది. మీ ఓర్పు సామర్థ్యాన్ని మరింత త్వరగా మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

రివర్స్ వాకింగ్ చేస్తే.. మీ గుండె ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుంది. మెదడుతో సహా కండరాలు, అవయవాలకు మరింత రక్తం, ఆక్సిజన్‌ను ప్రసరిస్తుంది. ఇది శరీర అవగాహనను పెంచుతుంది. శరీర కదలికను పెరిగేలా చేస్తుంది. రెట్రో వాకింగ్ కాలి కండరాలలో బలాన్ని పెంచుతుంది. మెదడు, గుండెకు మేలు చేస్తుంది. మీ జీవక్రియను పెంచుతుంది. రివర్స్ వాకింగ్ చేస్తే.. సాధారణ ఫార్వర్డ్ వాకింగ్ కంటే ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి అనుమతిస్తుంది.

రెట్రో-వాకింగ్‌పై చేసిన చాలా అధ్యయనాలు వెనుకకు నడవడం వల్ల ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయని చెబుతున్నాయి. ముందుకు కదలడం కంటే వెనుకకు కదలడం వల్ల మీ గుండె వేగంగా పంపింగ్ అవుతుంది. కార్డియో ఫిక్స్, మెటబాలిజం బూస్ట్, తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తారు. నిమిషానికి 40 శాతం ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. బరువు తగ్గేందుకు సాయపడుతుంది.

జర్నల్ ఆఫ్ బయోమెకానిక్స్ దీనిపై పరిశోధన చేసింది. ఫార్వర్డ్ వాకింగ్ లేదా రన్నింగ్‌తో పోలిస్తే బ్యాక్ వాకింగ్ లేదా రన్నింగ్ ద్వారా మోకాలి నొప్పి తగ్గుతుందని ఒక అధ్యయనం కనుగొంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురించబడిన మరొక అధ్యయనం జాగింగ్, వాకింగ్ కలయిక గుండె నాళాల ఫిట్‌నెస్‌ను మెరుగుపరుస్తుంది. శరీర కూర్పును మార్చగలదని కనుగొంది.