Lemon Grass Benefits : నిమ్మగడ్డి గురించి తెలుసా? ఎన్ని ప్రయోజనాలో..-amazing health benefits of lemon grass from reducing inflammation to improving digestion and more details inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Lemon Grass Benefits : నిమ్మగడ్డి గురించి తెలుసా? ఎన్ని ప్రయోజనాలో..

Lemon Grass Benefits : నిమ్మగడ్డి గురించి తెలుసా? ఎన్ని ప్రయోజనాలో..

HT Telugu Desk HT Telugu

Lemongrass Benefits : లెమన్‌గ్రాస్ అనేది మంచివాసన గల మెుక్క. అంతేకాకుండా దీనితో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. లెమన్ గ్రాస్​ రసం తీసుకుంటే చాలామంచిదని వైద్యులు చెబుతారు. అందం నుంచి ఆరోగ్యం దాకా చాలా ప్రయోజనాలు ఉంటాయంటున్నారు.

నిమ్మగడ్డి ప్రయోజనాలు (unsplash)

ప్రకృతిలో అనేక రకాల గడ్డి మెుక్కలు ఉంటాయి. అయితే అందులో కొన్ని ఔషధాన్ని కలిగించే మెుక్కలు ఉంటాయి. అలాంటి జాతికి చెందినదే.. నిమ్మగడ్డి(Lemon Grass) కూడా. నిమ్మగడ్డి ఆయుర్వేదంగా ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటిలో ఉండే ఏరోమాటిక్ ఎసెన్షియల్ ఆయిల్ కారణంగా ఈ మొక్క సువాసనలు వెదజల్లే స్వభావం ఉంటుంది. కొంతమంది ఈ మెుక్కను సూప్‌లు, కూరలు, టీలకు ఉపయోగిస్తారు. నిమ్మగడ్డి ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) ఉన్నాయి. సాంప్రదాయ వైద్యంలో శతాబ్దాలుగా ఉపయోగించబడుతోంది.

లెమన్ గ్రాస్‌(Lemon Grass)లో విటమిన్లు సి, ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కణాలకు హాని కలిగించే, దీర్ఘకాలిక వ్యాధుల అభివృద్ధికి దోహదపడే హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సుకు నిమ్మగడ్డి ఎంతగానో ఉపయోగపడతాయి.

నిమ్మగడ్డి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉందని నిర్ధారణైంది. ఇది శరీరంలో వాపును తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఆర్థరైటిస్ వంటి పరిస్థితులతో బాధపడుతున్న వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

నిమ్మగడ్డి ప్రశాంతత, విశ్రాంతి లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది ఒత్తిడి(Stress), ఆందోళనకు గురైనప్పుడు సమర్థవంతమైన నివారణగా పని చేస్తుంది. లెమన్ గ్రాస్ టీ(Lemon Grass Tea) తాగడం వల్ల ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. రిలాక్సేషన్‌గా ఫీల్ అవుతారు. నిమ్మగడ్డి సువాసనను పీల్చడం కారణంగా మనసుకు ప్రశాంతత అనిపిస్తుంది.

నిమ్మగడ్డి జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎందుకంటే ఇది ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. నిమ్మగడ్డి జీర్ణవ్యవస్థలో బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లను నిరోధించడంలో సహాయపడుతుంది.

నిమ్మగడ్డి బలమైన యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది బ్యాక్టీరియా, వైరస్ లు, శిలీంధ్రాల శ్రేణికి వ్యతిరేకంగా ప్రభావవంతంగా పని చేస్తుంది. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, క్లీనింగ్ సొల్యూషన్స్‌, చర్మ ఇన్ఫెక్షన్‌లతోపాటుగా చాలా వాటికి లెమన్ గ్రాస్ ఉపయోగపడుతుంది.

నిమ్మగడ్డితో టీ తయారుచేసుకొని తాగుతారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిమ్మగడ్డిని ముక్కలుగా చేసి.. నీటిలో వేసి బాగా మరిగించాలి. నిమ్మగడ్డి మరిగే సమయంలో వాటి నుంచి సువాసనలు వెదజల్లుతుంది. బాగా మరిగిన తర్వాత.. వడగట్టి గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. జలుబు, దగ్గు, జ్వరం, గొంతువాపు, గొంతునొప్పి తోపాటు తలనొప్పి వంటి సమస్యల నుండి సైతం బయటపడొచ్చు. నిమ్మగడ్డిని ఎక్కువగా పర్ఫ్యూమ్స్, రూమ్ ఫ్రెష్ నర్స్, డియోడరెంట్, సోప్స్ అంటూ ఎన్నో రకాలుగా సైతం వాడతారు. కొంతమంది రైతులు దీనిని పెంచి.. అధిక మెుత్తంలో సంపాదిస్తున్నారు.