Mushroom In Winter : చలికాలంలో పుట్టగొడుగులు తింటే అద్భుతమైన ప్రయోజనాలు-amazing health benefits of eating mushroom in winter season ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mushroom In Winter : చలికాలంలో పుట్టగొడుగులు తింటే అద్భుతమైన ప్రయోజనాలు

Mushroom In Winter : చలికాలంలో పుట్టగొడుగులు తింటే అద్భుతమైన ప్రయోజనాలు

Anand Sai HT Telugu
Nov 17, 2023 09:30 AM IST

Winter Mushroom Benefits : చలికాలంలో ఎలాంటి ఆహారాలు తీసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. అందులో పుట్టగొడుగులు చాలా ఆరోగ్యకరం. ఈ సమయంలో క్రమం తప్పకుండా మష్రూమ్ తింటే ఎన్నో లాభాలు. వాటి గురించి తెలుసుకుందాం..

పుట్టగొడుగులు
పుట్టగొడుగులు

శీతాకాలం వచ్చింది. ఈ సీజన్‌లో మార్కెట్‌లు రకరకాల కూరగాయలు, పండ్లతో నిండి ఉంటాయి. అయితే శీతాకాలంలో ప్రత్యేకంగా తినవలసిన కొన్ని ఆహారాలు ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను(Health Benefits) పొందవచ్చు. అలాంటి వాటిలో ఒకటి పుట్టగొడుగులు(Mushroom). ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. చలికాలంలో రెగ్యులర్ గా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

పుట్టగొడుగులలో ప్రోటీన్, అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. పుట్టగొడుగులలో విటమిన్ డి(Vitamin D), బి2, బి3 ఉంటాయి. విటమిన్ డి లోపానికి ప్రతిరోజూ పుట్టగొడుగులను తినడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పుట్టగొడుగులలో T-ఫ్రాక్షన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. వ్యాధులతో పోరాడుతుంది.

చలికాలంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పుట్టగొడుగులను తినడం వల్ల రోగనిరోధక శక్తి(Immunity Power) పెరుగుతుంది. పుట్టగొడుగులను విటమిన్ డి మంచి మూలంగా పరిగణిస్తారు. విటమిన్ డి లోపం ఉన్నవారు ఆహారంలో పుట్టగొడుగులను చేర్చుకోవాలి. పుట్టగొడుగులు ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి సెల్యులార్ డ్యామేజ్‌ను నివారిస్తాయి. క్యాన్సర్(Cancer) ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

సోడియం తక్కువగా, పొటాషియం ఎక్కువగా ఉండే పుట్టగొడుగులను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. పుట్టగొడుగులకు చెడు కొలెస్ట్రాల్‌ను(Bad Cholesterol) తగ్గించే సామర్థ్యం ఉంది.

పీచు, పొటాషియం, విటమిన్లు పుష్కలంగా ఉండే పుట్టగొడుగులను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. ఇవి మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. తక్కువ కేలరీల ఉంటాయి, ఇది బరువు తగ్గడానికి(Weight Loss) అవసరమైన పోషకాలను కలిగి ఉంటుంది.

ఫైబర్ అధికంగా ఉండే పుట్టగొడుగులను మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆహారంలో కూడా చేర్చుకోవచ్చు. పుట్టగొడుగులను తినడం వల్ల మంచి గట్ బాక్టీరియా సంఖ్య పెరుగుతుంది. గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అమైనో ఆమ్లాలు, కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పుట్టగొడుగులను తినడం వల్ల కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.