Curry Leave Benefits : పరగడుపున 5 కరివేపాకు ఆకులు, 1 వెల్లుల్లి తింటే శరీరంలో ఎన్నో అద్భుతాలు
Benefits of Curry Leaves : ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటారు. దాని కోసం ఆరోగ్యకరమైన అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలిని మెయింటెన్ చేస్తుంటారు. అయితే ఉదయాన్నే లేవగానే కొన్ని పనులు చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు.
ఉదయం పూట ఖాళీ కడుపుతో పౌష్టికాహారం తీసుకోవడమే ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను పొందేందుకు ఉత్తమ మార్గం. ఉదయం లేవగానే 5 కరివేపాకు ఆకులు, ఒక వెల్లుల్లిని ఖాళీ తిని, ఒక గ్లాసు వేడినీళ్లు తాగినా శరీరంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి.
ట్రెండింగ్ వార్తలు
కరివేపాకు, వెల్లుల్లి మన రోజువారీ ఆహారంలో ఉండే ముఖ్యమైన పదార్థాలు. వాటిని పచ్చిగా, అది కూడా ఖాళీ కడుపుతో తీసుకుంటే, వాటిలోని అన్ని పోషకాలు శరీరానికి పూర్తిగా వెళ్తాయి. శరీరంలోని వివిధ సమస్యలకు చెక్ పెడతాయి. నెల రోజుల పాటు రోజూ ఉదయాన్నే 5 కరివేపాకు ఆకులు, 1 వెల్లుల్లి తింటే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఇప్పుడు చూద్దాం.
ఊబకాయంతో బాధపడేవారు సింపుల్ గా బరువు తగ్గాలంటే ఉదయాన్నే కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు తింటే మంచి ఫలితం ఉంటుంది. దీన్ని ఒక నెల పాటు కంటిన్యూగా తీసుకుంటే మీ శరీర బరువులో మంచి మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే కరివేపాకులోని ఔషధ గుణాలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. అదేవిధంగా వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ శరీరంలో నిల్వ ఉన్న కొవ్వులను ఎఫెక్టివ్ గా కరిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
కరివేపాకు, వెల్లుల్లిని ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. రక్తంలో అధిక చక్కెర ఉన్న మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి వీటిని తీసుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు.
వెల్లుల్లి రక్తపోటును తగ్గించడంలో సహాయపడే ఆహారం. వెల్లుల్లిలోని అల్లిసిన్, డయల్ డైసల్ఫైడ్, డయల్ ట్రైసల్ఫైడ్ వంటి సమ్మేళనాలను కలిగి ఉన్న సల్ఫర్ దీనికి కారణం. అలాగే కరివేపాకులో ఉప్పు తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉండటం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. ముఖ్యంగా ఈ రెండు పదార్థాలను రోజూ తీసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థలో ఏదైనా సమస్య ఉంటే అది శరీరంలో అనేక సమస్యలను కలిగిస్తుంది. శరీరంలోని అనేక సమస్యలకు జీర్ణ సమస్యలే ప్రధాన కారణం. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను కలిగి ఉండాలంటే, కరివేపాకు, వెల్లుల్లిని తినండి.
శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ అనారోగ్య సమస్యలు రాకుండా, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలంటే వెల్లుల్లి, కరివేపాకులను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుని ఒక గ్లాసు వేడి నీళ్లను తాగాలి.
బలహీనమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండటం వలన మీరు తరచుగా జలుబు, ఫ్లూ, ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకుంటే, ఉదయాన్నే కరివేపాకు, వెల్లుల్లిని తినండి. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.
కరివేపాకు శరీరంలోని అదనపు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే, కరివేపాకు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నిరోధించడం ద్వారా మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకుంటే, అది శరీరంలోని కొలెస్ట్రాల్‌ను 10 శాతం తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు లేదా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించాలనుకునే వారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలను తినండి. మంచి ఫలితాలను పొందవచ్చు.
గమనిక : మాకు దొరికిన సమాచారం ఆధారంగా ఈ కథనం ఇచ్చాం. మీకు ఏవైనా అనుమానాలు వైద్యుడిని సంప్రదించండి. మీ శరీరం పరిస్థితిని బట్టి ఏదైనా ప్రారంభించాలి.