Amaranth Buttermilk Recipe । తోటకూర మజ్జిగ పులుసు.. వేసవిలో తింటే ఆరోగ్యం అదుర్స్!-amaranth buttermilk gravy perfect lunch recipe for summers ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Amaranth Buttermilk Gravy, Perfect Lunch Recipe For Summers

Amaranth Buttermilk Recipe । తోటకూర మజ్జిగ పులుసు.. వేసవిలో తింటే ఆరోగ్యం అదుర్స్!

Amaranth Buttermilk Gravy Recipe
Amaranth Buttermilk Gravy Recipe

Thotakura Majjiga Pulusu Recipe: తోటకూర మజ్జిగ పులుసు రెసిపీ రుచికరమైనది, ఆరోగ్యకరమైనదే కాకుండా ఈ వేసవికాలంలో లంచ్ లేదా డిన్నర్ సమయంలో ఆస్వాదించడానికి ఉత్తమమైనది.

Healthy Summer Recipes: వేసవి అంటే ఎలా ఉంటుందో అనుభవిస్తున్న మనందరికీ తెలుసు. బయట నుంచి తీవ్రమైన ఎండవేడి మన శరీరాలను వేడెక్కిస్తున్నప్పుడు, మనం తినే ఆహారాల ద్వారా వేడిని నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి. నీటిశాతం అధికంగా ఉండే తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. పెరుగు, మజ్జిగ వంటివి తీసుకోవడం వలన శరీర వేడిని తగ్గించటంతో పాటు, జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగైన స్థితిలో ఉంచుతాయి.

ట్రెండింగ్ వార్తలు

ఇక్కడ తోటకూర మజ్జిగ పులుసు రెసిపీని అందిస్తున్నాం. ఈ వంటకం రుచికరమైనది, ఆరోగ్యకరమైనదే కాకుండా ఈ వేసవికాలంలో లంచ్ లేదా డిన్నర్ సమయంలో ఆస్వాదించడానికి ఉత్తమమైనది. తోటకూర ఆకులు విటమిన్లు, మినరల్స్ ఎక్కువ ఉంటాయి, ఇనుము ఎక్కువ ఉంటుంది. ఆయుర్వేదంలోనూ తోటకూరకు మంచి ప్రాముఖ్యత ఉంది. అందుకే దీనిని సూపర్ ఫుడ్‌లో ఒకటిగా పరిగణిస్తారు. తోటకూర మజ్జిగ పులుసు ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చిన సూచనలను చదవండి.

Amaranth Buttermilk Gravy Recipe కోసం కావలసినవి

  • 1 కప్పు తోటకూర ఆకులు
  • 1 కప్పు పెరుగు
  • 1 ఉల్లిపాయ
  • 1/2 టీస్పూన్ పసుపు
  • 2 టేబుల్ స్పూన్లు తాజా కొబ్బరి
  • 1 పచ్చి మిర్చి
  • 1 టీస్పూన్ ఆవాలు
  • 1 టీస్పూన్ మెంతులు
  • 1 టీస్పూన్ జీలకర్ర
  • 1 చిటికెడు ఇంగువ
  • 1 రెమ్మ కరివేపాకు
  • 2 ఎండు మిరపకాయలు
  • కొద్దిగా తాజా కొత్తిమీర
  • ఉప్పు రుచికి తగినంత
  • పోపుకు నూనె

తోటకూర మజ్జిగ పులుసు తయారీ విధానం

  1. ముందుగా తాజా కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర ఆకులను తీసుకొని, కొద్దిగా నీరు కలిపి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. పెరుగును కొన్ని నీళ్లతో చిలికి చిక్కటి మజ్జిగ చేసుకోవాలి.
  2. ఒక ఫ్లాట్ స్కిల్లెట్‌లో నూనె వేసి, వేడి చేసి అందులో ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఆపైన తోటకూర వేసి ఉడికినంత వరకు వేయించాలి.
  3. ఇప్పుడు అందులో రుబ్బుకున్న కొబ్బరి పేస్ట్, మజ్జిగ వేసి కలపండి. ఆపై ఉప్పు, పసుపు పొడి వేసి బాగా కలపాలి. 10 నిమిషాలు ఉడకించాలి.
  4. ఈలోపు ఒక చిన్న పాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి, అందులో ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి, కరివేపాకు, ఎండు మిరపకాయలు వేసి పోపు వేసుకోవాలి.
  5. ఇప్పుడు పోపును ఉడుకుతున్న తోటకూర మజ్జిగలో కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

అంతే, తోటకూర మజ్జిగ పులుసు రెడీ. ఈ రెసిపీని అన్నంతో తింటే అద్భుతంగా ఉంటుంది.

సంబంధిత కథనం