Aloo paneer Masala: బంగాళదుంప పనీర్ మసాలా కూర ఇలా వండారంటే అన్నం చపాతీల్లో టేస్టీగా ఉంటుంది-aloo paneer masala recipe in telugu know how to make this curry ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Aloo Paneer Masala: బంగాళదుంప పనీర్ మసాలా కూర ఇలా వండారంటే అన్నం చపాతీల్లో టేస్టీగా ఉంటుంది

Aloo paneer Masala: బంగాళదుంప పనీర్ మసాలా కూర ఇలా వండారంటే అన్నం చపాతీల్లో టేస్టీగా ఉంటుంది

Haritha Chappa HT Telugu
Nov 11, 2024 11:30 AM IST

Aloo paneer Masala: ఆలూ పనీర్ మసాలా కర్రీ ఎంతో మందికి నచ్చుతుంది. కానీ వండే విధానం చాలా తక్కువ మందికే తెలుసు. పిల్లలకు నచ్చేలా ఆలూ పనీర్ కర్రీ వండి చూడండి. వారు ఇష్టంగా తింటారు.

ఆలూ పనీర్ మసాలా రెసిపీ
ఆలూ పనీర్ మసాలా రెసిపీ

పనీర్‌తో చేసే వంటకాలు ఎన్నో ఉన్నాయి. ఎక్కువగా పనీర్ బటర్ మసాలా, పాలక్ పనీర్ వంటివే ఎక్కువగా తింటూ ఉంటారు. ఒకసారి ఆలూ పనీర్ మసాలా కర్రీ కూడా ట్రై చేయండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలోనే కాదు, చపాతీ రోటీల్లో కూడా దీన్ని తినవచ్చు. వీటిని చేయడం చాలా సులువు. ఆలూ పనీర్ మసాలా కర్రీ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

ఆలూ పనీర్ మసాలా కర్రీ రెసిపీకి కావలసిన పదార్థాలు

పనీర్ ముక్కలు - పావు కిలో

బంగాళా దుంపలు - రెండు

కారం - ఒకటిన్నర స్పూను

పసుపు - అర స్పూను

అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు

బిర్యానీ ఆకులు - ఒకటి

జీలకర్ర - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

ఉల్లిపాయలు - రెండు

టమోటోలు - రెండు

ధనియాల పొడి - రెండు స్పూన్లు

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

దాల్చిన చెక్క - చిన్న ముక్క

నెయ్యి - ఒకటిన్నర స్పూను

ఆలూ పనీర్ మసాలా రెసిపీ

1. బంగాళదుంపలను ముందే ఉడికించి పైన పొట్టు తీసి ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.

2. ఉల్లిపాయలను ముక్కలు చేసి మిక్సీలో వేసి రుబ్బుకొని ఆ మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.

4. నెయ్యి వేడెక్కాక జీలకర్ర, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి.

5. తర్వాత ఉల్లిపాయ రుబ్బును కూడా వేసి బాగా వేగనివ్వాలి.

6. రెండు నిమిషాలు పాటు వేగితే పచ్చివాసన పోతుంది.

7. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసి ఆ మాత్రం మిశ్రమాన్ని చిన్న మంట మీద వేయించుకోవాలి.

8. ఇది బాగా వేగాక పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి.

9. ఇది బాగా వేగాక టమాటో ప్యూరీని కూడా వేసి కలుపుకోవాలి.

10. పైన మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.

11. ఆ తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను వేసి కలుపుకోవాలి.

12. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేయాలి.

13. ఈ మొత్తం మిశ్రమం ఇగురులాగా వచ్చేందుకు రెండు కప్పుల నీటిని వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి.

14. పది నిమిషాల తర్వాత మూత తీసి పనీర్ ముక్కలను వేసి కలిపి మళ్ళీ మూత పెట్టాలి.

15. కనీసం పది నిమిషాలు పాటు చిన్న మంట మీద ఉడికించాలి.

16. ఆ తర్వాత పైన కొత్తిమీరను చల్లుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే టేస్టీ ఆలూ పనీర్ కర్రీ రెడీ అయినట్టే.

పనీర్ బటర్ మసాలా ఎంత టేస్టీగా ఉంటుందో ఈ ఆలూ పనీర్ కర్రీ కూడా అంతే టేస్టీగా ఉంటుంది. దీన్ని చపాతీ, రోటీలతో తింటే రుచి అదిరిపోతుంది. అలాగే వేడి వేడి అన్నంలో కలుపుకున్నా బాగుంటుంది. వెజ్ బిర్యానీ చేసుకున్నప్పుడు పక్కన ఈ ఆలూ పనీర్ కర్రీ ఉంటే ఆ రుచి వేరు. బగారా రైస్ తో కూడా ఈ పనీర్ గ్రేవీ కూర టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు చేసుకొని చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం.

Whats_app_banner