Milk Vs Almond Milk: పాలకు, బాదంపాలకు మధ్య తేడా ఏంటి? రెండింటిలో దేనికి పోషక విలువలు ఎక్కువ?
Almond Milk Benefits: బాదంపాలు ఆల్‌రౌండర్ లాంటివి. పలు రకాలుగా ఉపయోగపడటమే కాకుండా రుచిలోనూ ధీటుగా ఉంటాయి. కానీ, బాదంపాలు సాధారణ పాలతో సమానంగా పోషకాలను అందిస్తాయా అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. దీనిపై వైద్యులు ఏమంటున్నారో తెలుసుకుందామా!

హెల్తీ ఫుడ్ తీసుకుందామనుకునే ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరి మైండ్ లో వచ్చే ఆలోచన బాదంపప్పులు. డ్రై ఫ్రూట్స్ అంటే ముందుగా బాదంపప్పులకే ప్రాధాన్యత ఉంటుంది. పాలు, పాల ఉత్పత్తుల ప్రత్యామ్నాయం కోసం చూసే వాళ్లలో కూడా ఉండే మొదటి ఆప్షన్ బాదంపాలే. ఎముకల్లో బలం సమకూర్చుకునేందుకు ప్రయత్నించే వారు పాలు తాగితే కాల్షియం అందుతుంది. మరి బాదంపాలు తాగితే కూడా అవే బెనిఫిట్స్ కలుగుతాయా.. ? పాలతో కలిగే ఇతర అవసరాలను కూడా బాదంపాలు తీరుస్తాయా? అంటే తెలుసుకోవాల్సిందే మరి!
బాదంపప్పులను గ్రైండ్ చేసి నీటితో కలిపి తయారుచేసే బాదంపాలకు, జంతువుల నుంచి పాలకు దాదాపు సమానమైన పోషక విలువలున్నాయని డైటీషియన్ డాక్టర్ రిధిమా కంసేరా అంటున్నారు.
కాల్షియం ప్రాధాన్యత
శరీరంలో కాల్షియం బలమైన ఎముకలకు, దంతాల నిర్మాణానికి కచ్చితంగా అవసరం. ఎముక సాంద్రతను కాపాడటానికి కూడా ఇది చాలా అవసరం. వయస్సుకు తగినంత కాల్షియం శరీరానికి అందకపోతే ఎముకల్లో సమస్యలు కలుగుతాయి. ఇది బోలు ఎముకల వ్యాధి వంటి పరిస్థితులకు దారితీస్తుంది. ఇంకొక విషయమేమిటంటే, కాల్షియం ఒంటరిగా పనిచేయదు. మనం తీసుకునే ఆహారం నుంచి కాల్షియంను సమర్థవంతంగా గ్రహించడానికి, శరీరానికి తగ్గట్లుగా ఉపయోగించడానికి విటమిన్ డి, మెగ్నీషియం, పాస్పరస్ వంటి పోషకాలు అవసరం. ఈ పరిస్థితుల్లో బాదంపాలు చాలా కీలకంగా వ్యవహరిస్తాయి. కేవలం క్యాల్షియం అందించేవిగా మాత్రమే కాకుండా, పోషక శక్తి కేంద్రంగా కూడా పనిచేస్తాయి.
కాల్షియంతో పాటుగా
పాలలో ఉండే పోషక విలువ కంటే బాదంపాలతో అందే బెనిఫిట్స్ ను చాలా మంది పట్టించుకోరు. నిజానికి బాదంపాలతో కాల్షియంతో పాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఇందులో సహజంగా కేలరీలు తక్కువగా ఉంటాయి. లాక్టోస్, కొవ్వు, శాచురేటెడ్ కొవ్వులు లేనిది అయినప్పటికీ, బలాన్ని అందించేదిగా ఉంటుంది. బాదంపాలలో కాల్షియం, విటమిన్ డి లతో పాటు మెగ్నీషియం అనే ఖనిజం కూడా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి కాల్షియంతో కలిసి పనిచేస్తుంది. ఇది కాల్షియం శోషణను మెరుగుపరుస్తుంది.
ఎముకల ఆరోగ్యానికి బాదం పాలు ఆల్‌రౌండర్‌లా కనిపిస్తాయి. కాబట్టి, బాదంపాలు ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం.
యాంటీఆక్సిడెంట్లు:
యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. బాదంలో విటమిన్-ఈ అధికంగా ఉంటుంది. ఇది ఎముక కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఆక్సీకరణ ఒత్తిడి ఎముక నష్టాన్ని వేగవంతం చేస్తుంది, కాబట్టి బాదం పాలు మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల సాంద్రతను కాపాడటానికి సహాయపడుతుంది.
తక్కువ పాస్పరస్:
ఎముక ఆరోగ్యానికి పాస్పరస్ అవసరం అయితే, బాదం పాలలో సమతుల్య పాస్పరస్ కంటెంట్ ఉంటుంది. ఇది ఎముక సమగ్రతను కాపాడుకోవడానికి సురక్షితమైన ఎంపిక.
ఆల్కలీన్ ప్రభావం:
ఎసిడిక్ నేచర్ ఉన్న ఆహారం మాంసం, పాల ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన స్నాక్స్ వంటివి తిన్నప్పుడు మీ శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. మీ రక్తప్రవాహంలో ఉన్న ఆమ్లాన్ని తటస్తం చేయడానికి మీ ఎముకల నుండి కాల్షియంను బయటకు పంపివేస్తుంది. మరోవైపు, బాదం పాలు ఆల్కలీన్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇది సమతుల్య పిహెచ్ స్థాయిని నిర్వహించడానికి, కాల్షియం నష్టం నివారించి ఎముకలను రక్షించడానికి సహాయపడుతుంది.
లాక్టోస్ లేని ప్రయోజనాలు: లాక్టోస్ సరిపడదు అనుకున్నవారికి, బాదం పాలు గేమ్ ఛేంజర్. బాదం పాలు పోషకాహారంలో రాజీపడవు. రుచికరమైనవి కూడా. మీ గట్ ను ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడికి గురి చేయదు.
బాదంపాలు, సాధారణ పాలతో పాటు పోటీపడి పోషక విలువలు అందించగలదా?
కాల్షియం కంటెంట్: బలవర్థకమైన బాదం పాలలో పాలతో సమానంగా కాల్షియం ఉంటుంది. (కప్పుకు సుమారు 300-450 మి.గ్రా).
విటమిన్ డి: చాలా బాదం పాల బ్రాండ్లు పాల బ్రాండ్ల మాదిరిగానే విటమిన్ డిను కలిగి ఉంటాయి.
కేలరీలు: బాదం పాలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు పెరగకూడదు అనుకునేవారికి మంచి ఛాయీస్.
జీర్ణక్రియ: బాదం పాలు చాలా మందికి జీర్ణక్రియ సమయంలో సులభంగా అనిపిస్తాయి. ముఖ్యంగా లాక్టోస్ అసహనం లేదా పాల సున్నితత్వం ఉన్నవారికి కూడా ఇబ్బంది కలిగించవు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాయాలను క్రోడీకరించి మాత్రమే మేము ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం