Morning Romance Benefits : మార్నింగ్ టైమ్‌లో రొమాన్స్ చేస్తే ఎన్ని లాభాలో..-all you need to know health benefits of morning sex and romance ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  All You Need To Know Health Benefits Of Morning Sex And Romance

Morning Romance Benefits : మార్నింగ్ టైమ్‌లో రొమాన్స్ చేస్తే ఎన్ని లాభాలో..

HT Telugu Desk HT Telugu
Feb 27, 2023 08:50 PM IST

Morning Romance Benefits : ఉదయం లేవడమే చిరాకు.. మళ్లీ రొమాన్సా అని అనుకుంటున్నారా? ఈ బిజీ లైఫ్ కారణంగా అంత టైమ్ ఎక్కడుందని ఆలోచిస్తున్నారా? కానీ ఉదయం రొమాన్స్ చేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

మార్నింగ్ రొమాన్స్
మార్నింగ్ రొమాన్స్

రొమాన్స్, సెక్స్ అంటే చాలా మంది సాయంత్రం లేదా రాత్రుళ్లు మాత్రమే అనుకుంటారు. కానీ ఉదయం వేళలో ఈ ప్రక్రియను చేస్తే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) ఉన్నాయి. సెక్స్ ఆరోగ్యానికి మంచిది. నిపుణులు కూడా అదే చెబుతారు. కానీ అందరూ.. రాత్రిపూటనే చేయాలనుకుంటారు. కానీ ఉదయం చేస్తే.. జిమ్ చేసినంత వర్కౌట్ అవుతుంది. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. సంభోగం అంటే సాయంత్రమే అని అపోహలో ఉండొద్దు.

మార్నింగ్ టైమ్ లో శృంగారం(Morning Sex) చేస్తే.. చాలా మంచిది. పురుషుల శరీరం, మనసు ఉదయం వేళల్లో సంభోగం చేసేందుకు సిద్ధంగా ఉంటుంది. ఈ కారణంగా వారు ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. దీనితో వారి పార్టనర్స్ కూడా హ్యాపీగా ఉంటారు. కానీ మహిళలు ఎక్కువగా ఈ సమయంలో ఇష్టపడరు అని చెబుతారు. కానీ సమయంలో రొమాన్స్(Romance), శృంగారం చేస్తే.. ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెప్పేమాట.

ఉదయం పూట హ్యాపీ మూడ్(Happy Mood) ఉంటుంది. ఈ సమయంలో రతిలో పాల్గొంటే.. రోజంతా సంతోషంగా ఉంటారు. ఎలాంటి ఒత్తిడి కూడా మీ మీద ఉండదు. ఆ తర్వాత ఎవరి పనుల్లోకి వారు వెళ్లినా మైండ్ ఫ్రీగా ఉంటుంది. మనసులో మంచి ఫీలింగ్ అనిపిస్తుంది. అంతేకాదు.. ఒక మంచి వ్యాయామంలాగా ఉంటుందట. ఉదయం పూట సెక్స్ చేయడం వలన.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎలాంటి సమస్యలు రాకుండా చేస్తుంది. అందుకే మార్నింగ్ శృంగారం మంచిదని నిపుణులు చెబుతారు.

ఉదయం సమయంలో రొమాన్స్ చేస్తే రక్త సరఫరా మెరుగుపడుతుంది. దీంతో చర్మం(Skin), జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఉదయం పూట రొమాన్స్ కారణంగా ముఖం కాంతివంతంగా మారుతుంది. మార్నింగ్ సెక్స్, రొమాన్స్ చేస్తే.. జిమ్ కు వెళ్లి చెమటలు చిందించినట్టేనని నిపుణులు చెబుతున్నారు. ఇది చేస్తే.. ఎక్సర్ సైజ్ చేసినట్టే. ఎన్నో కేలరీలు ఖర్చువుతాయి. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం