Berry Benefits : బెర్రీలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
Berry Benefits : బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ వంటి బెర్రీలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
చాలా మంది బెర్రీలు(Berries) తినడానికి ఇష్టపడతారు. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీలు గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను(Health Benefits) కలిగి ఉంటాయి. ఈ పండ్లను ఐస్ క్రీమ్ లు, కేక్ లు, స్మూతీస్ వంటివి వాటితో కలిపి కూడా తినొచ్చు. ఈ పండ్లు పుష్టికరమైనవి. అనేక వ్యాధుల నుండి మీ శరీరాన్ని రక్షిస్తుంది. ఈ పండ్లను తక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి గొప్ప ప్రయోజనాలను అందించవచ్చు.
ట్రెండింగ్ వార్తలు
బెర్రీలు యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. ఇందులో ఆంథోసైనిన్స్, ఎలాజిక్ యాసిడ్ మరియు రెస్వెరాట్రాల్ ఉన్నాయి, ఇవి మీ ఒత్తిడిని(Stress) తగ్గించడంలో సహాయపడతాయి. బెర్రీలు సహజంగా తీపి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. బెర్రీస్‌లో ఫైబర్(Fiber) పుష్కలంగా ఉంటుంది. ఇది మీ శరీరంలో జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.
ఇది మీ శరీరాన్ని ఇన్ఫెక్షన్, ఇతర గాయాల వాపు నుండి రక్షించడంలో సహాయపడుతుంది. ముఖ్యమైన ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, బెర్రీలు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో, రియు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
బెర్రీలు చర్మం(Skin) ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది మీ చర్మాన్ని రక్షిస్తుంది. బెర్రీస్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్ సి(Vitamic C), పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ కె, ప్రీబయోటిక్ మూలకాలు ఉంటాయి. ఇవి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
బెర్రీలు చర్మం ముడతలను తగ్గించడానికి సహాయపడతాయి. ఎందుకంటే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను నియంత్రించడానికి ఉపయోగపడతాయి. చర్మానికి కూడా మంచిది. బెర్రీలు పోషకాల బాండాగారం. రకరకాల బెర్రీల్లో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ కె, ప్రీబయోటిక్స్ కూడా ఉంటాయి.