Bathukamma Song Lyrics : చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ.. పూర్తి లిరిక్స్ మీకోసం
Bathukamma Songs With Lyrics In Telugu : బతుకమ్మ పాటల్లో చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ పాట చాలా ఫేమస్. ఈ పాటకు సంబంధించిన పూర్తి లిరిక్స్ మీ కోసం HT Telugu అందిస్తోంది.
బతుకమ్మ పాటల్లో కొన్ని పాటలు ఎక్కవగా వినిపిస్తుంటాయి. అలాంటి వాటిలో చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ పాట ఒకటి. ఈ పాట లిరిక్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. దీనికి సంబంధించి పూర్తి లిరిక్స్ మీకోసం. దీంతోపాటు చినుకు చినుకు వాన ఉయ్యాలో పాట లిరిక్స్ కూడా చూసేయండి.
చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ పాట
చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన
చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన
రాగి బిందె తీసుక రమణి నీళ్లకు పోతే
రాములోరు ఎదురాయెనమ్మో ఈ వాడలోన
చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన
వెండి బిందె తీసుక వెలది నీళ్లకు పోతే
వెంకటేషుడు ఎదురాయెనమ్మో ఈ వాడలోన
చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన
బంగారు బిందె తీసుక బామ నీళ్లకు పోతే
భగవంతుడు ఎదురాయెనమ్మో ఈ వాడలోన
చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన
పగిడి బిందె తీసుక పడితి నీళ్లకు పోతే
పరమేశుడు ఎదురాయెనమ్మో ఈ వాడలోన
చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన
ముత్యాల బిందె తీసుక ముదిత నీళ్లకు పోతే
ముద్దు కృష్ణుడు ఎదురాయెనమ్మో ఈ వాడలోన
చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన
చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన
బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన
చినుకు చినుకు వాన ఉయ్యాలో పాట
చినుకు చినుకు వాన ఉయ్యాలో
చిత్తడి వాన ఉయ్యాలో
పోదాము చిత్తరి ఉయ్యాలో
మూడు బాటలకాడికి ఉయ్యాలో
బాలలు బతుకమ్మ ఉయ్యాలో
పండుగనడిగిరి ఉయ్యాలో
పెద్దలకు వచ్చింది ఉయ్యాలో
పెతరమావాస్య ఉయ్యాలో
వజ్రాల వాకిట్లో ఉయ్యాలో
ముత్యాల ముగ్గులు ఉయ్యాలో
చిన్నంగ సన్నంగ ఉయ్యాలో
జల్లు కురవంగ ఉయ్యాలో
ఏ రాజు కురిపించే ఉయ్యాలో
ఏడు ఘడియల్లు ఉయ్యాలో
బంగారు వానలు ఉయ్యాలో
బాలాదరిమీద ఉయ్యాలో
అచ్చుమల్లెలు కురిసే ఉయ్యాలో
ఆలాద్రి మీద ఉయ్యాలో
సన్నమెల్లు కురిసే ఉయ్యాలో
చెన్నయ్యమీద ఉయ్యాలో
బొడ్డు మల్లెలు కురిసే ఉయ్యాలో
బోనగిరిమీద ఉయ్యాలో
బంతిపూలు పూసే ఉయ్యాలో
వనమెల్లకాసే ఉయ్యాలో
బంతిపూ తోట ఉయ్యాలో
బతుకమ్మ పేర్చిరి ఉయ్యాలో
తంగెడు పువ్వుల్ల ఉయ్యాలో
తల్లి నిన్ను పేర్చి ఉయ్యాలో
కట్లాయి పువ్వుల్ల ఉయ్యాలో
కన్నెలంతకూడి ఉయ్యాలో
పడచులంత కూడి ఉయ్యాలో
పసిడి బతుకమ్మను ఉయ్యాలో
చిన్నారులంత ఉయ్యాలో
చిట్టి బతుకమ్మను ఉయ్యాలో
భక్తితో పేర్చిరి ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
ఆడబిడ్డలంత ఉయ్యాలో
అత్తరు పన్నీరు ఉయ్యాలో
అత్తకోడండ్లు ఉయ్యాలో
గద్వాల చీరలు ఉయ్యాలో
తల్లిబిడ్డలంత ఉయ్యాలో
సన్నంచు చీరలు ఉయ్యాలో
అక్కచెల్లెళ్లు ఉయ్యాలో
పట్టంచు చీరలు ఉయ్యాలో
బయలెల్లినారు ఉయ్యాలో
భామలంతా కూడి ఉయ్యాలో
ఆలు ఆడ ఉయ్యాలో
కచ్చీరు కొచ్చిరి ఉయ్యాలో
ఆఘమేఘాల మీద ఉయ్యాలో
వానదేవుడొచ్చే ఉయ్యాలో
సంబంధిత కథనం