నుదుటిన సింధూరం, చీరకట్టు, మెడలో రూబీ నెక్లెస్ తో భారతీయతను కేన్స్ లో చాటిన ఐశ్యర్యారాయ్-aishwarya rai at cannes 2025 with verimilion and ruby necklace in saree ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  నుదుటిన సింధూరం, చీరకట్టు, మెడలో రూబీ నెక్లెస్ తో భారతీయతను కేన్స్ లో చాటిన ఐశ్యర్యారాయ్

నుదుటిన సింధూరం, చీరకట్టు, మెడలో రూబీ నెక్లెస్ తో భారతీయతను కేన్స్ లో చాటిన ఐశ్యర్యారాయ్

Haritha Chappa HT Telugu

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఐశ్వర్యరాయ్ లుక్ చాలా స్పెషల్ గా ఉంది. చీరతో పాటు మెడలో వేసుకునే ఎర్రటి రూబీ నెక్ పీస్ ఎంతో అందంగా ఉంది. నుదుటిన సింధూరాన్ని ఆమె ప్రత్యేకంగా ధరించింది. అందమైన చీరకట్టులో కేన్స్ వేదికపై భారతీయతను చాటింది.

కేన్స్ లో ఐశ్యర్యారాయ్ (instagram)

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై ఐశ్వర్యారాయ్ బచ్చన్ సందడి చేశారు. ఆమె వయసు పెరిగినా కూడా కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత అందంగా ఉన్నారు. ఐశ్వర్యరాయ్ లుక్ ఈసారి చాలా రాయల్ గా ఉంది. ఆమె భారతీయతను ప్రపంచానికి చాటేలా ముస్తాబైంది.

చీర కట్టు నుంచి నుదుటిన సింధూరం వరకు ఆమె భారతీయతను ప్రదర్శించింది. ఆమె మెడలో ధరించిన రూబీ నెక్లెస్ అందరి చూపును తనవైపు తిప్పుకుంది. ఏదేమైనా, మిసెస్ బచ్చన్ తన రాయల్ లుక్ తో అందంగా మెరిసింది.

ఐశ్యర్యా రాయ్
ఐశ్యర్యా రాయ్

ఆమె వేసుకున్న లేయర్డ్ నెక్ పీస్ రూబీ స్టోన్, అన్ కట్ డైమండ్ తో తయారు చేసినవి. ఈ నెక్ పీస్ ఎంతో ప్రత్యేకమైనదని చూస్తేనే అర్థమైపోతోంది. ఐశ్వర్యారాయ్ నెక్ పీస్ ను మనీష్ మల్హోత్రా రూపొందించారు. రూబీ రాళ్లతో చేసిన ఇలాంటి ఆభరణాలకు మనీష్ మల్హోత్రా పెట్టింది పేరు. ఐశ్వర్య వేసుకున్న ఈ నెక్లెస్ ను 500 క్యారెట్ల మొజాంబిక్ రూబీ, అన్ కట్ డైమండ్ తో తయారు చేశారు. దీనిని 18 క్యారెట్ల బంగారంలో ఇన్లైడ్ చేసి రూపొందించారు. అదే సమయంలో చేతిలో కనిపించే రెండు ఉంగరాలు కూడా రూబీ, డైమండ్ తో తయారు చేసినవే. ఐశ్యర్య తన మెడలో ధరించి చోకర్ నెక్ పీస్ కూడా రూబీలతో, వజ్రాలతో చేసినదే. ఈ చోకర్ కు ఒకే డైమండ్ పెండెంట్ ను జోడించారు.

కేన్స్ లో ఐష్
కేన్స్ లో ఐష్

ఐష్ చీర ఎంతో ప్రత్యేకం

మనీష్ మల్హోత్రా రూపొందించిన చీరనే ఐశ్యర్యాయ్ ధరించింది. ఈ చీర ఎంతో అందంగా ఉంటుంది. ఐవరీ రోజ్ గోల్డ్ అండ్ సిల్వర్ చీరలో ఫ్యాబ్రిక్ తో హ్యాండ్ నేవ్డ్ బనారసి చీర ఇది. ఈ చీరలో వెండి దారాలతో ఎంబ్రాయిడరీని చేశారు. దీనితో పాటూ ఐశ్వర్య చేతితో నేసిన తెల్లని టిష్యూ స్కార్ఫ్ ను ఎంచుకుంది. ఈ దుపట్టాపై బంగారం, వెండి జర్డోజీ ఎంబ్రాయిడరీ ఉంది. అందుకే ఈ చీర ఐశ్యర్యకు రాచరిక అందాన్ని, హూందాతనాన్ని ఇచ్చింది.

గతంలో కూడా చాలా సార్లు ఐశ్వర్యారాయ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరైంది. ఆ సందర్భాల్లో ఆమె పాశ్యాత్య దుస్తులకే ప్రాధాన్యత ఇచ్చింది. లాంగ్ గౌనులతో ఆమె ఆకట్టుకుంది. కానీ ఈసారి మాత్రం ఆమె భారతీయతను ప్రదర్శించేందుకు ప్రయత్నాంచింది. ఆపరేషన్ సింధూర్ తరువాత సింధూరం ప్రాముఖ్యత గురించి ఎన్నో కథనాలు వచ్చాయి. అందుకే ఆమె నుదుటిన సింధూరంతో అంతర్జాతీయ వేదికపై పాల్గొందని ఫ్యాషన్ నిపుణులు భావిస్తున్నారు. అలాగే చీరకట్టుతో భారతీయతను చాటేందుకు ఐష్ ప్రయత్నించింది.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.