Agarbatti Benefits : రోజూ ఇంట్లో అగర్ బత్తీలు కాల్చండి.. ఈ ప్రయోజనాలు పొందండి
incense sticks Benefits : అగర్ బత్తీలను పూజ గదిలో కాల్చుతూ ఉంటారు. అయితే ఇది ఆధ్యాత్మికతకు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
పూజలో అగర్ బత్తీలు అంటిస్తారు. దీని నుంచి వచ్చే పొగ వాసన అద్భుతంగా ఉంటుంది. ఇది ఒక వైపు ఆచారంగా ఉంది.. కానీ ఇలా అగర్ బత్తీ పుల్లలు కాల్చడం ఆరోగ్యానికి కూడా మంచిది. ఆర్గానిక్ అగరుబత్తీలు మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. సాధారణ అగర్ బత్తీలలో చాలా రసాయనాలను ఉపయోగిస్తారు. అవి ఆరోగ్యానికి హానికరం. సుగంధ ద్రవ్యాలలో క్యాన్సర్‌కు కారణమయ్యే జెనోటాక్సిన్ రసాయనాలు ఉంటాయి. ఇంట్లో లేదా ఇంటి లోపల ఆర్గానిక్ అగర్ బత్తిని ఉపయోగించవచ్చు. శరీరం, మనసు రెండూ బాగుంటాయి.
ఇక సాధారణ మార్కెట్‌లో లభించే అగర్ బత్తీలను వాడితే ఇంటి కిటికీలు తెరిచి ఉంచాలి. ఇల్లు సువాసనగా ఉంటుంది. కానీ శరీరానికి జరిగే నష్టం అంతగా ఉండదు. కిటికీలు, తలుపులు మూసి ఉంచి అగర్ బత్తీలను ఎప్పుడూ కాల్చవద్దు. అయితే రసాయనాలు లేని ఆర్గానిక్ అగర్ బత్తీలు కాలిస్తే మీకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి.
ఆందోళనను తగ్గుతుంది
భారతదేశంలో పురాతన కాలంలో దూపం కాల్చేవారు. తర్వాత అగర్ బత్తీలు తయారు చేశారు. అయితే వీటని కాల్చడం వలన మీకు ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. అరోమాథెరపీ యొక్క ప్రసిద్ధ రూపం ఇది. అగర్ బత్తీల వాసన ఏ వ్యక్తిలోనైనా ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది.
నిద్రకు ఉపయోగపడుతుంది
అగర్ బత్తీలు మీ నిద్రను మెరుగుపరుస్తాయి. నిద్రించడానికి గంట ముందు బెడ్‌రూమ్‌లో అగరబత్తిని వెలిగించండి. అప్పుడు పడుకునే ముందు కిటికీ తెరిచి ఉంచాలి. మీరు మంచి వాతావరణాన్ని చూస్తారు. అగర్ బత్తీల సువాసన మీరు నిద్రలోకి జారుకునేలా చేస్తాయి.
జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది
గులాబి సువాసనతో కూడిన అగర్ బత్తీలు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు. ఇలాంటి వాటిని ఇంట్లోనే తయారు చేయండి.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
యూకలిప్టస్, టీ ట్రీ సువాసనగల అగరుబత్తీలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎందుకంటే ఇందులో ఆయుర్వేద గుణాలు ఉంటాయి.
వాపును తగ్గిస్తుంది
సుగంధ అగర్ బత్తీలు మంటను తగ్గిస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్ రోగులు ఈ ధూపం వల్ల ప్రయోజనం పొందుతారు. అందుకే వీటిని మీ ఇంట్లో ఉపయోగించవచ్చు.
తలనొప్పి నుండి ఉపశమనం
యూకలిప్టస్, లావెండర్ సువాసన కలిగిన అగర్ బత్తీలు తలనొప్పిని తగ్గిస్తాయి. ఇవి మీ ఇంట్లో వెలిగిస్తే.. మీ మైండ్ రిఫ్రెష్ ఫీల్ వస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
దాల్చిన చెక్క సువాసనతో కూడిన అగర్ బత్తీలు జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. వీటి సువాసనతో మీకు హాయినివ్వడంతోపాటుగా జీర్ణక్రియకు సాయపడతాయి.
మంచి మానసిక స్థితిని ఉంచుతుంది
ఏదైనా అగర్ బత్తీ సువాసన మనస్సు, మానసిక స్థితికి మంచిది. మనశ్శాంతి లభిస్తుంది. మీకు మంచి మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయి. అందుకే వీటిని కాల్చుకోవడం మంచిది.
సృజనాత్మకతను పెంచుతుంది
ఏదైనా సృజనాత్మక పనికి అగర్ బత్తీల వాసన అవసరం. ఎందుకంటే మనస్సు బాగా ఉంచుకోగలదు. రాయడం, నృత్యం చేయడం ప్రారంభించే ముందు అగరుబత్తిని వెలిగించండి. మీ క్రియేటివిటీ పెరుగుతుంది. చాలా బాగా రాస్తారు, అందంగా డ్యాన్స్ చేస్తారు.
బాక్టీరియాను పొగొడుతుంది
గాలిలోని సూక్ష్మక్రిములను చంపే అనేక అగర్ బత్తీలు ఉన్నాయి. పొగ లేదా యూకలిప్టస్ వాసనతో కూడిన అగరబత్తీలు వాతావరణాన్ని చక్కగా ఉంచుతాయి. మీ గదిలో ఉన్న చెడు వాసనను పొగడతాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది ఇళ్లలో అగర్ బత్తీలను కాల్చుతున్నారు.