ఆప్టికల్ ఇల్యూషన్లు అంటే మీకు ఆసక్తి అయితే ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్ చేధించేందుకు ప్రయత్నించండి. దీనిలో ఆంగ్ల పదం After అన్నిచోట్లా ఉంది. ఒకచోట మాత్రం దాని స్పెల్లింగ్ తప్పుగా వచ్చింది. అది ఎక్కడ వచ్చిందో చూసి కనిపెట్టడమే మీ పని. ఎక్కువ సమయం ఇస్తే ఎవరైనా కనిపెట్టేస్తారు... కేవలం 5 నుంచి 10 సెకన్లలోపే మీరు ఆ జవాబును కనిపెట్టి చెప్పాలి.
ఆప్టికల్ ఇల్యూషన్లు మెదడుకు అవసరమైన వ్యాయామాన్ని అందిస్తాయి. మీరు ఇటువంటి పజిల్స్‌ను క్రమం తప్పకుండా సాధనం చేయడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. అలాగే మనస్సుకు కొత్త ఉత్సాహమొస్తుంది. పరిశీలనా సామర్ధ్యాలు పెరుగుతాయి. ఏకాగ్రతను పెంచడంలో కూడా ఆప్టికల్ ఇల్ల్యూషన్ ముందుంటుంది.
ఇక జవాబు విషయానికి వస్తే ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో Aftrer అనే పదాన్ని 10 సెకన్ల లోపు కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. ఇక మిగతావారు తమ పరిశీలన నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. జవాబు విషయానికొస్తే మూడవ నిలువ వరసలో కింది నుంచి మూడో పదమే జవాబు. అక్కడ After కి బదులుగా Apter అనే పడింది. అంటే F బదులుగా P పడింది.
ఆప్టికల్ ఇల్యూషన్లు మీ దృష్టిని, ఏకాగ్రతను ఏకం చేసేందుకు ఉద్దేశించిన పజిల్స్. మీరు దృష్టి కేంద్రీకరించి ఈ చిత్రాన్ని నిశితంగా పరిశీలిస్తే త్వరగా జవాబును కనిపెట్టేయగలరు. కానీ మీ మనసు అక్కడున్న పదాలను విడివిడిగా కాకుండా మొత్తం కలిపి ఒకే చిత్రంగా చూస్తుంది. దీనివల్ల అన్నిచోట్లా పదం సరిగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆప్టికల్ ఇల్యూషన్ అంటేనే ఇలా భ్రమలు కల్పించే పజిల్.
ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు ఎన్నో ఉన్నాయి. వీటిని తరచూ చేధించడం ద్వారా మీ మెదడు సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. మీ పరిశీలనా నైపుణ్యాలను కూడా పెంచుకోవచ్చు. కంటి చూపుకు, మెదుడుకు మధ్య అనుసంధానాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు.
సంబంధిత కథనం